దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ....మోడీ కామెంట్స్ కి కౌంటర్ గా !

ఎర్ర కోట మీద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన స్పీచ్ లో దిమాగీ నక్సల్స్ అని విమర్శిచారు.

Update: 2026-08-17 07:44 GMT

ఎర్ర కోట మీద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన స్పీచ్ లో దిమాగీ నక్సల్స్ అని విమర్శిచారు. తమ ప్రభుత్వం అడవులలో ఉన్న నక్సలైట్ల మీద విజయం సాధించి అక్కడ నిర్మూలించిందని కానీ ఇంకా దిమాగీ నక్సల్స్ చుట్టు పక్కల ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. అంతే కాదు అధికార వ్యవస్థ కు దగ్గరగా గతంలో మావోయిస్టు భావజాలం ఉన్న కొందరు ఉంటూ తమ ప్రభావం చూపించారని కూడా మోడీ అన్నారు. వారు ఏకంగా ప్రభుత్వం కమిటీలలో కూడా స్థానం సంపాదించి ప్రభుత్వ విధానాలను కూడా ప్రభావితం చెశారు అని అన్నారు. ఇలా మోడీ దిమాగీ నక్సల్స్ అంటూ చేసిన కామెంట్స్ మీద దేశంలో కొత్త చర్చ వాడి వేడిగా ఒక వైపు జరుగుతూండగానే మరో వైపు దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ అంటూ సోషల్ మీడియా ఖాతా ప్రారంభం కావడం విశేషం.

భగత్ సింగ్ అనుచరులమంటూ :

మరి దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ పేరుతో ఖాతాను ఎవరు ప్రారంభించారో తెలియదు కానీ కొత్త అకౌంట్ ల పోస్టులు చూస్తే మోడీ వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ కనిపిస్తున్నాయి. మేము భగత్ సింగ్ వారసులమని కూడా పోస్టులు పెడుతున్నారు. మా ఖాతాలను తీసి వేయడం కానీ బ్లాక్ చేసి మమ్మల్ని దేశ్ వ్యతిరేకులుగా చిత్రీకరించాలని చూస్తే కనుక ఏకంగా భగత్ సింగ్ ని అవమానించినట్లే అని కూడా హెచ్చరిస్తూ ఈ పోస్టులు కనిపిస్తున్నాయి. అంతటితో ఆగకుండా తమకు నిధులు ప్రధాని కేర్స్ ఫండ్ నుంచి వస్తున్నాయని కావాలంటే ఆడిట్ చేయించుకోవచ్చు అంటూ కూడా పోస్టులు పెడుతూ తమ విధానాలను తెలియచేస్తూ కేంద్రం తీరు మీద విమర్శలను చేస్తూ సంచలన క్రియేట్ చేస్తున్నారు.

ప్రతిపక్ష పార్టీలను ఫాలో :

ఇక దిమాగీ నక్సల్ జనతా పార్టీ అయితే తన అకౌంట్ ద్వారా ప్రతిపక్ష పార్టీలను ఫాలో అవుతోంది. రాహుల్ గాంధీ ఆప్ అధినేత కేజ్రీవాల్ అలాగే ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, నటుడు ప్రకాష్ రాజ్ లతో పాటు పొలిటికల్ కంటెంట్ క్రియేటర్లు యూ ట్యూబర్లు సెటైరికల్ అకౌంట్స్ ని ఫాలో అవుతోంది. దిమాగీ నక్సల్ జనతా పార్టీ అకౌంట్ ప్రస్తుతం 13 ఖాతాలను ఫాలో అవుఓంది. అంతే కాదు ప్రతిపక్ష ప్రముఖులు ఎవరు పోస్టు చేసినా దానికి రీ ట్వీట్ చేస్తూ తమ ఖాతాలో దానిని ఉంచుతోంది.

ఒక్క రోజులోనే లక్షకు పైగా :

ఇక ఇన్స్టా గ్రామ్ లో దిమాగీ నక్సల్ జనతా పార్టీ అకౌంట్ ఓపెన్ చేయగానే ఒక్క రోజులోనే ఏకంగా 1.6 లక్షలకు పైగా ఫాలోవర్స్ వచ్చి ఈ ఖాతాలో చేరడం విశేషంగా చూస్తున్నారు. ఈ అకౌంట్ తాజాగానే మొదలైనప్పటికీ యూజర్ నేమ్ ఎవరో ఎవరు నడుపుతున్నారో మాత్రం వివరాలు అయితే లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి పి చిదంబరం మోడీ వ్యాఖ్యలకు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాను దిమాగీ నక్సల్‌ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని ఆయన చెప్పడం కూడా సంచలనం అయింది. దీని మీద కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ ఇస్తూ మోడీ ఏ ఉద్దేశ్యంతో దిమాగీ నక్సల్స్ గురించి ప్రస్తావించారో చెప్పారు. ఆయన ప్రతిపక్షాల గురించి మాట్లాడలేదని కూడా చెప్పారు. భారత రాజ్యాంగాన్ని ధిక్కరించే వారు, వేర్పాటు వాద శక్తులకు మద్దతు ఇచ్చ్చే వారు దేశంలోని ఈశాన్య భారతాన్ని ఇతర ప్రాంతాలతో కలిపి ఉంచే చికెన్ నెక్ ప్రాంతాన్ని విడదీయాలని డిమాండ్ చేసే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ కామెంట్స్ చేశారు అని అన్నారు. అయితే ఇపుడు దిమాగీ నక్సల్స్ జనత పార్టీ అకౌంట్ ఏర్పాటుతో మాత్రం మరింత సంచలనంగా మారుతోంది.

Tags:    

Similar News