పదేళ్ల నాటి ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు ట్రోలింగ్
ఇదిలా ఉంటే ఇపుడు ఈ ఇద్దరూ కీలకమైన పదవులలో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్నారు.;
రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులుగా చంద్రబాబు రేవంత్ రెడ్డి ఉన్నారు. ఏపీ ఉమ్మడిగా ఉన్న వేళ చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాటు సీఎం గా ఉన్నారు. ఇక 2014లో విభజన తరువాత ఏపీకి సీఎం అయ్యారు. అదే పార్టీలో తెలంగాణా టీడీపీకి కీలక నేతగా రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ఆ సమయంలో అంటే 2015లో జరిగిన ఒక సంఘటన ఇప్పటికి పదేళ్ళు అయినా రాజకీయంగా కూడా చర్చనీయాంశంగానే ఉంటుంది. అప్పట్లో ఓటుకు నోటు అన్నది బిగ్గెస్ట్ పొలిటికల్ ఇష్యూగా మారింది. ఒక విధంగా తెలుగు రాష్ట్రాలనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. ఆనాటి సీఎం కేసీఆర్ అయితే దీని మీద సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఈ కేసు నుంచి ఎవరినీ బ్రహ్మదేవుడు వచ్చినా కాపాడలేరు అని కూడా ఆయన ఒక పవర్ ఫుల్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ తరువాత ఏమి జరిగింది అన్నది అందరికీ తెలిసిందే.
ఆ ఇద్దరూ అలా :
సరే ఇదంతా ఎందుకు పదేళ్ల నాటి ఫ్లాష్ బ్యాక్ ఇపుడు అవసరమా అంటే ఆ ఇద్దరూ ఒకే వేదిక మీద కలిశారు. పరస్పరం పలకరించుకున్నారు. పక్క పక్కన కూర్చుని నవ్వులు చిందించారు. చాలా సీరియస్ మ్యాటర్స్ నే డిస్కషన్ చేసినట్లుగా వేదిక మీద వారిని చూసిన వారు అనుకుంటున్నారు అయితే ఈ ఇద్దరినీ అలా చూసిన వారికి ఈ పదేళ్ళ క్రితం నాటి ఫ్లాష్ బ్యాక్ కూడా గుర్తుకు వస్తోందిట. అదేంటి అంటేనే ఓటుకు నోటు కేసు. ఆనాడు చంద్రబాబు అధినేతగా ఉంటే ఆయన ఆదేశాల మీద రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక బీఆర్ఎస్ నేతను ప్రలోభ పెట్టారని ఆరోపణలు అయితే వచ్చాయి. అప్పట్లో వీడియో ఆడియోలు కూడా దీని మీద వచ్చి అతి పెద్ద రాజకీయ రచ్చ కూడా జరిగింది అని అంటారు.
ఫుల్ ట్రోలింగ్ :
ఇదిలా ఉంటే ఇపుడు ఈ ఇద్దరూ కీలకమైన పదవులలో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్నారు. అయితే ఇపుడు ఇలా కలుసుకోవడం ముచ్చటించుకోవడం చూసిన వారికి పాత విషయాలు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి అంటే రాజకీయ ప్రత్యర్ధులకు ఇవే తప్పకుండా వస్తాయి కదా అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఇదే ఇపుడు చర్చగా ఉంది అంటే ఆశ్చర్యమేమీ లేదు, పాలిటిక్స్ అలాగే ఉంటాయి అదే సమయంలో ట్రోలింగ్ చేస్తూ వస్తున్న వారికి హాట్ ఇష్యూస్ కావాలి. అందులో భాగమే ఇది కూడా అంటున్నారు.
ఎంతలో ఎంత మార్పు :
అయితే ఒక్కటే మాట ఇక్కడ చెప్పుకోవాలి. టీడీపీలో చేరిన అనతికాలంలోనే రేవంత్ రెడ్డి ఆ పార్టీలో కీలకంగా మారిపోయారు అంటే ఆయన టాలెంట్ అని కూడా చెప్పుకోవాలి. అదే సమయంలో చంద్రబాబు కూడా ఆయనను ప్రోత్సహించారు. ఇక ఓటుకు ఓటు కేసు బాబు రేవంత్ ఇద్దరినీ కొంత కలవరపెట్టినా ఆ తరువాత పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డి రాజకీయంగా మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి అది ఎంతో దోహదపడింది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి.
అలాగే చంద్రబాబు ఎన్ని విమర్శలు వచ్చినా ఆరోపణలు వచ్చినా తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతూ అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ ఉంటారు. సో పదేళ్ళ క్రితం ఇదే రకమైన అంశంలో మరే ఇద్దరు నాయకులు అయితే ఇందులో ఉంటే వారు ఈ రోజున వారి పరిస్థితి ఏమిటో తెలియదు కానీ అక్కడ ఉన్నది బాబు రేవంత్ రెడ్డి కాబట్టి వారి వ్యూహాలు టాలెంట్ అన్నీ కలసి ఈ రోజున మళ్ళీ ఎదురులేకుండా చేశాయని కూడా అంటూంటారు. ఏది ఏమైనా ఫ్లాష్ బ్యాక్ లతో ట్రోల్స్ చేయడం అన్నది ఈ నేతలను ఏమి చేస్తుంది అన్నది కూడా ఉంది. కానీ ట్రోల్స్ చేసిన వారికి అదో ఆనందం అంతే అనుకోవాల్సిందే మరి.