3+3, 4+4 నుంచి 4+4, 10+10... దస్తగిరి భద్రత పెంపుకు కారణం ఇదే!

అయితే... కడప కోర్టు ఆదేశాలతో ఆ విషయంపై విమర్శలు ఆగినా.. ఆ కేసులో అప్రూవర్ గా మార్పిన దస్తగిరి వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ గానే మారుతుంది!

Update: 2024-04-24 09:38 GMT

ఎన్నికల సమయంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌ గా మారిన దస్తగిరి వ్యవహరం హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి మొన్నటివరకూ వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంపైనే కడపలో రాజకీయ విమర్శలు హీటెక్కేవి. అయితే... కడప కోర్టు ఆదేశాలతో ఆ విషయంపై విమర్శలు ఆగినా.. ఆ కేసులో అప్రూవర్ గా మార్పిన దస్తగిరి వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ గానే మారుతుంది!

ఈ క్రమంలో తాజాగా దస్తగిరికి భద్రతను మరింత పెంచారు అధికారులు. పులివెందులలో తన నామినేషన్‌ ను అడ్డుకోవాలని అధికార వైసీపీ చూస్తోందని వివేకా హత్య కేసులో అప్రూవర్‌, జై భీమ్‌ భారత్‌ పార్టీ అభ్యర్థి దస్తగిరి ఆరోపించారు. ఇదే క్రమంలో... తనపై రాళ్ల దాడికి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం అందిందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే దస్తగిరికి భద్రత పెంచారని తెలుస్తుంది!

ఇదే విషయాలపై మరింత స్పందించిన దస్తగిరి... తన నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని నేటి నుంచి గురువారానికి మార్చుకున్నట్లు చెప్పారు. సీఎం జగన్‌ నామినేషన్‌ వేసినప్పుడే తానూ వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పులివెందులలో తనను.. జగన్‌, అవినాష్‌ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అయినప్పటికీ... తాను దేనికీ భయపడే ప్రసక్తే లేదని దస్తగిరి అన్నారు!

ఈ పరిస్థితుల్లో రెండు రోజుల పాటు (బుధవారం, గురువారం) దస్తగిరికి భద్రత పెంచారు. నామినేషన్‌ నేపథ్యంలోనే ఈ భద్రత పెంపు అని తెలుస్తుంది. గురువారం ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు. దీంతో ఆయనకు బుధ, గురువారాల్లో భ్ద్రతను 3+3, 4+4 నుంచి 4+4, 10+10 కు పెంచారు.

కాగా... ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. గురువారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన తన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి సీఎం జగన్‌.. ఉదయం 11 గంటల ప్రాంతంలో నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఈ నేపథ్యంలో... తాను కూడా అప్పుడే నామినేషన్ దాఖలు చేస్తానని దస్తగిరి తెలిపారు!

Tags:    

Similar News