న్యాయవాదికి తప్పని డిజిటల్ అరెస్ట్.. ఏకంగా అరకోటికి పైగా..

సైబర్ నేరగాళ్లు వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులను ఎక్కువగా టార్గెట్ చేస్తారు.. కానీ ఈ సారి ఆ పంథా మార్చుకున్నారో ఏమో.. ఒక చదువుకున్న యంగర్ ను టార్గెట్ చేశారు;

Update: 2025-11-01 15:30 GMT

సాంకేతికత పెరుగుతున్నా కొద్దీ సైబర్ దాడులు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులను ఎక్కువగా టార్గెట్ చేస్తారు.. కానీ ఈ సారి ఆ పంథా మార్చుకున్నారో ఏమో.. ఒక చదువుకున్న యంగర్ ను టార్గెట్ చేశారు. ఆమె నుంచి ఏకంగా అరకోటికిపైగా లాగారు.. పైగా చదువుతున్న వ్యక్తి ఏదో సాదాసీదా చదువు కాదు.. న్యాయవాది వృత్తి చేసింది. ఈ న్యాయవాది గురించి ఇప్పుడు ఏపీలో చర్చ మొదలైంది. ‘అంత చదువుకున్న వ్యక్తి ఎలా మోసపోయిందని’ అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను అరెస్టు చేయడం ముఖ్యమైన విజయం. ఏలూరు జిల్లాలోని మహిళా న్యాయవాది కుమారులు అమెరికాలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని బెదిరించి, సదరు మహిళా న్యాయ వాదిని ‘డిజిటల్ అరెస్టు’ పేరుతో రూ.52 లక్షలు గుంజింది ఈ ముఠా దేశ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా స్వాహా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన, సైబర్ మోసాల తీరును వివరిస్తుంది. పోలీసులు యూపీ, ఢిల్లీ, మహారాష్ట్రలో 8 మందిని అరెస్టు చేసి, కీలక సూత్రధారులు బంగ్లాదేశ్‌కు పారిపోయినట్లు కనుగొన్నారు. ఈ మోసాలు కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు.. మానసిక ఒత్తిడి, కుటుంబాల భవిష్యత్తుకు గుర్తింపు.

ఈ ముఠా మోడస్ ఆపరేషన్ భయం కల్పించడమే. మహిళా న్యాయవాది అమెరికాలో ఉన్న కుమారులు మనీ లాండరింగ్, డ్రగ్ కేసుల్లో చిక్కుకున్నారని ఫోన్ చేసి, వీడియో కాల్స్‌లో ‘పోలీసు’లుగా మారి బెదిరించారు. ‘డిజిటల్ అరెస్టు’ అంటే, బయటకు వెళ్లకూడదు, కుటుంబానికి చెప్పకూడదు, మొత్తం డబ్బు బ్యాంక్ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలని ఒత్తిడి చేసి, మల్వేర్ అకౌంట్ల ద్వారా డబ్బు కొల్లగొట్టారు. దీంతో బాధితురాలు ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు బృందాలు రంగంలోకి దిగి ఎనిమిది మందిని పట్టుకున్నాయి. ముఠా సభ్యులు బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్‌లో ఆఫీసులు నడుపుతూ, బంగ్లాదేశ్, దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతున్నారు. ఇలాంటి మోసాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి 2025లో రూ.10,000 కోట్లకు పైగా వీరు కొల్లగొట్టినట్లు NCRB డేటా ప్రకారం వివరిస్తోంది.

ఈ ఘటన సైబర్ మోసాల తీరుకు దర్పణం. ‘డిజిటల్ అరెస్టు’ మోసాలు 2024-25లో 300 శాతం పెరిగాయి. ముఖ్యంగా NRI కుటుంబాలు వీరి టార్గెట్. మోసగాళ్లు సీబీఐ, ఈడీ పోలీస్ యూనిఫాం ధరించి వీడియోలు చేసి, ‘అరెస్ట్ వేరెంట్’ చూపించి భయపెడతారు. బాధితురాలు లాంటి మహిళలు, వృద్ధులు, ఎన్ఆర్ఐలు వీరికి బలవుతున్నారు. ఈ ముఠా దేశ వ్యాప్తంగా 100కు పైగా కేసుల్లో ఇన్వాల్వ్ అయింది. మల్ అకౌంట్లు, క్రిప్టో వాలెట్ల ద్వారా డబ్బు వాష్ చేస్తుంది. పోలీసులు అరెస్టులతో రూ.20 లక్షలు రికవరీ చేశారు. కానీ మిగిలిన మొత్తం ట్రేస్ చేయడం సవాలుగా మారింది. బంగ్లాదేశ్ నుంచి ఆపరేట్ అవుతున్న సూత్రధారులు, ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ అవసరాన్ని చూపిస్తున్నారు.

విమర్శనాత్మకంగా చూస్తే, సైబర్ మోసాలు పెరగడానికి పోలీస్, బ్యాంకింగ్ సిస్టమ్ లోపాలు కారణంగా భావించవచ్చు. మల్ అకౌంట్లు సులభంగా ఓపెన్ అవుతున్నాయి. ట్రాన్సాక్షన్ మానిటరింగ్ బలహీనంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా 52+ కేసుల్లో ఈ ముఠా ఇన్వాల్వ్డ్ (ఢిల్లీ పోలీస్ రిపోర్ట్ ప్రకారం) అయినట్లు తేలింది. బంగ్లాదేశ్, దుబాయ్ నుంచి ఆపరేషన్లు ఇంటర్నేషనల్ సహకారం లోపాన్ని చూపిస్తున్నాయి. బాధితులు మానసిక ట్రామాకు గురవుతున్నారు ‘డిజిటల్ అరెస్టు’లో రోజులు గడపడం, కుటుంబాలు భయపడడం. ప్రభుత్వం సైబర్ అవగాహన క్యాంపెయిన్లు నడుపుతోంది ఇంప్లిమెంటేషన్ లోపం. ఏపీ పోలీసులు మూడు రాష్ట్రాల్లో అరెస్టులు చేసి విజయం సాధించినా.. మిగిలిన మొత్తం రికవరీ, అంతర్జాతీయ అరెస్టులు సవాలుగానే మారుతున్నాయి.

పోలీసులు మల్ అకౌంట్లు, క్రిప్టో ట్రాన్సాక్షన్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. బ్యాంకులు కేవైసీని మరింత బలోపేతం చేసి, సస్పిషియస్ ట్రాన్సాక్షన్లు రిపోర్ట్ చేయాలి. ప్రభుత్వం ఇంటర్నేషనల్ అగ్రీమెంట్లు పెంచాలి. ప్రజలు అన్‌కన్ కాల్స్‌కు భయపడకుండా.. సైబర్ హెల్ప్‌లైన్ (1930)కు కాల్ చేయాలి. NRIలకు అవగాహనా సెమినార్లు నిర్వహించాలి. ఏపీ పోలీసులు ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేయడం సైబర్ మోసాలకు పాల్పడుతున్న వారికి హెచ్చరిక. ముఠా సభ్యులను కఠినంగా శిక్షించాలి. డిజిటల్ యుగంలో భద్రత ముఖ్యం అవగాహన, చర్యలతో మాత్రమే మనవి సురక్షితం.

Tags:    

Similar News