ప్రాంప్ట్ ఇవ్వడం వస్తే ఉద్యోగం..ఐటీలో ఏఐ ట్రెండ్..!

ఎక్కడ చూసిన ఏఐ హవా. ఎవరి నోట విన్న ఏఐ మాట. వాట్సప్ స్టేటస్ పెట్టాలన్నా..కొత్త కొత్త డిజైన్ తో ఫోటోలు తయారు చేయాలన్న ఏఐని విపరీతంగా వాడేయడం ట్రెండ్ అయిపోయింది.

Update: 2026-07-05 15:14 GMT

ఎక్కడ చూసిన ఏఐ హవా. ఎవరి నోట విన్న ఏఐ మాట. వాట్సప్ స్టేటస్ పెట్టాలన్నా..కొత్త కొత్త డిజైన్ తో ఫోటోలు తయారు చేయాలన్న ఏఐని విపరీతంగా వాడేయడం ట్రెండ్ అయిపోయింది. ఐటీ రంగంలో అయితే ఏఐ జోరు అంతా ఇంతా కాదు. కోడింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు ఏదైనా త్రూ ఏఐ ద్వారానే నడుస్తోంది. దీంతో సాధారణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల నియామకాలకు బ్రేకులు పడుతున్న పరిస్థితి. సాధారణ ఉద్యోగాలకు నో..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..ఏఐకి జై అంటోంది ఐటీ కంపెనీలు. ఏడాదిగా భార ఐటీ రంగంలో హైరింగ్ తీరే పూర్తిగా మారుతోంది. ఒకవైపు సాఫ్ట్‌వేర్ రంగంలో ఓవరాల్‌గా ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంటే, మరోవైపు ఏఐని వాడటం తెలిసిన వారికి ఐటీ కంపెనీలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ప్రముఖ జాబ్ పోర్టల్ 'నౌకరి' విడుదల చేసిన లేటెస్ట్ 'జాబ్‌స్పీక్' రిపోర్ట్..దేశీయ ఐటీ రంగంలో వచ్చిన మార్పులపై సంచలన విషయాలను ఎక్స్ పోజ్ చేస్తుంది.

ఏఐ కొలువుల జోరు..ఉద్యోగులకు ప్రెజర్ డౌన్.!

సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు భారీగా డిమాండ్ పెరిగింది. 315 బిలియన్ డాలర్ల ఇండియన్ ఐటీ మార్కెట్లో ఏఐ రిక్రూట్‌మెంట్‌ 16 శాతం జంప్ అయింది. ప్రముఖ రిక్రూట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ 'ఇన్ఫో ఎడ్జ్' 1.5 లక్షలకు పైగా కంపెనీల నుంచి సేకరించిన డేటా ప్రకారం.. జూన్ నెలలో ఐటీ రంగంలో సరికొత్త ట్రెండ్ కనిపించింది. ఐటీ కంపెనీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో ఉద్యోగాల నియామకాలు గతేఏడాదితో పోలిస్తే 16 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఐటీ రంగంలో ఓవరాల్ సాధారణ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ 3 శాతం తగ్గింది. కేవలం ఐటీ మాత్రమే కాదు.. టెలికాం, ఇన్సూరెన్స్, ఎఫ్‌ఎమ్‌సీజీ వంటి 14 రంగాల్లో కూడా ఏఐ, మెషిన్ లెర్నింగ్ జాబ్స్ కు డిమాండ్ 25 శాతానికి పెరగడం ఆసక్తికరంగా మారింది. నార్మల్ ఐటీ సేవల కంటే ఇప్పుడు ఏఐ అనేది ఒక కోర్ క్యాపబిలిటీగా మారుతోంది. దీంతో కంపెనీలు సాధారణ ఉద్యోగుల కంటే.. సీనియర్, స్పెషలైజ్డ్ స్కిల్స్, టాలెంట్ కోసం ఎక్కువగా వెతుకుతున్నాయి

ఐటీ కంపెనీలు..ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐ మానియా.!

రెగ్యులర్ బిజినెస్ మోడల్స్‌ను ఏఐ టెక్నాలజీ రీప్లేస్ చేస్తుండటంతో కంపెనీలు అలర్ట్ అయ్యాయి. భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఏఐ రిక్రూట్ మెంట్ పైఫోకస్ పెట్టింది. రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో సాధారణ నియామకాలు తగ్గుతాయని, తమ వర్క్‌ఫోర్స్‌లో ఎంప్లాయిస్ తో సమానంగా..ఏఐI ఏజెంట్లు ఉండేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నెట్ హెడ్‌కౌంట్ 23వేలకు పైగా తగ్గడం కూడా ఐటీ రంగంలో వస్తున్న ఈ మార్పుకు అద్దం పడుతోంది. కాలంతో పాటు మారకపోతే ఐటీ కెరీర్ కష్టమే.. కోడింగ్ మాత్రమే కాదు, ఏఐ స్కిల్స్ ఉంటేనే ఇప్పుడు ఐటీలో బాస్. అందుకే ఫ్యూచర్ పై ఫోకస్ పెట్టిన చాలామంది సాఫ్ట్ వేర్లు..ఏఐ స్కిల్స్.. అప్ కమింగ్ టెక్నాలజీస్ ను నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఫస్ట్ ఇయర్ నుంచే ఏఐని ఒక సబ్జెక్ట్ గా నేర్పించేందుకు పాఠ్యాంశంగా చేరుస్తున్నాయి. కొన్ని ప్రైవేటు యూనివర్సిటీల్లో ఏఐ ఆల్రెడీ ఓ సబ్జెక్ట్ గా చేరిపోయింది. రాబోయే రోజుల్లో ఏఐ ట్రెండ్ ఐటీ రంగంలో ఎలాంటి షాకింగ్ ట్విస్టులకు దారితీస్తుందనేది వేచి చూడాలి మరి.

Tags:    

Similar News