భూమిపైకి దూసుకొస్తున్న 500 కేజీల అంతరిక్ష నౌక

కట్ చేస్తే.. దీన్ని ట్రాక్ చేసిన వారు కొత్త విషయాన్ని గుర్తించారు. ఈ అంతరిక్ష నౌక తాను ప్రయాణించాల్సిన కక్ష్యలోకి కాకుండా భూమివైపు తిరిగినట్లుగా గుర్తించారు.;

Update: 2025-05-11 04:39 GMT

దాదాపు 54 ఏళ్ల క్రితం అప్పట్లో ప్రపంచంలోనే బలమైన దేశాల్లో ఒకటైన సోవియట్ యూనియన్ ప్రయోగించిన అంతరిక్ష నౌక ఒకటి ఇప్పుడు భూమి దిశగా దూసుకొస్తోంది. శుక్రగ్రహంపై ప్రయోగించిన కాస్మోన్ 482 అంతరిక్ష నౌక అప్పట్లో ఫెయిల్ కావటం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ కక్ష్యల్లో తిరుగుతున్న ఈ అంతరిక్ష నౌక తాను ప్రయాణించాల్సిన కక్ష్యల్లో ప్రయాణించటం లేదన్న విషయాన్ని జర్మనీ రాడార్ స్టేషన్ ఇటీవల గుర్తించింది.

కట్ చేస్తే.. దీన్ని ట్రాక్ చేసిన వారు కొత్త విషయాన్ని గుర్తించారు. ఈ అంతరిక్ష నౌక తాను ప్రయాణించాల్సిన కక్ష్యలోకి కాకుండా భూమివైపు తిరిగినట్లుగా గుర్తించారు. 1972లో సోవియట్ యూనియన్ శుక్రగ్రహంపై చేపట్టిన మిషన్ లో కాస్మానో 482 ప్రయోగం ఒకటిగా చెబుతారు. అత్యంత వేడి గ్రహాల్లో ఒకటైన శుక్రగ్రహం వాతావరణ పరిస్థితిని తట్టుకునేందుకు వీలుగా ఈ అంతరిక్షనౌకను టిటానియం రేకుతో తయారు చేశారు.

ఈ కారణంతో ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం 500 కేజీల బరువున్న ఈ అంతరిక్షనౌక భూకక్ష్య దిశగా దూసుకొస్తోంది. నిజానికి ఈ అంతరిక్ష నౌక ప్రయోగం ఫెయిల్ అయ్యాక.. దీని విడిభాగాలు చాలావరకు విడిపోయి.. భూమి మీద పడ్డాయి. అయితే.. అంతరిక్ష నౌక మాత్రం అంతరిక్షంలోనే ఉండిపోయి.. వివిధ కక్ష్యల్లోకి తిరుగుతోంది.

తాజాగా తన రూటు మార్చుకొని భూమి మీదకు దూసుకొస్తోంది. అయితే.. ఇది భూమి మీద ఇదెప్పుడు.. ఎక్కడ పడుతుందో చెప్పటం కష్టమని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో.. కాస్మాస్ అంతరిక్ష నౌక భూమి మీదకు చేరుకునే వరకు.. సైంటిస్టులకు టెన్షనే అని చెబుతున్నారు. దీన్ని ట్రాక్ చేయటంలో పలు సంస్థలు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News