మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డెలివరీ బాయ్... వైరల్ వీడియో!
అవును... ఓ మహిళతో డెలివరీ బాయ్ అసభ్యంతరంగా ప్రవర్తించిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఈ సమయంలో మహిళకు పార్శిల్ డెలివరీ ఇచ్చిన ఆ వ్యక్తి.. ఆమె నుంచి క్యాష్ తీసుకుంటున్న క్రమంలో ఆమె ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడు.;
కాలం ఎంత మారినా.. సమాజం ఎంత ముందుకు పోతున్నా.. మహిళల విషయంలో పలువురి మగాళ్ల బుద్ది లేని పనులు, అసభ్యకరమైన ఆలోచనలు మాత్రం మారడం లేదు! దీంతో... మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, చిల్లర చేష్టలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ షాకింగ్ వీడియో తెరపైకి వచ్చింది. ఇందులో ఓ మహిళ ప్రైవేట్ పార్ట్స్ ను డెలివరీ బాయ్ టచ్ చేశాడు!
అవును... ఓ మహిళతో డెలివరీ బాయ్ అసభ్యంతరంగా ప్రవర్తించిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఈ సమయంలో మహిళకు పార్శిల్ డెలివరీ ఇచ్చిన ఆ వ్యక్తి.. ఆమె నుంచి క్యాష్ తీసుకుంటున్న క్రమంలో ఆమె ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడు. ఆ సమయంలో ఒక్కసారిగా షాకైన ఆమె వెనక్కు జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వైరల్ అవుతున్న వీడియో క్లిప్ లో... బ్లింకిట్ యెల్లో కోడ్ డ్రెస్ ధరించిన ఆ డెలివరీ బాయ్, మహిళకు పార్సిల్ ఇస్తూ పేమెంట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆమె ఛాతిని చేతితో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు! దీంతో మహిళ అతడిపై అసహనం ప్రదర్శించింది. ఇదే విషయాన్ని ఆ మహిళ తన 'ఎక్స్' ఖాతాలో వెల్లడించింది.
ఇందులో భాగంగా... 'ఈ రోజు నేను బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టినప్పుడు ఈ ఘటన జరిగింది. డెలివరీ బాయ్ నన్ను అడ్రస్ అడుగుతూ అసభ్యంగా నా ప్రైవేట్ పార్ట్ తాకాడు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. బ్లింకిట్ ఈ ఘటనపై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి అని చెబుతూ... భారతదేశంలో మహిళల భద్రత ఒక జోకేనా? అని ఆమె ఓ ప్రశ్న లేవనెత్తింది.
అయితే ఈ ఘటనపై తొలుత బ్లింకిట్ స్పందించలేదు. ఆ తర్వాత ఆమె క్లియర్ గా ప్రూఫ్స్ పెట్టడంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సదరు డెలివరీ బాయ్ ను విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత.. 'మీరు సరైన సమయంలో చెప్పిన విషయాలను మేము గ్రహిస్తున్నాం.. ఈ ఘటనపై మేము చింతిస్తున్నాం.. ఈ ఘటనపై స్పందించి, సరైన నిర్ణయం తీసుకున్నాం అని తెలిపింది.