ఏపీలో మంత్రులు కంప్యూటర్ కోర్సు నేర్చుకోవాలంట !

మరి ఇది మంత్రులు ఏ విధంగా తీసుకున్నారు తెలియదు కానీ ఇది మంత్రులకు సంబంధించి చూస్తే కొంచెం క్లిష్టమైన కష్టమైన విషయమే అనుకోవాలి.;

Update: 2026-04-30 18:28 GMT

అవును. ఈ మాటలు అన్నది ఎవరో కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రి వర్గ సమావేశంలో ఆయన ఈ మాటలు అన్నారు. నిజానికి చూస్తే ముఖ్యమంత్రి బాబు అన్న మాట నిజమే కావచ్చు. టెక్నాలజీ అందరికీ అవసరంగా ఉంది. కానీ అది ఎక్కువగా యూత్ కి ఉపాధికి ఉపయోగపడే విధంగా ఉంది. ఏఐ గురించి చూస్తే ఇంకా యువతకే అవగాహన పెద్దగా లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు కూడా వీటి విషయంలో తగిన ప్రావీణ్యత సాధించాలని బాబు కోరుతున్నారు.

టెక్నాలజీ పాత్ర ఉంది :

వాస్తవంగా తీసుకోవాలి అంటే ప్రభుత్వ పరిపాలనలో టెక్నాలజీ పాత్ర చాలానే ఉంది. కానీ అది ఏ మేరకు ఎంతవరకు అన్నదాని మీదనే మంత్రులకు సైతం ఒక అవగాహన ఉండాల్సి ఉంది. ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాల్సి ఉంది. చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయనలో మొదటి నుంచి కూడా టెక్నాలజీ పట్ల చాలా ఆసక్తి అనురక్తి అన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఆయన గతంలో హైటెక్ సిటీ గురించి ఎక్కువగా చెప్పుకొచ్చేవారు. అలాగే ఇప్పుడు తీసుకుంటే ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఒక విధంగా చూస్తే ఆయన టెక్నాలజీకి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు.

కానీ రాజకీయాల్లో చూస్తే చాలామంది నాయకులు ఆ విషయంలో వెనకబడే ఉంటారన్నది వాస్తవం.

టెక్నాలజీ అంటేనే :

మరీ ముఖ్యంగా టెక్నాలజీ విషయంలో చాలా మంది మంత్రుల నుంచి కానీ ఎమ్మెల్యే నుంచి గాని తీసుకుంటే అవగాహన ఆసక్తి ఉన్న వారు ఎంత మంది అన్న ప్రశ్నలు వస్తాయి. అయితే చంద్రబాబు కంప్యూటర్ గురించి, ఏఐ గురించి సభలలో సమావేశాలలో మాట్లాడుతూంటారు. అలా ఆయన రాష్ట్ర ప్రజలకు సభలలో సమావేశాలలో చెప్పిన విషయాలనే మంత్రి వర్గ సమావేశాలలో మంత్రులకు చెప్పారు. దాని మీద ఆయన వారికి ఒక క్లాస్ కూడా తీసుకున్నారు.

అప్డేట్ కాకుంటే చులకన :

అది ఎలా అంటే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీరు ఇలాగే ఉంటే కుదరదు కాలంతో పాటు మారాలి మీరు అప్డేట్ కావాలి అని ఆయన చేసిన సూచన. మంత్రివర్గ సమావేశం సందర్భంగా చాలా అంశాలకు ఆమోదముద్ర వేశారు అనంతరం ప్రతిసారి లాగానే చంద్రబాబు ఇష్టాగోష్టి మాట్లాడుతూ మంత్రులకు హితబోధ చేశారు, పలు సూచనలు సైతం చేశారు. అనేక విషయాలు వారితో మాట్లాడారు. అందులో భాగంగా మంత్రులు టెక్నాలజీపై అప్డేట్ కావాలి ఏఐ కంప్యూటింగ్ పై అవగాహన ఉండాలని టెక్నాలజీలో అప్డేట్ కాకుంటే చులకన అవుతారు అని కూడా చెప్పారు అది ఒక రకంగా హెచ్చరించారు కూడా భావించాలి.

శిక్షణ తరగతులు నిర్వహిస్తారా :

మరి ఇది మంత్రులు ఏ విధంగా తీసుకున్నారు తెలియదు కానీ ఇది మంత్రులకు సంబంధించి చూస్తే కొంచెం క్లిష్టమైన కష్టమైన విషయమే అనుకోవాలి. ఆసక్తి ఉన్నవారికి ఇది చాలా ఈజీ కాకపోతే చాలామంది బేసిక్స్ నేర్చుకోవడం వరకూ ఫరవాలేదు కానీ క్వాంటం కంప్యూటర్ ఏఐ వీటి విషయంలో మంత్రులు ఎంతవరకు అప్డేట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది. బాబు చెప్పింది ఏమిటంటే టెక్నాలజీ పట్ల చాలా మోజు పెంచుకోవాలని ఉద్దేశంతో చెప్పారు. మరి ఈ విషయంలో శిక్షణ తరగతులు ఏమైనా నిర్వహిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగు తున్న వ్యవహారాలన్నీ కూడా టెక్నాలజీ ఆధారపడి ఉన్నాయి కాబట్టి అయితే దాన్ని అంది పుచ్చుకునే అవసరం కూడా ఉంది. అయితే ఎక్కువగా యువత దీని తీసుకుంటే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అయితే చంద్రబాబు చెప్పేది ఏంటంటే మంత్రులు కూడా ఈ విషయంలో బాగా అప్డేట్ అయితేనే బాగుంటుంది అని.

ట్రెడిషనల్ స్టైల్ నుంచి :

సాధారణంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ట్రెడిషనల్ అవుట్ లుక్ తోనే ఉంటారు. ఇపుడు సీఎం చేసిన సూచనలతో వారు అంతా కంప్యూటర్ కోర్సుల మీద ఫోకస్ పెట్టాల్సి ఉంది అని అంటున్నారు. బాబు ఈ విషయంలో ఇచ్చిన సలహా సూచనలు బాగానే ఉన్నాయి. మంత్రులు ఉత్సాహం ఎలా ఉంటుంది అన్నదే చూడాల్సి ఉంది. మొత్తానికి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒక రకంగా వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News