రఘురామా ఇది నిజమేనా ?

అలా ఏపీ రాజకీయాల్లో బాగా నలుగుతూ ఈ రోజున ఆయన ఒక్కసారిగా స్టేట్ లెవెల్ ఫిగర్ గా మారిపోయారు.

Update: 2024-05-23 17:25 GMT

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు 2019 ఎన్నికల ముందు వరకూ గోదావరి జిల్లాలో కొంత తప్ప ఎవరికీ తెలియరు అని అంటారు. అలాంటి ఆయన 2019లో వైసీపీ నుంచి గెలిచిన తరువాత తొలి ఆరు నెలలలో జగన్ మీద తిరుగుబాటు చేసి విపక్ష కూటమికి కేంద్ర బిందువు అయ్యారు. అలా ఏపీ రాజకీయాల్లో బాగా నలుగుతూ ఈ రోజున ఆయన ఒక్కసారిగా స్టేట్ లెవెల్ ఫిగర్ గా మారిపోయారు.

ఆయన మాట్లాడితే వైరల్ అన్నట్లుగా ఉంది. తలపండిన నేతలు సీనియర్లు ఎంత మంది ఉన్నా రఘురామ మీడియా మీట్ కే వాల్యూ ఎక్కువగా ఉంది. ఇక ఆయన టీడీపీ గెలిస్తే ప్రభుత్వంలో కూడా మంత్రిగా చేరుతారు అని అంటునారు. ఆయనకు నర్సాపురం ఎంపీ టికెట్ ఏ కరణం వల్ల తప్పిపోయిందో తెలియదు కానీ ఇపుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి కూటమి అధికారంలోకి వస్తే మినిస్టర్ గా వస్తే ఆ దర్జా వేరే లెవెల్ అని అంటున్నారు.

ఇదిలా ఉండగా ఏపీలో అనేక ప్రతిష్టాత్మకమైన సీట్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమంత్రి జగన్ పులివెందుల, చంద్రబాబు కుప్పం పవన్ కళ్యాణ్ పిఠాపురం నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇపుడు ఆ జాబితాలో మరో సీటు కూడా వచ్చి చేరింది.

అంతే కాదు బెట్టింగ్ బంగార్రాజులు అక్కడ కూడా బుకింగ్ ఓపెన్ చేసి కోట్లలో పందాలకు రెడీ అయిపోయారు. ఉండిలో రఘురామ గెలుపు మీద పందాలు కాదట. ఏకంగా ఆయన మెజారిటీ మీదనే కాస్తున్నారు అంటే రఘురామ గెలుపు ఫిక్స్ అని ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉండిలో లాస్ట్ మినిట్ లో టీడీపీ తరఫున టికెట్ సంపాదించి పోటీకి దిగిన రఘు రామ లేటెస్ట్ గానే అన్నట్లుగా సక్సెస్ రూట్ లో దూసుకుని పోయారు అని అంటున్నారు.

Read more!

అక్కడ టీడీపీ నుంచి రెబెల్ గా శివరామరాజు పోటీలో ఉన్నా వైసీపీ నుంచి కూడా గట్టి అభ్యర్ధి పోటీ పడినా ఈ ట్రయాంగిల్ ఫైట్ లో కూడా ప్రజలు రఘురామకే పట్టం కట్టారు అని అంటున్నారు. దాంతో రఘురామ గెలుపు ప్రశ్న కాదు, ఆయన మెజారిటీయే అని అంటున్నారు. అలా ఆయనకు వచ్చే మెజారిటీ ఎంత అన్న దాని మీద వీర్ల లెవెల్ లో బెట్టింగులు జరుగుతున్నాయని అంటున్నారు.

అవి కాస్తా ఇపుడు పెరిగి ఏకంగా ముప్పయి అయిదు కోట్ల దాకా చేరాయని అంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో బెట్టింగులు రఘురామ మీద కాస్తున్నారు అంటే ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది అని అంటున్నారు. రఘురామ పదివేలకు తక్కువ లేకుండా గెలుస్తారు అని బెట్టింగులు కొన్ని జరుగుతూంటే ఆయన పదిహేను వేలు పై దాటి గెలుస్తారని మరో వైపు బెట్టింగులు జరుగుతున్నాయి.

ఇక రఘురామ పాతిక వేల ఓట్ల తేడాతో భారీ విజయం సాధిస్తారు గుర్తు పెట్టుకోండి అని బెట్టింగ్ రాయుళ్ళు కోట్ల రూపాయలతో ముందుకు వస్తున్నారు అంటే రఘురామ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏ రేంజిలో ఉందో అంటున్నారు. ఇవన్నీ చూస్తున్న వారు రఘురామ ఇది నిజమేనా అని ఆయన పొలిటికల్ ఇమేజ్ ని చూసి ఆశ్చర్యంతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారుట. మరి ఇంతటితో ఊరుకోని వారు గెలిస్తే మంత్రి అవుతారు ఎంత పందెం అని కూడా రంగంలోకి దిగుతున్నారు. మొత్తానికి ఈసారి గోదావరి జిల్లాలలో రఘురామ మీద కడుతున్న బెట్టింగులు వెరీ స్పెషల్ అని అంటున్నారు.

Tags:    

Similar News