పెళ్లి లేదు గిళ్లి లేదు... లైవ్‌లోనే లవ్ స్టోరీ! చైనాలో కొత్త ట్రెండ్!

రిపోర్ట్స్ ప్రకారం చైనాలో 30శాతం కంటే ఎక్కువ మంది యువతీయువకులు ఇంకా పెళ్లి చేసుకోలేదు.;

Update: 2025-04-30 15:30 GMT

డ్రాగన్ కంట్రీ చైనాలో ఇప్పుడు యువత కొత్త పద్ధతుల్లో తమకు కావాల్సిన ప్రేమను వెతుక్కుంటున్నారు. ఫాస్ట్ లైఫ్, కెరీర్ టెన్షన్ ఎక్కువవడం, పెళ్లిళ్లు తగ్గిపోవడంతో యంగ్ జెనరేషన్ ఒక కొత్త సోషల్ క్రైసిస్‌లో పడిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే చాలా మంది యంగ్ పీపుల్ ఒంటరిగా ఉంటున్నారు. పెళ్లి గురించి ఆలోచించడానికి వాళ్ల దగ్గర టైమ్ లేదు, అంత మూడ్ కూడా లేదు. జననాల రేటు పడిపోవడం, కుటుంబ వ్యవస్థ బలహీనపడడం దేశ సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని గవర్నమెంట్, సొసైటీ ఇద్దరూ టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. అదే లైవ్ వీడియో డేటింగ్ షోలు. Xiaohongshu (రెడ్‌నోట్) లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రతి రాత్రి ఇలాంటి వందల షోలు నడుస్తున్నాయి. వేల మంది యంగ్ పీపుల్ ప్రేమ కోసం కలుస్తున్నారు.

'సింగిల్'గా ఉండే ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది?

రిపోర్ట్స్ ప్రకారం చైనాలో 30శాతం కంటే ఎక్కువ మంది యువతీయువకులు ఇంకా పెళ్లి చేసుకోలేదు. చదువు, కెరీర్‌పై ఒత్తిడి పెరగడమే దీనికి పెద్ద కారణమని నిపుణులు అంటున్నారు. యంగ్ జనరేషన్‌కు డేటింగ్ లేదా రిలేషన్‌షిప్‌ల కోసం టైమ్ ఉండట్లేదు. అంతేకాదు పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లు లేదా ఫ్యామిలీ నెట్‌వర్క్ ద్వారా సంబంధాలు పెట్టుకునే కోరిక కూడా ఇప్పుడు లేదు. రాత్రి 11 గంటల నుంచి మొదలయ్యే ఈ సెషన్స్‌ను టియాన్ షిన్ లాంటి సైబర్ మ్యాచ్ మేకర్ ఇన్ఫ్లుయెన్సర్‌లు హోస్ట్ చేస్తున్నారు. ప్రతి సెషన్‌లో 800 మందికి పైగా పాల్గొటున్నారు.

కెమెరా ముందు మాటలు, లైవ్ ఎమోషన్స్

ఈ లైవ్ డేటింగ్ సెషన్స్‌లో పాల్గొనే యంగ్ పీపుల్ కెమెరా ముందు తమ గురించి చెప్పాలి. వాళ్ల వయసు, చేసే పని, సంపాదన నుంచి హాబీలు, పర్సనల్ టాలెంట్ వరకు అన్నీ చెప్పాలి. కొందరు పాటలు పాడుతారు, కొందరు డాన్స్ చేస్తూ తమ స్టైల్‌లో చూసేవాళ్ల మనసు గెలుచుకోవడానికి ట్రై చేస్తారు. లైవ్ కామెంట్స్ ద్వారా రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్ కూడా వస్తుంది.

ఒక్క క్లిక్‌తో మొదలైన ప్రేమ

25 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ స్టీవ్ చెన్ తను ఎప్పుడూపుట్టుకతో సింగిల్ అని చెప్పుకునేవాడు. అలాంటి ఒక షో ద్వారానే ఒక అమ్మాయిని కలిశాడు. చాలా లైవ్ సెషన్స్, మాటల తర్వాత ఒక రెగ్యులర్ వ్యూయర్ క్రిస్టీన్ జాంగ్‌తో కనెక్షన్ ఫీలయ్యాడు. మెల్లగా వాళ్ల మాటలు డేటింగ్ వరకు వెళ్లాయి. ఇప్పుడు వాళ్లిద్దరూ సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. చైనాలోని సిటీ యంగ్ పీపుల్‌లో ఈ ట్రెండ్ చాలా ఫాస్ట్ గా పాపులర్ అవుతోంది. ఇది పాత రిలేషన్‌షిప్‌ల కంటే డిఫరెంట్ అంతేకాదు పూర్తిగా డిజిటల్. ఇక్కడ ఫస్ట్ ఇంప్రెషన్ వేల మంది ముందు ఏర్పడుతుంది.

Tags:    

Similar News