బిలియనీర్ల జాబితాలో ఫుట్ బాల్ ప్లేయర్.. ఆయన సంపద ఎంతంటే..?
ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు వ్యాపార రంగం, టెక్ రంగం లేదంటే సినీ, వినోద రంగాల వారే ఉంటారు. క్రీడలకు సంబంధించిన వారు చాలా తక్కువగా ఉంటారు.;
ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు వ్యాపార రంగం, టెక్ రంగం లేదంటే సినీ, వినోద రంగాల వారే ఉంటారు. క్రీడలకు సంబంధించిన వారు చాలా తక్కువగా ఉంటారు. ఏన్నో సంవత్సరాల కఠిన శ్రమ తర్వాత అదృష్టం కలిసి వస్తే క్రీడాకారులు బిలియనీర్లుగా అవతరిస్తారు. అలాంటి జాబితాలో ఇప్పుడు ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో చేరారు. క్రిస్టియానో రొనాల్డో క్రమశిక్షణ కలిగిన ఫుట్ బాల్ ప్లేయర్ తన పేరే బ్రాండ్ గా మార్చుకున్నాడు. దీంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఆయన వద్దకు క్యూ కట్టాయి. దీంతో ఆయన ఇప్పుడు బిలియనీర్ల క్లబ్‌లోకి చేరిన తొలి ఫుట్‌బాల్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఆయన సంపద ఆయన సంపద 1.4 బిలియన్ డాలర్లు (రూ. 12,352.08 కోట్లు)గా అంచనా.
కఠినమైన ప్రయాణం
క్రిస్టియానో రొనాల్డో తన ప్రొఫెషనల్ ప్రయాణాన్ని 2002లో మొదలుపెట్టారు. 2023 వరకు మ్యాచ్‌ల ద్వారా మాత్రమే 550 మిలియన్ డాలర్లు సంపాదించాడు. కానీ ఆర్థిక విజయానికి అసలైన బలం అతని గ్లోబల్ బ్రాండ్ విలువే. నైక్, ఆర్మానీ, కాస్ట్రోల్ వంటి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాల ద్వారా ఆయన రూ. 1,554 కోట్ల వరకు సంపాదించాడు. ఆటలో కేవలం గోల్స్ మాత్రమే కాదు, వ్యాపార ప్రపంచంలోనూ ఆయన అద్భుత ఫినిషింగ్ చూపించాడు.
అల్-నస్ర ఒప్పందం
2023లో సౌదీ క్లబ్ అల్-నస్రతో రొనాల్డో చేసిన 200 మిలియన్ డాలర్ల ఒప్పందం, తర్వాత దానిని 400 మిలియన్ డాలర్లకు పెంచడం, కేవలం ఆర్థికంగా కాదు క్రీడా ప్రపంచంలో కొత్త మార్కెట్‌ను తెరిచింది. సౌదీ అరేబియా క్రీడా రంగంలో పెట్టుబడులను పెంచుతున్న వేళ, రొనాల్డో రాకతో ఆ దేశ ఫుట్‌బాల్ గ్లోబల్ లెవల్‌లో కొత్త ఉత్సాహం పొందింది.
క్రీడాకారుడు మాత్రమే కాదు..
రొనాల్డో విజయం కేవలం టాలెంట్ తో వచ్చింది మాత్రమే కాదు. అది ప్లాన్డ్ పర్సనల్ బ్రాండింగ్ విజయం సోషల్ మీడియా ప్రభావం, మార్కెట్ అభిమానుల అనుబంధం అన్నీ కలిపి ఆయనను బ్రాండ్ రూపంలో నిలబెట్టాయి. ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ కూడా బిలియన్ డాలర్ల స్థాయిని చేరగలడని రొనాల్డో నిరూపించాడు.
ప్రేరణగా నిలిచిన రొనాల్డో
రొనాల్డో ప్రయాణం యువ క్రీడాకారులకు, వ్యాపార వేత్తలకు, ప్రపంచంలోని ఫుట్‌బాల్ అభిమానులకు ప్రేరణగా నిలుస్తుంది. కేవలం క్రీడా రంగంలో ప్రతిభ మాత్రమే కాకుండా.. ఆర్థిక దృక్పథం, మార్కెట్ పై అవగాహన క్రమశిక్షణ కూడా అవసరమని ఆయన చూపించాడు. బిలియనీర్ల క్లబ్‌లోకి చేరిన రొనాల్డో, ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం కొత్త, వ్యూహాత్మక ప్రతిభకు ప్రతీకగా మారాడు. ఈ చరిత్రాత్మక ఘట్టం ద్వారా, క్రిస్టియానో ప్రపంచంలో, ఆర్థిక ప్రపంచంలో ఒక శాశ్వత గుర్తింపు పొందాడు.