కర్రీలో బొద్దింక.. పెద్దపల్లి రెస్టారెంట్ కు ఫైన్ షాక్

లంచ్ చేద్దామని హోటల్ కు వెళ్లిన ఆ కస్టమర్లకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. హోటల్ సిబ్బంది వడ్డించిన కూరలో బొద్దింక దర్శనమివ్వటంతో వారు అవాక్కు అయ్యారు.;

Update: 2025-07-02 05:17 GMT

లంచ్ చేద్దామని హోటల్ కు వెళ్లిన ఆ కస్టమర్లకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. హోటల్ సిబ్బంది వడ్డించిన కూరలో బొద్దింక దర్శనమివ్వటంతో వారు అవాక్కు అయ్యారు. ఇదేం అన్యాయం అంటూ రెస్టారెంట్ వారిని ప్రశ్నించారు. ఈ షాకింగ్ ఉదంతం పెద్దపల్లిలో చోటు చేసుకుంది. జరిగిన ఈ తప్పునకు సదరు రెస్టారెంట్ సిబ్బంది సానుకూలంగా స్పందించకపోగా.. రివర్సులో రియాక్టు కావటం గమనార్హం.

పెద్దపల్లి మండలానికి చెందిన ఒక యువకుడు ఒక పెద్ద రెస్టారెంట్ కు భోజనం చేసేందుకు వెళ్లాడు. అతడు ఆర్డర్ ఇచ్చిన కర్రీలో బొద్దింక దర్శనమివ్వటంతో అవాక్కు అయిన పరిస్థితి. దీంతో.. రెస్టారెంట్ యజమానికి జరిగిన దారుణం గురించి చెప్పగా వారు లైట్ తీసుకోవటంతో.. ఒళ్లు మండిన వినియోగదారుడు వెంటనే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. స్పందించిన అధికారులు సదరు రెస్టారెంట్ వద్దకు వెళ్లారు.

జరిగిన ఉదంతం గురించి తెలుసుకున్న అధికారులు.. సదరు రెస్టారెంట్ కు రూ.20 వేలు ఫైన్ విధించారు. మరోసారి ఇలాంటి పరిస్థితే ఏర్పడితే హోటల్ ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా రెస్టారెంట్ కు వెళ్లి.. అక్కడ వడ్డించే ఆహారపదార్థాల నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటే.. వెంటనే స్థానిక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. తగిన చర్యలు తీసుకునే వీలుంటుంది. ఏమైనా.. బయట తినే వేళలో.. జర జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.

Tags:    

Similar News