పవన్ విషయంలో ఆ వాదనే నిజమవుతోంది?!
గతంలో బీఆర్ ఎస్ ఉన్నా.. ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్నా.. పలు విషయాలు ఆయా ప్రభుత్వాలకు.. సినీ రంగానికి మధ్య వివాదాలుగా మారాయి.
తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణ జరిగితే.. కీలకమైన సినీ రంగం ఆయనకు మద్దతుగా నిలుస్తుందన్న భరోసా కనిపిస్తోంది. వాస్తవానికి ఇతర పార్టీలైన.. కాంగ్రెస్, బీఆర్ ఎస్‌లు.. ఈ విషయంలోనే తమ అంతర్గ త భయాన్ని బయట పెట్టుకున్నట్టు కనిపించింది. ఇప్పటి వరకు అంటే.. తెలంగాణ ఏర్పడి 12 సంవత్స రాలు అయినా.. సినీ రంగం ఏ పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించలేదు. ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా అన్యమస్కంగానే ఫాలో అయింది.
గతంలో బీఆర్ ఎస్ ఉన్నా.. ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్నా.. పలు విషయాలు ఆయా ప్రభుత్వాలకు.. సినీ రంగానికి మధ్య వివాదాలుగా మారాయి. బీఆర్ ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. సినీ రంగాన్ని ఇబ్బందికి గురి చేసిందన్న వాదన వినిపించింది. ఇక, కాంగ్రెస్ హయాంలో పుష్ప -2 ఘటన తర్వాత, అక్కినేని నాగార్జున ఆస్తులపై హైడ్రా దాడుల తర్వాత.. సినీ రంగం ఇరకాటంలో పడిందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో సర్దుకు పోయే రాజకీయాలకే సినీ రంగం ప్రాధాన్యం ఇస్తోంది.
కానీ, అంతర్గతంగా మాత్రం అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో సినీ రంగానికే చెందిన పవన్ కల్యాణ్ రాజకీయంగా విస్తరిస్తే.. తెలంగాణలో ఇండస్ట్రీకి మేలు జరుగుతుందన్న వాదన ఉంది. అయితే.. ఈ విషయాన్ని ఎవరూ బయటకు చెప్పడం లేదు. తాజాగా ఒక్కొక్కరుగా పవన్‌కు మద్దతు పలుకుతున్న తీరు చూస్తే.. సినీ రంగం.. పవన్ కల్యాణ్ రాజకీయాలను స్వాగతిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఏ విషయంలో అయితే.. తెలంగాణ పార్టీలు భయానికి, ఆవేదనకు గురయ్యాయో.. ఇప్పుడు అదే నిజం అయ్యే సూచనలు సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం పవన్‌కు.. నిర్మాత బండ్ల గణేష్, క్యారెక్టర్ ఆర్టిస్టే అయినా.. ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న పద్మ వంటి వారు బహిరంగంగానే.. మద్దతు ప్రకటించారు. ఆయన తెలంగాణలో రాజకీయాలు చేస్తే తప్పు లేదన్నట్టుగానే వ్యవహారించారు. ఇది మచ్చుకు మాత్రమే.. మిగిలిన వారిలోనూ ఇదే అభిప్రాయం ఉంది. అయితే.. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. ఎన్నికల సమయానికి పవన్‌కు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించే అవకాశం ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు సెటిలర్లు, యువత, పారిశ్రామిక వేత్తలు కూడా.. పవన్‌కు అండగా నిలిచే అవకాశం స్పష్టంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.