• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీఎంగా చంద్రబాబు రెండో...

సీఎంగా చంద్రబాబు రెండో సంతకం దానిపైనే!

| ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-06-11 06:00 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక కుదేలైంది. జూన్‌ 12న కూటమి తరఫున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రివర్గంలో జనసేన, బీజేపీ కూడా చేరడం దాదాపు ఖాయమైంది.

కాగా ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ హామీలను చంద్రబాబు ఇచ్చారు. అలాగే జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ సూచించిన కొన్ని హామీలను కూడా వీటికి జత చేశారు. వీటన్నింటిని కొత్త ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు జూన్‌ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే మొదటగా వేటిపైన సంతకాలు చేస్తారనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. చంద్రబాబు మొదట మెగా డీఎస్సీపైన సంతకం చేస్తారని తెలుస్తోంది. ఆయన కూడా ఎన్నికల ముందు ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారు.

వాస్తవానికి ఎన్నికలకు రెండు నెలల ముందు వైసీపీ ప్రభుత్వం డీఎస్పీని ప్రకటించింది. అయితే కేవలం 6200 పోస్టులకే ప్రకటన ఇచ్చింది. అయితే ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల కోడ్‌ తో దానికి బ్రేక్‌ పడింది. యువత పెద్ద ఎత్తున ఎన్నికల్లో కూటమికి జైకొట్టడంతో వారిని సంతృప్తిపర్చాల్సిన అవసరం కొత్త ప్రభుత్వంపై పడింది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీని పెడతారని తెలుస్తోంది. మెగా డీఎస్సీ పేరుకు తగ్గట్టే భారీగా టీచర్‌ ఉద్యోగాల నియామకాలకు ప్రకటన ఇస్తారని తెలుస్తోంది.

ఇక చంద్రబాబు సీఎంగా తన రెండో సంతకాన్ని ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపైన చేస్తారని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు వారికి చెందకుండా పోతాయని ఉధృత ప్రచారం చేశారు. వైసీపీ ఘోర ఓటమిలో ఈ అంశం కూడా ప్రధాన పాత్ర పోషించిందనే అంచనాలు ఉన్నాయి. తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు, పవన్‌ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు రెండో సంతకం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపైన ఉంటుందని సమాచారం.

ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఇందుకు సంబంధించిన పైళ్లను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు సంతకాలు పెట్టడానికి వీలుగా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు ఫైలును రూపొందించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన రెండో సంతకాన్ని ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం రద్దుపై పెడతారని సమాచారం.

మంత్రివర్గ ఆమోదం అనంతరం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తూ బిల్లును శాసనసభ సమావేశాల్లో పెడతారని తెలుస్తోంది. శాసనసభ ఆమోదం అనంతరం ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు అధికారంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.

వైసీపీ ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ ఘోర ఓటమికి ఈ చట్టం కూడా ఒక కారణంగా నిలిచిందని ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

ఇక మూడోది పెన్షన్ల పెంపు. టీడీపీ కూటమి అధికారంలో రావడంలో ఈ అంశం కూడా కీలక పాత్ర పోషించింది. తాము అధికారంలోకి వస్తే రూ.4000 పెన్షన్‌ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అది కూడా ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని చెప్పారు. ఏప్రిల్‌ నుంచి పెంచిన పెన్షన్‌ తో జూలై 1న రూ.7 వేల పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.

గతంలో చంద్రబాబు హయాంలో రూ.2 వేలుగా ఉన్న పింఛన్‌ ను జగన్‌ అధికారంలోకి వచ్చాక ఏడాదికి రూ.250 చొప్పున పెంచి మూడు వేల రూపాయలకు పెంచారు. ఈ ఏడాది జనవరిలో పింఛన్‌ 3 వేల రూపాయలు అయ్యింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రూ.4 వేలు ఇవ్వనుంది. జూలై 1న పింఛన్‌ లబ్ధిదారులు రూ.7 వేలు (ఏప్రిల్, మే, జూన్‌ లకు రూ.1000 చొప్పున, జూలైకి 4000) అందుకోనున్నారు. ఇలా మొత్తం మూడు ప్రధాన హామీలను చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అమల్లోకి తెస్తారని తెలుస్తోంది.

Tags:    
  • Chandrababunaidu 
  • TDP 
  • Chiefminister 
  • Ndaallaince 
  • Janasena 
  • Pawankalyan 
  • BJP 
  • YSRCP 
  • Landtitlingact 
  • DSC 

Similar News

ఎన్నిక‌లు ముగిశాయి.. టీడీపీలో గొడ‌వ‌లు పెరిగాయి!

2026-11-13 15:30 GMT

ఆయన బీజేపీ.. ఆ పార్టీ మిత్రపక్షానికి వ్యతిరేకి.. సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ యుద్ధం వెనుక ఉద్దేశమిదేనా...

2026-11-13 14:30 GMT

ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.47 లక్షల కోట్లు.. ‘ఎఫైర్’ దెబ్బకు ఎన్వీడియా మటాష్ అంతే..

2026-11-13 13:47 GMT

టిప్ ఇస్తేనే క్యాబ్.. లేదంటే జాబ్.. ఓలా తెలివితేటలకు కేంద్రం రూ. 10 లక్షల యాడ్-ఆన్ షాక్

2026-11-13 13:30 GMT

శ్రీకాకుళంలో 'గుండ విగ్ర‌హ' రాజ‌కీయం!

2026-11-13 12:30 GMT

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ కలకలం.. "ఆధారాలున్నాయి" అంటూ ప్రధాని మోదీకి సవాల్!

2026-11-13 11:37 GMT

ఓ అద్భుతం జరిగింది.. ఒకే తేదీన ఐదు తరాల జననమైంది..

2026-11-13 11:30 GMT

ఆడ‌దాని ఓర చూపుకు 'పడిపోయిన‌ జెన్స‌న్‌లు'!

2026-11-13 10:30 GMT

ఏడు పైసల లాభం.. రూపాయికి వచ్చింది ప్రాణం.. డాలర్ తో తగ్గేదేలే..

2026-11-13 10:26 GMT

అమరావతిలో మెగా రైల్వే స్టేషన్.. 24 ప్లాట్‌ఫారాలు, రోజుకు 3 లక్షల మంది ప్రయాణికులు!

2026-11-13 10:24 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

ప్రజలు అంగీకరించడానికి సమయం పట్టినా సరే, ఆ పని చేసి తీరుతా : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

2026-11-13 10:10 GMT

Copyright @2026

Powered by Blink CMS