• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  త‌మ్ముళ్ల బాధ ఇదే.....

త‌మ్ముళ్ల బాధ ఇదే.. చంద్ర‌బాబు షాకింగ్ డెసిష‌న్‌.. !

| ఈవ్య‌వ‌హారం సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కు కూడా వెళ్లింది.

By - Tupaki Desk
Update: 2024-10-23 02:30 GMT

వైసీపీ హ‌యాంలో నాయ‌కులు ఇసుక‌, మ‌ట్టి వంటివాటిలో జోక్యం చేసుకున్నారు. దీంతో ఈ ప్ర‌భావం పార్టీ పై ప‌డింది. ఫ‌లితంగా క్షేత్ర‌స్థాయిలో లెక్కలు మారిపోయాయి. ఇది వైసీపీ ప‌త‌నానికి దారి తీసింది. ఇక‌, ఇప్పుడు ఇసుక‌, మ‌ద్యం విష‌యంలో టీడీపీ నేత‌లు.. జోక్యం చేసుకుంటున్నారంటూ కొన్ని రోజులుగా వార్త‌లు, విమ‌ర్శ‌లు, వివాదాలు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. వీటిపై పెద్ద ఎత్తున ర‌గ‌డ కూడా చోటుచేసు కుంది.

ఈవ్య‌వ‌హారం సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కు కూడా వెళ్లింది. దీంతో త‌మ్ముళ్ల‌పై చంద్ర‌బాబు సీరియ‌స్ కావ‌డం .. త‌గ‌ద‌ని అనుకూల మీడియాలోనూ క‌థ‌నాలు రావ‌డంతో కొంద‌రు వెన‌క్కి త‌గ్గిన‌ట్టు క‌నిపించింది. అయి తే.. ఇదేస‌మ‌యంలో నాయ‌కులు క్షేత్ర‌స్థాయిలో తాము ప‌డుతున్న ఇబ్బందుల‌ను కూడా చంద్ర‌బాబుకు తాజాగా వివ‌రించారు. ఆయా జిల్లాల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుల ద్వారా చంద్ర‌బాబుకు స‌మాచారం అందించారు.

ఎన్నిక‌ల‌కు ముందు.. గ‌త ఐదేళ్ల‌లో తాము పార్టీ కోసం ఎంతెంత ఖ‌ర్చు చేసిందీ విశాఖ‌కు చెందిన ఓ కీల‌క‌ నాయ‌కుడు జ‌మా ప‌ద్దుల‌తో స‌హా పెద్ద జాబితాతో కూడిన పెన్ డ్రైవ్‌ను చంద్ర‌బాబుకు చేర‌వేశారు. అదే విధంగా అనంత‌పురానికి చెందిన ఓ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కూడా వివ‌రాల‌ను త‌న వారితో చంద్ర‌బాబు కు పంపించారు. వీటిలో ప్ర‌ధానంగా తాము జైళ్ల‌కు వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. పెట్టిన బెయిల్ ఖ‌ర్చులు, పార్టీ ఇచ్చిన పిలుపు మేర‌కు చేసిన ధ‌ర్నాల‌కు అయిన డ‌బ్బులు.

ఇవి కాకుండా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ నుంచి రూపాయి రాక‌పోయినా.. తామే అంతా భ‌రించామంటూ .. ఆ లెక్క‌లు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు త‌మ ద‌గ్గ‌ర రూపాయి కూడా లేద‌ని.. రోజు వారీ ఖ‌ర్చులే ల‌క్ష‌ల్లో ఉంటున్నాయ‌ని వివ‌రించారు. వీటిపై సీనియ‌ర్ నాయ‌కులు ముగ్గురు చంద్ర‌బాబుకు వివ‌రించారు. ఇది నిజ‌మేన‌ని వారు కూడా ధ్రువీక‌రించిన‌ట్టు పార్టీ వ‌ర్గాల ద్వారా తెలిసింది. దీంతో వారికి కొంత వెసులుబాటు ఇవ్వాల‌నివారు చంద్ర‌బాబుకు సూచించారు. దీనికి ప్ర‌స్తుతానికి చంద్ర‌బాబు `మౌనం`గా ఉన్నారు. సో.. దీనిని బ‌ట్టి.. ఏం చేస్తారో చూడాలి.

Tags:    
  • Tdp 
  • Jsp 
  • Bjp 
  • Congressparty 
  • Ycp 
  • Jaganmohanreddy 
  • Chandrababu 
  • ApCM 
  • Pawankalyan 
  • DeputyCM 

Similar News

పవన్ విడాకుల వేళ.. రేణు హుందాతనం

2026-11-10 11:45 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

రాప్తాడు బాలిక ఆరోగ్యంలో కీలక మార్పు.. ప్రాణాపాయం దాటినట్లే!

2026-11-10 09:39 GMT

ఒక ఎఫైర్ ఖరీదు అక్షరాల రూ.18 లక్షల కోట్ల నష్టం..

2026-11-10 09:37 GMT

10 రోజుల ఉత్కంఠ.. 19న జడ్పీ, మండల పరిషత్ చైర్మన్ల ఎన్నిక

2026-11-10 09:36 GMT

పవన్ కోసం.. టీడీపీ, వైసీపీ ఒకే మాట!

2026-11-10 09:36 GMT

ఆ వార్తలు ఓవైపు.. ప్రజా నాయకుడిగా పవన్ ఇలా!

2026-11-10 09:31 GMT

అనంతపురంలో మేయర్ రచ్చ : టీడీపీ ఎమ్మెల్యేలకు అనంత వెంకటరామిరెడ్డి బిగ్ సవాల్

2026-11-10 09:27 GMT

కనీసం నా కళ్లలోకి కూడా చూడడు.. మోడీపై సోనియా హాట్ కామెంట్స్

2026-11-10 07:52 GMT

అమెరికాలో ఎస్‌బీఐ విస్తరణ.. టెక్సాస్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభం!

2026-11-10 07:15 GMT

న్యూజెర్సీలో దీపావళి వేడుకల తర్వాత చెత్తకుప్పలు.. పండుగ సంబరాల్లో పౌర బాధ్యత మరిచారా?

2026-11-10 07:15 GMT

Copyright @2026

Powered by Blink CMS