ఒకే రోజు.. ఒకే జిల్లాలో బాబు-ప‌వ‌న్‌-లోకేష్‌.. తేడా ఏంటంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు ఒకే రోజు ఒకే జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు.;

Update: 2025-08-29 12:15 GMT

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు ఒకే రోజు ఒకే జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే... వారు పాల్గొన్న కార్య‌క్ర‌మాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అయితే.. ఒకే రోజు ఇలా ముగ్గురు కీల‌క నాయ‌కులు.. ఒకే జిల్లాలో ప‌ర్య‌టించ‌డం మాత్రం అరుదైన ఘ‌ట‌న‌గా ప్ర‌భుత్వవ‌ర్గాలు చెబుతున్నాయి. కాగా.. వీరు ముగ్గురు విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ప‌ర్య‌టిస్తుండడం గ‌మ‌నార్హం.

సీఎం చంద్ర‌బాబు టూర్ ఇదీ..

సీఎం చంద్ర‌బాబు శుక్ర‌వారం ఉద‌యం విశాఖ‌కు చేరుకున్నారు. నోవోటెల్‌లో జరిగే ‘ఫుడ్ మాన్యుఫ్యాక్చ రింగ్ సమ్మిట్‌’లో పాల్గొన్నారు. సంద‌ర్భంగా ఆహార ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడుల‌పై ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రంలో మ‌త్స్య సంప‌ద‌తో పాటు ట‌మాటా, మిర్చికి మంచి సాగు ఉంద‌ని.. దీనిని స‌ద్విని యోగం చేసుకుని.. ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాల‌ని పారిశ్రామిక వేత్త‌ల‌కు ఆయ‌న సూచించారు. త‌ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వానికి, రైతుల‌కు కూడా మేలు జ‌రుగుతుంద‌ని చెప్పారు.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌.. ప‌నులు ఇవీ..

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా.. గురువారం నుంచి విశాఖ‌ప‌ట్నంలోనే ఉన్నారు. సేనానితో సేన కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న శుక్ర‌వారం పార్టీ జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్‌ల‌తో భేటీ అయ్యారు. దీనికి ముందు ఉద‌యాన్నే ఆయ‌న విశాఖ‌లోని రుషికొండ‌పై వైసీపీ హ‌యాంలో నిర్మించిన ప్యాలెస్‌ను సంద‌ర్శించారు. దీనికి సంబంధించి ఏం చేయాలో ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలిపారు. అనంత‌రం.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యారు.

మంత్రి నారా లోకేష్ షెడ్యూల్ ఇదీ..

మంత్రి నారా లోకేష్ కూడా విశాఖ‌ప‌ట్నంలోనే ప‌ర్య‌టిస్తున్నారు. వైజాగ్ కన్వెన్షన్ లో జ‌రిగిన `అర్థ సమృద్ధి 2025- ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్ `లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా.. ఆయ‌న మాట్లాడుతూ.. రా ష్ట్రానికి మంచి రోజులు వ‌చ్చాయ‌ని, కూట‌మి ప్ర‌భుత్వం బ‌లంగా ఉంద‌ని, వ‌చ్చే 25 ఏళ్ల పాటు ఒకే ప్ర‌భు త్వం కొన‌సాగుతుంద‌ని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబ‌డులు పెట్టేవారు త‌ర‌లి రావాల‌ని ఆయ‌న సూచించారు. అనంత‌రం విశాఖలోని చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్ లో ఏఐ ల్యాబ్స్ ను ప్రారంభించారు.

Tags:    

Similar News