భేష్ మిత్ర‌మా.. ప‌వ‌న్‌కు చంద్ర‌బాబు కితాబు!

దీనిపై స్పందించిన సీఎం చంద్ర‌బాబు.. ఒకేసారి ఐదు విభాగాల్లో అవార్డులు రావ‌డం అంటే.. గొప్ప విష య‌మ‌ని పేర్కొన్నారు.

Update: 2026-06-05 04:12 GMT

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కల్యాణ్‌ను సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంసించారు. భేష్ మిత్ర‌మా.. అంటూ ఆయ‌న కొనియాడారు. మ‌రింతగా అభివృద్ధిలో దూసుకుపోవాలని చంద్ర‌బాబు సూచించారు. తాజాగా గురువారం రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌లు స‌హా మంత్రులు హాజ‌ర‌య్యారు. మంత్రి నారా లోకేష్ ర‌ష్యాలో ఉండ‌డంతో మిగిలిన వారు వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా అధికారులు.. కేంద్రం బుధ‌వారం ఇచ్చిన పంచాయ‌తీ అవార్డుల‌ను న‌గ‌దు చెక్కుల‌ను కూడా కేబినెట్ స‌మావేశానికి తీసుకువ‌చ్చి.. సీఎం చంద్ర‌బాబుకు సూచించారు. ఐదు విభాగాల్లో పంచాయ తీల‌కు అవార్డులు వ‌చ్చాయ‌ని.. కోట్ల రూపాయ‌ల న‌గ‌దు పుర‌స్కారం కూడా ల‌భించింద‌ని అధికారులు వివ‌రించారు. అవార్డులు అందుకున్న అధికారులు కూడా స‌మావేశానికి వ‌చ్చారు. ఈ అవార్డులు రావ‌డం వెనుక‌.. పంచాయ‌తీ రాజ్ మంత్రిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంతో కృషి చేశార‌ని.. అధికారులు తెలిపారు.

దీనిపై స్పందించిన సీఎం చంద్ర‌బాబు.. ఒకేసారి ఐదు విభాగాల్లో అవార్డులు రావ‌డం అంటే.. గొప్ప విష య‌మ‌ని పేర్కొన్నారు. దీనికి మ‌న‌స్పూర్తిగా ఉప ముఖ్య‌మంత్రిని అభినందిస్తున్నాన‌ని చెప్పారు. మంత్రు లు కూడా చ‌ప్ప‌ట్లు చ‌రుస్తూ.. త‌మ హ‌ర్షాతిరేకాల‌ను వ్య‌క్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయ‌తీల్లో పాల‌న బాగుంద‌ని.. పంచ‌య‌తీ రాజ్ శాఖ మంత్రిగా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ నిరంత‌రం ప‌నిచేస్తున్న ఫ‌లితంగా ఈ అవార్డులు ల‌భించాని చంద్ర‌బాబు కొనియాడారు.

ఇవీ అవార్డుల వివ‌రాలు..

+ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సతాత్‌ వికాస్‌ పురస్కార్‌ గ్రామ పంచాయతీ కేటగిరీ కింద సుపరిపాలనకు సంబంధించి అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం పంచాయతీ 1వ ర్యాంకు ద‌క్కించుకుంది.

+ మహిళా స్నేహపూర్తి పంచాయతీగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామానికి 1వ ర్యాంకు ల‌భించింది.

+ పేదరిక నిర్మూలన-జీవనోపాధుల పెంపు కేటగిరీలో కడప జిల్లా ఖాజీపేట మండలం చెమ్ముళ్లపల్లి పంచాయతీకి 2వ ర్యాంకు ల‌భించింది.

+ మౌలిక వసతులు కల్పించిన పంచాయతీల కేటగిరీల కింద ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గుండమల పంచాయతీకి 3వ ర్యాంకు ద‌క్కింది.

+ నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయతీ సతాత్‌ వికాస్‌ పురస్కార్‌ కేటగిరీ కింద చిత్తూరు జిల్లా కుప్పం(సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం) మండలానికి అవార్డు దక్కింది.

Tags:    

Similar News