• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బుల్లెట్ నడిపాడని చేతులు...

బుల్లెట్ నడిపాడని చేతులు నరికేశారు.. తమిళనాడులో ఘోరం

| విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. తాలిబాన్ తరహా చర్యలకు పాల్పడిన ఈ ఆరాచకానికి తమిళనాడు కేరాఫ్ అడ్రస్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2025-02-14 04:24 GMT

విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. తాలిబాన్ తరహా చర్యలకు పాల్పడిన ఈ ఆరాచకానికి తమిళనాడు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఒక దళిత యువకుడు తనకు ఇష్టమైన బుల్లెట్ బండిని నడపటం ఘోరమైన నేరంగా భావించటమే కాదు.. రెండు చేతుల్ని నరికేసిన అరాచక ఘటన తాజాగా చోటు చేసుకుంది. తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఈ దారుణ ఉదంతం జరిగింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు పెట్టటం.. ముగ్గుర్ని అరెస్టు చేయటం లాంటి జరిగినా.. అసలు ఇంతటి దారుణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

శివగంగ జిల్లా మేల్ పిడవూరు గ్రామానికి చెందిన అయ్యాసామి.. శివగంగలోని ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల ఇతగాడు తనకు ఎంతో ఇష్టమైన బుల్లెట్ బండి కొన్నాడు. ప్రతి రోజు తనకెంతో ఇష్టమైన బుల్లెట్ బండిని నడుపుకుంటూ కాలేజీకి పోతున్నారు. ఇతగాడి తీరును భరించలేకపోయారు ఆ గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వారు ఆగ్రహంగా ఉన్నారు.

జాతి తక్కువవాడివి బుల్లెట్ బండి నడుపుతావా? అంటూ రాయలేని భాషను వాడారు. అంతేకాదు.. తమ ముందే బండి ఎక్కటం.. బుల్లెట్ బండి కావాల్సి వచ్చిందా? అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడటమే కాదు.. అతగాడి మీద దాడి చేశారు. ఈక్రమంలో కత్తులతో యువకుడి రెండు చేతులని నరికేశారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. రెండు చేతులుతెగిన వేళలో.. చుట్టుపక్కల వారు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే అతడి రెండు చేతుల్ని అతికించేందుకు వైద్యులు సర్జరీ చేస్తున్నారు.

బాధితుడ్ని ఆసుపత్రికి తరలించిన వేళలోనూ.. అతడి మీద దాడి చేసిన వారు అక్కడితో ఆగలేద సరికదా.. అతడి ఇంట్లోకి వెళ్లి సామాన్లను ధ్వంసం చేయటం గమనార్హం. తమ కంటే తక్కువ కులానికి చెందిన వ్యక్తి ఖరీదైన బుల్లెట్ వాహనాన్ని కొని నడపటాన్నిసైతం జీర్ణించుకోలేని సమాజం మన చుట్టూ ఉందన్న విషయం అర్థమైనప్పుడు.. వెన్నులో చిన్నపాటి వణుకు రాక మానదు.

Tags:    
  • TamilNadu 
  • DalitYouth 
  • SocialInjustice 
  • CasteDiscrimination 
  • BulletBikeAttack 
  • ShockingIncident 
  • HumanRights 
  • CasteViolence 
  • TamilNaduNews 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS