చంద్రబాబుకు ఛాన్స్ ఇవ్వని జగన్.. రీజన్ ఇదే..!
చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. తాజాగా పేదలకు ఇళ్లు పథకానికి శ్రీకారం చుట్టింది.;
చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. తాజాగా పేదలకు ఇళ్లు పథకానికి శ్రీకారం చుట్టింది. నగరాలు, గ్రామాల్లో ని పేదలను గుర్తించి.. వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి.. వారికి ఇళ్లు కూడా కట్టించాలని తాజాగా చంద్రబాబు నిర్ణయించారు. మంగళవారం నాటి మీడియాలో ఇదే హైలెట్. ఈ పథకం కింద.. కేంద్రం ఇచ్చే రూ.2.5 లక్షల కు తోడు రాష్ట్ర సర్కారు రూ.1.5 లక్షలను ఇచ్చి.. పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వనుంది. దీనిని నగరాల్లో ఒక విధంగా.. గ్రామాల్లో మరో విధంగా అమలు చేయనున్నారు.
ఇది బృహత్తర పథకమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. చాలా మంచిదని.. దీనిని అమలు చేస్తే.. ఇళ్లు లేని పేదలు అంటూ ఉండబోరని కూడా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని.. పట్టణాల్లోనిపేదలకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలని కూడా.. చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.అయితే.. భూములు ఇచ్చే విషయం కేంద్రానికి సంబంధం లేదు. పైన జరిగే నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తుంది. సో.. భూములను చంద్రబాబు ఉచితంగా ఇస్తారన్నమాట.
ఇది పైకి చూస్తే.. చాలా మంచి పథకంగానే ఉంది. ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. గత జగన్ ప్రభుత్వంలో పేదలకు పట్టణాల్లో అయితే సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే సెంటున్నర స్థలం మాత్రమే ఇచ్చారు. దీనిలో పోల్చుకుంటే చంద్రబాబు డబుల్ బొనాంజానే ఇచ్చారు. ఇస్తున్నారు. దీనిని అందరూహర్షిస్తున్నారు. కానీ, ఎటొచ్చీ.. ఇక్కడ ఓ మెలిక పెట్టారు. గత వైసీపీ హయాంలో ఇప్పటికేఇళ్లు తీసుకున్నవారికి ఈ పథకంవర్తించదని పేర్కొన్నారు.
ఇది కూడా మంచిదే. ఇప్పటికే కడుపు నిండిన వారికి మళ్లీ అన్నం పెడతామని ఎవరు మాత్రం చెబుతారు. కానీ, ఎటొచ్చీ.. చంద్రబాబు మిస్సవుతున్న చాన్స్ ఏంటంటే.. రాష్ట్రంలో అసలు లబ్ధి దారులు లేకపోవడమే! ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిజం. గత జగన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందే.. 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వాగ్దానం చేసింది. ఆ మేరకు విస్తృతంగా సర్వేలు చేసింది.. దీంతో 25 కాస్తా 32 లక్షలకు చేరుకుంది.
వారందరికీ జగన్ ఈ పథకంలో లబ్ధి చేకూర్చారు. వారంతా దరఖాస్తు చేసుకున్నారు. 22 లక్షల మందికి భూములు కూడా ఇచ్చేశారు. మరో 10 లక్షల మంది దరఖాస్తులను కూడా ఓకేశారు. వీరికి ఇచ్చేస్థలాలపై కేసులు నమోదయ్యాయి. దీంతో వేగం తగ్గింది. అయినా.. గత ప్రభుత్వంలో లబ్ధిదారులుగానే ఉన్నారు. దీంతో ఇప్పుడు కొత్తగా లబ్ధిదారులు ఎవరు? అంటే.. ఎవరూ కనిపించడం లేదు. ప్రతి జిల్లాలోనూ పేదలకు జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు. సో.. ఇప్పుడు ఈ పథకంలో చంద్రబాబు ఇచ్చేందుకు రెడీ అయినా.. నిబంధనలు చూస్తే.. పేదలు కనిపించడం లేదు. ఈ క్రెడిట్‌ను జగన్ కొట్టేశారు. ఇదీ.. సంగతి!!