1971 యుద్ధం, ఇందిరాగాంధీ సిద్ధం... కొత్త చర్చ స్టార్ట్!

ప్రధానంగా... కాల్పుల విరమణ ప్రకటన అనంతరం కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ ఖాతాలో 1971 నాటి సంఘటనలు దేశ ప్రజలకు మరోసారి గుర్తుచేసే ప్రయత్నం చేసింది.;

Update: 2025-05-11 04:33 GMT

"దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా.. పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం.. టెర్రరిస్టులకు తగిన గుణపాఠం చెప్తాం.. ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది.. ఈ దాడి కేవలం పర్యాటకులపై కాదు.. భారతదేశ ఆత్మపై దాడి జరిగింది.. జమ్మూకశ్మీర్ లోనే కాదు, దేశంలో ఉగ్రవాదాన్ని నాశనం చేసేందుకు సమయం ఆసన్నమైంది"!

"నేను ప్రపంచం మొత్తానికి హామీ ఇస్తున్నా.. భారత్ ప్రతీ ఉగ్రవాదినీ, వారి వెనుక ఉన్నవారినీ గుర్తిస్తుంది, శిక్షిస్తుంది.. ఉగ్రవాదులు సప్త సముద్రాల వెనుక దాక్కున్నా వెంబడించి మరీ మట్టిలో కలిపేస్తాం.. ఉగ్రవాదం దేశ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదు.. ఉగ్రవాదానికి తప్పక శిక్ష పడుతుంది.. న్యాయం జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి"!

పహల్గాం ఘటన తర్వాత ఏప్రిల్ 24న తొలిసారిగా బహిరంగంగా స్పందించిన మోడీ చెప్పిన మాటలు ఇవి! జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మాటలు ఇవి. ఈ మాటలు మాట్లాడటానికి ముందు పహల్గాం బాధితులకు రెండు నిమిషాలు కళ్లు మూసుకుని శ్రద్ధంజలి ఘటించారు.

అవును... ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో అమాయకులైన పర్యాటకులు 26 మందిని ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేసి, హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో 25 మంది ఇతర రాష్ట్రాల పర్యాటకులు కాగా.. మరో వ్యక్తి ఉగ్రవాదులతో పోరాడిన కాశ్మీరీ! ఈ ఘటనలో సంభవించిన రికార్డెడ్ మరణాల సంఖ్య.. 25 మంది భారతీయులు, ఒక నేపాలి!

అనంతరం ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది భారత్. ఈ దాడిలో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని.. 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారని లెక్కలు చెప్పింది కేంద్రం. తాజాగా వారిలో ఐదుగురు ఉగ్రవాదుల పేర్లు మాత్రం వెల్లడించింది! దీని తర్వాత పాకిస్థాన్ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది.

ప్రధానంగా... గురు, శుక్ర, శనివారాల్లో సరిహద్దుల వెంబడి భారత్ పై విచక్షణా రహితంగా వందల సంఖ్యలో డ్రోన్లు, మిస్సైళ్లు, యుద్ధ విమానాలతో విరుచుకుపడినట్లు కేంద్రం తెలిపింది! వాటన్నింటినీ భారత గగనతల రక్షణ వ్యవస్థ తిప్పికొట్టినట్లు చెప్పింది! కట్ చేస్తే.. శనివారం సాయంత్రం 5 గంటల తర్వాత కాల్పుల విరమణ అంగీకారంపై ప్రకటన చేసింది.

ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. పలు కీలక స్టేట్ మెంట్లు, డిమాండ్లు చేసింది. ఇందులో భాగంగా... కాల్పుల విరమణ అంశంపై తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంట్ లో ప్రత్యేక సెషన్ నిర్వహించి... ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరింది.

ఈ సందర్భంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్... వాషింగ్టన్ నుంచి కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన నేపథ్యంలో భారత ప్రధాని అధ్యక్షతన తక్షణం అఖిలపక్ష సమావేశం జరగాలని.. పార్లమెంటు ప్రత్యేక భేటీని ఏర్పాటుచేసి, గత 18 రోజులుగా జరుగుతున్న అంశాలను చర్చించాలని డిమాండ్ చేశారు! ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

ఇదే సమయంలో... అసలు గత 5, 6 రోజులుగా దేశం ఏం సాధించిందో, ఏమి కోల్పోయిందో ప్రజలకు ప్రభుత్వం చెప్పాలని మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేడా పేర్కొన్నారు. మరి ఈ డిమాండ్లపై కేంద్రం ఎలా స్పందిస్తుందనే చూడాలి! అయితే.. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం స్పందించిన బీజేపీ... "కాల్పుల విరమణ భారత్ సాధించిన విజయం" అని ప్రకటించడం గమనార్హం!

ప్రధానంగా... కాల్పుల విరమణ ప్రకటన అనంతరం కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ ఖాతాలో 1971 నాటి సంఘటనలు దేశ ప్రజలకు మరోసారి గుర్తుచేసే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా.. ఇందిరా గాంధీ ఫోటోతో "ధైర్యం, నమ్మకం, బలం" అని రాసి పోస్ట్ చేసింది. అనంతరం.. "1971 - భారతదేశం ముందు పాకిస్థాన్ లొంగిపోయినప్పటిది" అని ఓ వీడియో పోస్ట్ చేసింది.

తర్వాత... అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తో ఇందిరాగాంధీ ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ... “3 లేదా 4 వేల మైళ్ల దూరంలో ఉన్న ఏ దేశమైనా భారతీయులకు రంగు ఆధిపత్యం ఆధారంగా వారు కోరుకున్నది చేయమని ఆదేశాలు ఇవ్వగలిగే కాలం గడిచిపోయింది” అనే ఇందిరాగాంధీ మాటలను (అగ్రరాజ్య ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నట్లు!) పోస్ట్ చేసింది!

ఇదే సమయంలో... ఇందిర ధైర్యం చూపారు.. దేశం కోసం నిలబడ్డారు.. జాతి పౌరుషంతో ఆమె రాజీపడలేదు అని పేర్కొంది! దీంతో.. 1971లో అసలేం జరిగింది..? ఆ యుద్ధంలో భారత్ ఎలా విజయం సాధించింది..? నాడు ప్రధానిగా ఇందిరాగాంధీ చూపించిన తెగువ, పోరాట పటిమ, శత్రువు ముందు రాజీపడని తత్వం, మెత్తబడని వైఖరి గురించిన చర్చ మొదలైందనే చర్చ మొదలైందని అంటున్నారు!



Tags:    

Similar News