మంత్రుల‌పై చంద్రబాబు సంతృప్తి..!

గ‌త నెల‌లో జ‌రిగిన టీడీపీ మ‌హానాడు ఆన్‌లైన్‌లో జ‌రిగింది. అయితే.. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న మంత్రులు.. దిగ్విజ‌యం చేశారు.

Update: 2026-06-05 04:22 GMT

త‌ర‌చుగా మంత్రుల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేసే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. తాజాగా మంత్రు ల ప‌నితీరుపై సంతృప్తి వ్య‌క్తం చేశారు. పేరు పెట్టి గ‌తంలో మీ శాఖ ప‌నితీరు బాగోలేద‌ని చెప్పిన చంద్ర‌బా బు.. తాజా మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఎవ‌రినీ నొప్పించే ప్ర‌య‌త్నం కానీ.. ఎవ‌రినీ హెచ్చ‌రించేలా సూచ‌న లు కానీ చేయ‌లేదు. పైగా.. ప‌నితీరు విష‌యంలో తాను సంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇది మంత్రుల‌కు ఒకింత బూస్ట్ ఇచ్చింద‌నే చెప్పాలి.

రీజ‌నేంటి?

గ‌త నెల‌లో జ‌రిగిన టీడీపీ మ‌హానాడు ఆన్‌లైన్‌లో జ‌రిగింది. అయితే.. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న మంత్రులు.. దిగ్విజ‌యం చేశారు. ఆన్‌లైనే అయిన‌ప్ప‌టికీ.. కార్య‌క‌ర్త‌ల‌ను నాయ‌కుల‌ను త‌ల‌రించి త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌హానాడు స‌క్రమంగానే కాకుండా.. బ‌లంగా నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇది క్షేత్ర‌స్థాయిలో పార్టీ పుంజుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డేలా చేసింది. అంతేకాదు.. ప్ర‌తి మంత్రీ.. తాను ఇంచార్జ్‌గా ఉన్న జిల్లాలో మ‌హానాడు విజ‌యానికి కృషి చేశారు.

మ‌రోవైపు.. వైసీపీ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు మంత్రులు గ‌తానికి భిన్నంగా బ‌ల‌మైన కౌంట‌ర్లు ఇచ్చారు. ముఖ్యంగా డీఎస్సీ నుంచి రాజ‌ధాని రైతుల వ‌ర‌కు.. కొంద‌రు.. జ‌గ‌న్‌ను క‌లుసుకుని త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొన్నారు. అయితే.. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న‌ది నాట‌క‌మ‌ని.. డీఎస్సీని పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించామ ని.. చెప్పే విష‌యంలో మంత్రులు స‌క్సెస్ అయ్యారు. మాట కు మాట అన్న‌ట్టుగా వైసీపీ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో డీఎస్సీలో ఉద్యోగాలు ద‌క్కించుకున్న‌ అభ్య‌ర్థుల‌ను ఒక చోట‌కు చేర్చి.. వారితోనే వైసీపీని ఏకేయించారు.

ఇక‌, కీల‌క‌మైన‌.. గ్రీవెన్స్ విష‌యంలోనూమంత్రులు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటు మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలోను.. క్షేత్ర‌స్థాయిలో నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. గ్రీవెన్సును నిర్వ‌హించి... ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఈ వ్య‌వ‌హారాల‌న్నీ.. స‌జావుగా సాగ‌డంతోపాటు.. మంత్రుల మ‌ధ్య కూడా ఐక్య‌త పెరుగుతున్న సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబు త‌న సంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News