పాక్ చర్యలకు మద్దతుపై చైనా కీలక వ్యాఖ్యలు!
భారత్ – పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చడానికి అవసరమైన అన్ని చర్యలను తాము స్వాగతిస్తామని చైనా పెర్కొంది.;
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ కు చైనా మద్దతు పలికిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో తాజాగా ఈ విషయంపై చైనా మరోసారి స్పష్టం చేసింది. ఇందులో భాగంగా... తన సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుకునేందుకు పాకిస్థాన్ తీసుకునే అన్ని చర్యలకు తాము మద్దతిస్తామని తెలిపింది.
అవును... భారత్ – పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చడానికి అవసరమైన అన్ని చర్యలను తాము స్వాగతిస్తామని చైనా పెర్కొంది. ఈ సందర్భంగా స్పందించిన చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ మీడియాతో మాట్లాడుతూ... పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తును కోరుకుంటున్నామని తెలిపింది.
ఇదే సమయంలో... భారత్ – పాక్ రెండు దేశాలకు పొరుగువారిగా సంయమనం పాటిస్తామని చైనా ఆశిస్తున్నట్లు గువో జియాకున్ తెలిపినట్లు రాయిటర్స్ నివేదించింది! ఇదే సమయంలో.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆదివారం పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తో ఫోన్ లో మాట్లాడినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా స్పందించిన వాంగ్... అన్ని కాలాలకు అనుగుణంగా ఉండే వ్యూహాత్మక సహకార భాగస్వామిగా చైనా.. పాకిస్థాన్ చట్టబద్ధమైన భద్రతా సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుంటుందని.. దాని సార్వభౌమత్వాన్ని, భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడంలో పాకిస్థాన్ కు మద్దతు ఇస్తుందని వాంగ్ చెప్పారు!
కాగా... పహల్గాంలో జరిగిన హింస తర్వాత భారత్ - పాకిస్థాన్ సంబంధాలు బాగా క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక పాకిస్థాన్ లో శిక్షణ పొందిన ఇద్దరు కాశ్మీరీ కార్యకర్తలు ఈ దాడి వెనుక ఉన్నారని చెప్పిన భారత్... 1960 సింధూ జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అట్టారిలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును మూసివేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా... జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాకు చెందిన ఆదిల్ థోకర్ లేదా ఆధిల్ గురీ అనే స్థానిక ఉగ్రవాది.. ఏప్రిల్ 22న జరిగిన దాడిని ప్లాన్ చేయడంలోనూ, అమలుచేయడంలోనూ పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహకరించడంలో కీలక భూమిక పోషించాడని భారత్ భావిస్తోంది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే.