'మార్గదర్శకుడు'... చంద్రబాబుపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!

తాజాగా విజయవాడలో నిర్వహించిన "మైండ్ సెట్ షిఫ్ట్" పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.;

Update: 2025-04-24 16:51 GMT

తాజాగా విజయవాడలో నిర్వహించిన "మైండ్ సెట్ షిఫ్ట్" పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు శరణి రచించారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు.. తొలి ప్రతిని చిరంజీవికి అందించారు. ఈ సందర్భంగా చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... తాజాగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కాలేజీ రోజుల నుంచే చంద్రబాబు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించారని అన్నారు.

ఇదే సమయంలో... ప్రజల సంక్షేమ, రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు చాలా కష్టపడ్డారని కొనియాడారు. ప్రధానంగా తనకు సినిమా అంటే ఎంత మక్కువ ఉందో.. చంద్రబాబుకు కూడా రాజకీయాల పట్ల అదే మక్కువ ఉందని, అది చూపించే ఆయన ఈ రంగాన్ని ఎంచుకున్నారని అన్నారు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఎదగడానికి ఆయన ఉపయోగించుకున్నారని చిరు తెలిపారు.

ఇక... ఆయన నాయకత్వంలో హైదరాబాద్ ను ఐటీ నగరంగా తీర్చిదిద్దారని చెప్పిన చిరంజీవి.. దూరదృష్టి గల నాయకుడైన చంద్రబాబు ఐటీ, డిజిటల్ రంగాల్లో ఎన్నో పురోగతులను తీసుకొచ్చారని.. ఆయన రాజకీయాల్లో మార్గదర్శకుడని ఏపీ ముఖ్యమంత్రిని చిరంజీవి కొనియాడారు.

ఇదే సమయంలో... చిరంజీవినీ చంద్రబాబు కొనియాడారు. ఇందులో భాగంగా.. సినీనటులు సామాజిక సేవ గురించి ఆలోచించడం అరుదని, అలా చేసిన తొలి వ్యక్తి చిరంజీవి అని చంద్రబాబు అన్నారు. తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాము అప్పుడప్పుడూ కలుసుకునేవాళ్లమని.. బ్లడ్ బ్యాంక్ పెట్టాలనుకుంటున్నానని, స్థలం కావాలని అడిగేవారని తెలిపారు.

Tags:    

Similar News