నో చాన్స్ అంటున్న బాబు...ఎమ్మెల్యేలు అలెర్ట్ !

తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తారు.;

Update: 2026-05-01 11:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తారు. దానికి తోడు ఇపుడు నేరుగా ప్రజల నుంచి సమాచారం తీసుకుంటాను అంటున్నారు. దాంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఫుల్ అలెర్ట్ కావాల్సిందే అన్న మాట వినిపిస్తోంది. నిజం చెప్పాలీ అంటే బాబు తన పార్టీ ఎమ్మెల్యేలకు నేరుగానే వార్నింగ్ ఇచ్చేశారు. అది తన పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పాల్సిన సూటిగానే చెప్పేశారు

తీరు మార్చుకోవాల్సిందే :

చంద్రబాబు ఇంతకీ ఏం చెప్పారంటే ఎమ్మెల్యే పనితీరు మార్చుకోవాల్సిందే అన్నది ఎవరైనా ఎమ్మెల్యే తన పనితీరు మార్చుకోకపోతే చేసేదే ఉండదన్న సందేశాన్ని బాబు పంపించారు. కృష్ణా జిల్లా పమిడి ముక్కలలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే పనితీరు గురించి ప్రజలనే ముఖా ముఖీ అడుగుతానని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే జవాబులే ఎమ్మెల్యేల పనితీరుకు అచ్చమైన నిదర్శనమని భావిస్తాను అన్నారు. ప్రజల్లో ఉన్నవాళ్ళకి పనితీరు మెరుగుపరుచుకున్న వాళ్ళకి పార్టీలో అవకాశాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు ఒకవేళ ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేకుంటే వారికి ఇంకొక ఛాన్స్ ఉండదని చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

బాబు ఫుల్ ఫోకస్ :

దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పూర్తి అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరు మీద పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఏ పార్టీకైనా ప్రభుత్వానికైనా ఎమ్మెల్యేల పనితీరే కొలమానంగా ఉంటుంది ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే అది కచ్చితంగా పార్టీ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే చంద్రబాబు ఈ విషయంలో చెప్పాల్సింది చెప్పేశారు. నో ఛాన్స్ అని కూడా చెప్పేశారు. దాంతో ఇది ఒక కఠిన సందేశంగా టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ప్రజలలో నిత్యం ఉన్నవాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అంతే కాదు వారి విషయంలో ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు ఉండవు. అందువల్ల అటువంటి ఎమ్మెల్యేలు బేఫికర్ గా ఉండవచ్చు. కానీ ప్రజలతో సంబంధాలను మెరుగుపరుచుకోలేని వాళ్ళు, జనంతో మమేకం కాని వాళ్ళు, కార్యకర్తలతో కలిసి రాని వాళ్ళు చంద్రబాబు హెచ్చరికలను ఇకమీదట పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉందని అంటున్నారు. లేకపోతే బాబు చెప్పినట్టుగా వాళ్లకి నో ఛాన్స్ అన్నది ఖాయం.

దిశా నిర్దేశం :

ఇక చూస్తే రాజకీయాలలో అవకాశాలున్నవి ఎవరో ఇవ్వరు. ఎవరి మటుకు వారే తమ పనితీరుతో ప్రతిభతో సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైకరితో ఉన్ది. చంద్రబాబు గురించే మాట్లాడుకుంటే ఆయన ఎప్పటికప్పుడు పార్టీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ అలెక్ట్ చేస్తూనే ఉన్నారు. వారికి దిసా నిర్దేశం చేస్తూనే ఉన్నారు. అయితే అధినేత చెప్పిన మాటలను పట్టించుకోని మారిన వారికి పార్టీలో ఏ రకమైన అవకాశాలు ఉండవని టాయని తేటతెల్లమైంది.

కఠిన వైఖరితోనే :

చంద్రబాబు అధినేత హోదాలో చాలా పక్కాగా ఉంటారు. పార్టీ విషయంలో చాలా స్పష్టంగా ఉంటారు. గతంతో పోలిస్తే ఇపుడు మరింత కఠినంగానే ఉంటూ వస్తున్నారు. గతంలో సంగతి ఏమో కానీ ప్రస్తుతం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేల పనితీరు విషయంలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. బహిరంగ వేదికలయితేనేమి పార్టీ సమావేశాల్లో అయితేనేమి బాబు కచ్చితంగా వ్యవహరిస్తున్నారు. ఇక తన చేతులలో ఏమీ లేదని చెప్తున్నారు. అందువల్ల మారాల్సింది పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే. చంద్రబాబు మాటలను హెచ్చరికలను ఇప్పటికైనా పాటిస్తే మరొక ఛాన్స్ ఎవరికైనా దక్కుతుంది అన్నది స్పష్టం.

Tags:    

Similar News