సోషల్ మీడియా యూజర్స్ కి బిగ్ అలెర్ట్.. 15 కోట్ల పాస్వర్డ్ లు లీక్.. ఆ కామన్ పాస్‌వర్డ్ చూసారా?
ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.;
ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాస్త యాదమరిచామో అకౌంట్ మొత్తాన్ని లూటీ చేస్తున్నారు. అంతేకాదు వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తూ.. వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే రహస్యంగా దాచుకుంటున్న విషయాలను కూడా మాల్వేర్ యాప్ లను ఉపయోగించి వాటిని కూడా దొంగలిస్తూ అసలు భద్రత లేకుండా చేస్తూ ప్రజలకు, యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
అందులో భాగంగానే ఇక సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు.. యువతను మొదలుకొని.. చిన్నవాళ్లు, పెద్దవాళ్లు ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అందులో భాగంగానే ఫేస్ బుక్ , వాట్సప్, ఇన్స్టాగ్రామ్, జీ మెయిల్, నెట్ ఫ్లిక్స్ వంటి వాటిలోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నారు. పైగా వీటన్నింటికీ అకౌంట్ కావాలి అంటే వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిందే.
అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా తమ వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లకుండా బలమైన పాస్వర్డ్ పెట్టుకోవాలని అధికారులు ఎంతగా సూచిస్తున్నా.. చాలామంది చాలా కామన్ గా ఉండే పాస్ వర్డ్స్ ఉపయోగించి ఇప్పుడు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 15 కోట్ల పాస్ వర్డ్స్ లీక్ అయ్యాడట. ముఖ్యంగా ఈ పాస్ వర్డ్స్ అన్నీ కూడా నెట్ ఫ్లిక్స్, ఫేస్ బుక్ , జీ మెయిల్, ఇన్ స్టా , బ్యాంకింగ్, క్రిప్టో అకౌంట్లకు సంబంధించిన యూజర్ ఐడి లతో పాటు పాస్వర్డ్ లీక్ అయినట్లు సైబర్ అధికారులు గుర్తించారు.
ఇకపోతే ఆయా అకౌంట్ హోల్డర్స్ నిర్లక్ష్యమా లేక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టకపోవడమా అనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా ఇప్పుడు ఆన్లైన్లో నడుస్తోంది. ఈ 15 కోట్ల పాస్వర్డ్ లు అన్నీ కూడా 12345..ABCDE.. ఇలాగే ఉన్నాయా ఏంటి? అంటూ కామెడీ పోస్ట్లు కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి..
మరోవైపు ఈ 15 కోట్ల పాస్వర్డ్ వ్యవహారంపై.. డేటా భద్రత విశ్లేషకుడు జెరేమియా ఫౌలర్ సంచలన విషయాలు బయటపెట్టారు. "జీ మెయిల్, క్రిప్టో కరెన్సీ ఫ్లాట్ ఫామ్ , ఫేస్ బుక్, యాహూ, మైక్రోసాఫ్ట్ అవుట్ లుక్, ఆపిల్ ఐ క్లౌడ్, టిక్ టాక్ వంటి యాప్ యూజర్లు , లాగిన్ వివరాలు ఇంటర్నెట్లో బహిర్గతమయ్యాయి..ఇందులో విద్యాసంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలకు చెందిన మిలియన్ల కొద్ది పాస్వర్డ్లు, బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు లాగిన్ వివరాలు కూడా లీకైనట్లు డేటాలో ఉన్నట్లు" ఆయన తెలిపారు. అందుకే ఇకపై ఇప్పటికైనా మేల్కొని పాస్వర్డ్స్ ను చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. ఫోన్ నెంబర్లు , డేటాఫ్ బర్త్ లు కాకుండా పాస్వర్డ్ మరింత పటిష్టంగా సెట్ చేసుకోండి. లేకపోతే ఇలా స్కామర్ల చేతికి చిక్కి ఆ తర్వాత భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది" అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.