2025 లాస్ట్ మంత్ లో సెలవలే సెలవులు

చూస్తూండగానే 2025 టాటా కొట్టేసి వెళ్ళిపోబోతోంది. డిసెంబర్ నెలతో కౌంట్ డౌన్ మొదలవుతోంది.;

Update: 2025-11-27 17:47 GMT

చూస్తూండగానే 2025 టాటా కొట్టేసి వెళ్ళిపోబోతోంది. డిసెంబర్ నెలతో కౌంట్ డౌన్ మొదలవుతోంది. అలా 2025 కాల గర్భంలో కలిసేందుకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దాదాపుగా నవంబర్ పూర్తి అయింది. డిసెంబర్ లోకి ప్రపంచం అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త నెల అనగానే సెలవులు ఎన్ని అన్న చర్చ వస్తుంది. పైగా ఇయర్ ఎండింగ్ మంత్ కావడంతో చాలా ప్లాన్స్ ఉంటాయి. టూర్స్ బాకీ ఉంటాయి. దాంతో డిసెంబర్ మీద చాలా మంది ఫోకస్ కచ్చితంగా ఉంటుంది.

పాతిక శాతం పైగా :

అయితే డిసెంబర్ నెలలో ఏకంగా ఎనిమిది రోజుల సెలవులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో నాలుగు ఆదివారాలు, ఒక సెకండ్ శాటర్ డే, 25న క్రిస్మస్ ఉన్నాయి. అలాగే క్రిస్మస్ ముందు రోజు అంటే డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్,న కూడా ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. ఇక డిసెంబర్ 26 బాక్సింగ్ డే గా సాధారణ సెలవు కూడా ఇస్తారు అని చెబుతున్నారు. ఇలా కలుపుకుంటే ఎనిమిది రోజులు అయ్యాయి అన్న మాట. క్రిస్టియన్ మిషనరీలు, ఎస్సి గురుకులాలు, క్రిస్టియన్ విద్యార్థులు ఎక్కువగా చదివే విద్యాసంస్థలకు మాత్రం ఎక్కువ రోజులు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ స్కూళ్లకు డిసెంబర్ 21 నుండి 28 వరకు 8 రోజులు సెలవులు ఉంటాయి.

వింటర్ సీజన్ లో :

సాధారణంగా టూరిజం అంతా వింటర్ సీజన్ లోనే ఎక్కువగా నడుస్తుంది. దాంతో సెలవులు ఎక్కువగా ఉంటే బాగుంటుంది అని అంతా కోరుకుంటారు. ఈ నేపధ్యంలో డిసెంబర్ లో ఎనిమిది రోజులు సెలవులు రావడం అంటే గ్రేటే అని అంటున్నారు. వీటితో పాటు కొత్తగా కొన్ని రోజులు సెలవులు పెట్టుకుంటే హ్యాపీగా నచ్చే ప్లేస్ కి టూర్లు చేసుకోవచ్చు. బంధువులు స్నేహితులు తమకు కావాల్సిన వారితో ఈ విధంగా టూర్లకు ప్లాన్స్ వేసుకునే వారికి డిసెంబర్ ఒక భారీ ఆఫర్ గా ఎక్కువ సెలవులు ఇస్తోంది అని అంటున్నారు.

బ్యాంకులకు ఎక్కువే :

ఇక డిసెంబర్ నెలలో బ్యాంకులకు ఎక్కువ సెలవులు ఉన్నాయి. దాంతో కస్టమర్లు జాగ్రత్తగా తమ లావాదేవీలను చూసుకోవాల్సి ఉంది. దేశంలోని అనేక బ్యాంకులకు ఆయా చోట్ల సెలవులు కలుపుకుని బ్యాంకులకు మొత్తంగా పదహారు దాకా సెలవులు ఇస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తే ఏడు సెలవులు కచ్చితంగా ఉన్నాయి. అవి నాలుగు ఆదివారాలతో పాటు రెండు శనివారాలు, క్రిస్మస్ డేగా ఉండబోతున్నాయి. దాంతో బ్యాంకులు ఆయా సమయంలో మూత పడతాయని అంటున్నారు.

Tags:    

Similar News