చోరీకి గురైన లంబోర్గిని కారు.. రంగంలోకి చాట్ జీపీటీ!

అసలు విషయంలోకి వెళితే.. చోరీకి గురైన వాహనాలను కనిపెట్టడం అటు యజమానులకు ఇటు అధికారులకు అతిపెద్ద సవాలుగా మారిన విషయం తెలిసిందే.;

Update: 2025-08-27 18:30 GMT

టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంకా దొంగతనాలు జరుగుతూ.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా కష్టపడి పని చేయడం ఇష్టం లేక .. ఇలా చాలామంది దొంగతనాలకు పాల్పడుతూ భారీగా దోచుకుంటున్నారు. ఆడవారి మెడలో ఉండే చిన్న చైన్ మొదలుకొని ఏకంగా లగ్జరీ కార్లను సైతం దొంగతనం చేస్తూ ప్రజలలో భయాన్ని కలిగిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా చోటు చేసుకున్న ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా గత రెండు సంవత్సరాల క్రితం దొంగతనానికి గురైన ఒక లగ్జరీ కారు లంబోర్గినిని చాట్ జీపీటీ కనిపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.

అసలు విషయంలోకి వెళితే.. చోరీకి గురైన వాహనాలను కనిపెట్టడం అటు యజమానులకు ఇటు అధికారులకు అతిపెద్ద సవాలుగా మారిన విషయం తెలిసిందే. దీనికోసం ఎన్నో సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తూ.. పెద్దగా వర్కౌట్ కావడం లేదు. కానీ ఈసారి ఏకంగా ఏఐను ఉపయోగించారు. లంబోర్గిని హురాకాన్ ఈవీఓ యజమాని ఆండ్రూ గార్సియా గత రెండేళ్ల క్రితం తన కారును పోగొట్టుకున్నారు. ఈ లగ్జరీ కారుతో పాటు ఇతర సూపర్ కార్లు కూడా దొంగతనానికి గురయ్యాయి. ఆ సమయంలో అధికారులు దీనిని మల్టీ మిలియన్ డాలర్ల లగ్జరీ కార్ల దొంగతనంగానే గుర్తించారు. వాటిని తిరిగి ఇవ్వకపోగా యజమానుల పేర్లను కూడా తొలగించి.. తిరిగి అమ్ముకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కాలంలో కొన్ని కార్లు తిరిగి దొరికినా.. గార్సియాకు చెందిన హురాకాన్ మాత్రం కనిపించలేదు. ఇకపోతే ఈ కారులో ఉన్న బిజినెస్ కార్డు ఆధారంగా లగ్జరీ కార్ల కొనుగోలు కోసం ఇటీవల ఒక వ్యక్తి గార్సియాను సంప్రదించగా.. ఇంస్టాగ్రామ్ లో కారు కొత్త ఫోటోలు పంపించి.. మీరు ఈ కారును అమ్మేశారా? అని అడిగాడు.

ఇక ఈ ఫోటోలు చూసిన గార్సియా వెంటనే దర్యాప్తు మొదలుపెట్టాడు. అందులోని వివరాలను చాట్ జీపీటీ సహాయంతో విశ్లేషించి.. గూగుల్ లొకేషన్ ఫీచర్లను ఉపయోగించి.. కారు ఉన్న ప్రదేశాన్ని ఇట్టే గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడికి వెళ్లి.. వారు వాహనాన్ని స్వాధీనం చేసుకొని, అది గార్సియాది అని ధ్రువీకరించారు. మొత్తానికైతే ఈ చాట్ జీపీటీ కారణంగా రెండేళ్ల క్రితం పోగొట్టుకున్న తన లగ్జరీ కారును సొంతం చేసుకోవడంతో గార్సియా ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. అంతేకాదు ఈ అధునాతన టెక్నాలజీకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

లంబోర్గిని హురాకాన్ ఈవీఓ విషయానికి వస్తే.. ఎక్కువగా లగ్జరీ కార్లు ఇష్టపడే వారికి ఇది సూపర్ మోడల్ అని చెప్పవచ్చు. దీని ఫీచర్స్ విషయానికి వస్తే.. 5.2 లీటర్ల వీ10 ఇంజిన్ తో 631 హెచ్ పీ శక్తి, 600 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సెవెన్ స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ తో వస్తుంది. 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.9 సెకండ్లలో చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం సుమారుగా 325 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. మొత్తానికి అయితే కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఇలా ఎప్పుడో దొంగతనానికి గురైన లంబోర్ఘిని కారు మళ్లీ దొరకడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి.

Tags:    

Similar News