సర్పంచులే బెగ్గింగ్ మాఫియా డాన్లు..
సర్పంచ్. గ్రామ ప్రథమ పౌరుడిగా చెబుతుంటారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ..సమస్యలకు పరిష్కారించాల్సిన సర్పంచ్ లు బ్రోకర్లుగా మారిన ఘటన సెన్సేషన్ గా మారింది.
సర్పంచ్. గ్రామ ప్రథమ పౌరుడిగా చెబుతుంటారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ..సమస్యలకు పరిష్కారించాల్సిన సర్పంచ్ లు బ్రోకర్లుగా మారిన ఘటన సెన్సేషన్ గా మారింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో పలువురు సర్పంచ్ లు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతూ అడ్డంగా బుక్కయ్యారు. సర్పంచులే' బ్రోకర్లుగా మారి.. పసి పిల్లలను అడుక్కునే ముఠాలకు అమ్ముతున్నట్లు పెద్ద రాకెట్ వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటున్న బెగ్గర్లను చూసి పోలీసులకు డౌట్ రావడంతో..విచారిస్తే అసలు విషయం బయటపడింది. పసిపిల్లల పొట్టగొడుతూ..ఓ రాజస్థాన్ ఎంపీతో పాటు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సర్పంచులు గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న దందాపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తీగ లాగితే డొంక కదలింది.
అమ్మకానికి అమాయక బాల్యం..
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్, టెంపుల్స్, మాల్స్, హాస్పిటల్స్ దగ్గర అడుక్కునే పిల్లల వెనుక ఒక భారీ, ఆర్గనైజ్డ్్ క్రైమ్ నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు అహ్మదాబాద్ వేదిక కానున్న నేపథ్యంలో.. నగరాన్ని యాచకరహితంగా మార్చేందుకు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, మున్సిపల్ కార్పొరేషన్ జాయింట్ డ్రైవ్ చేపట్టాయి. ఈ తనిఖీల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఏకంగా 276 మంది చిన్నారులను వేరే రాష్ట్రాల నుంచి అహ్మదాబాద్ కు అక్రమంగా తరలించిన ఈ దందాలోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దందా ఏదో వేలు..లక్షల కోసం జరుగుతున్న చిన్న వ్యాపారం కాదని..దీని వెనుక పెద్ద కథే నడుస్తుందని తెలిసి షాక్ అయ్యారు పోలీసులు. అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి నడుస్తున్న బెగ్గింగ్ దందా వెనుక పెద్ద మాఫియా హస్తం ఉందని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పూసగుచ్చినట్లు పిన్ టు పిన్ వివరించారు.
వేరే స్టేట్ నుంచి బెగ్గర్స్ దిగుమతి
గుజరాత్‌కు చెందిన యాచక ముఠాల ఆపరేటర్లు మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వెనుకబడిన గ్రామాల్లో ఉండే సర్పంచులను సంప్రదిస్తారట. కడుపేదరికంలో ఉన్న కుటుంబాల ఆర్థిక బలహీనతలను క్యాష్ చేసుకుంటున్న సర్పంచులు..వారిని బెగ్గర్లుగా మార్చి అందిని కాడికి దోచుకుంటున్నారుపెద్ద నగరాల్లో అడుక్కుంటే మంచి ఆదాయం వస్తుందని నమ్మించి, వారి పిల్లలను యాచకులు పంపేలా తల్లిదండ్రులను ఒప్పిస్తారట. పిల్లలను తమకు అప్పగించినందుకు యాచక ముఠాలు సర్పంచులకు భారీగా డబ్బు అప్పగిస్తే..అందులో కొంత భాగాన్ని సర్పంచులు తల్లిదండ్రులకు ఇచ్చి, మిగిలినది తామే నొక్కేయడం దందాగా మార్చుకున్నారట. అంతేకాదు.. ఆ పిల్లలు అహ్మదాబాద్ వీధుల్లో రోజూ అడుక్కునే సంపాదనలో 20శాతం కమీషన్‌ను ఈ సర్పంచులు నిరంతరం వసూలు చేస్తూనే ఉంటారని కైమ్ బ్రాంచ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఏ ప్రాంతంలో ఎక్కువ కలెక్షన్ వస్తాయో చూసి పక్కా ప్లానింగ్‌తో పిల్లలను అక్కడ మోహరించి..బెగ్గింగ్ దందాను నడుపుతున్నారు. ట్రాఫిక్ జంక్షన్లు,పెద్ద ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, ఆలయాలు, చర్చిలు, మసీదులు దగ్గర అయితే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని..అక్కడ పిల్లలతో బెగ్గింగ్ చేయిస్తున్నట్లు గుర్తించారు. పిల్లలను బెగ్గింగ్ ముఠాలకు సరఫరా చేసిన సర్పంచులు, పిల్లల తల్లిదండ్రులపై చైల్డ్ ట్రాఫికింగ్ చట్టాల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రక్షణగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే.. భక్షకులుగా మారి పసిపిల్లల బాల్యాన్ని రోడ్డున పడేయడం సమాజం తలదించుకోవాల్సిన విషయమే.!