లోకల్ గేమ్ లో జనసేనది కీ రోల్ !

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనది కీలక పాత్ర కాబోతోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికల విషయంలో రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు.

Update: 2026-10-07 03:41 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనది కీలక పాత్ర కాబోతోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికల విషయంలో రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల వ్యూహాలతో పాటు సీట్ల సర్దుబాటు గురించి కూడా ఇరువురు నేతల మధ్య చర్చ సానుకూల వాతావరణంలో సాగింది అని అంటున్నారు. దీంతో పాటు ఐక్యత ప్రధాంగానే ముందుకు అడుగులు వేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇక జనసేన ముప్పయి శాతం సీటు షేర్ ని కూటమిలో కోరుతోంది. ఈ విషయంలో అయితే పాజిటివ్ గానే సంకేతాలు రావచ్చు అని జనసేన వర్గాలలో ఆశాభావం వ్యక్తం అవుతోంది.

బీజేపీ వల్లనే :

ఇక 2024 ఎన్నికల వేళ జనసేనకు నాలుగు ఎంపీల సీట్లు 24 దాకా ఎమ్మెల్యేల సీట్లు రావాల్సి ఉంది. అయితే బీజేపీ కలసి పోటీ చేయడంతో జనసేన తన సీట్లను త్యాగం చేసింది అని గుర్తు చేస్తున్నారు. అలా మూడు ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు కోల్పోయింది అని అంటున్నారు. అవి సార్వత్రిక ఎన్నికలు కాబట్టి బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సీట్ల సర్దుబాటు మీద ఫోకస్ పెట్టింది. తమకు ఇన్ని కావాలని కోరింది కూడా. ఇపుడు అయితే స్థానిక ఎన్నికల్లో సీట్ల విషయం అంతా ఏపీ నాయకత్వం మీదనే బీజేపీ పెట్టింది అని అంటున్నారు. దాంతో జాతీయ పార్టీగా బీజేపీకి స్థానిక ఎన్నికల విషయంలో కూటమితో కలిసి ముందుకు సాగడమే ముఖ్యమని అంటున్నారు. దాంతో బీజేపీ ఈసారి సర్దుబాటులో కొంత సంయమనంతో వ్యవహరిస్తుంది అని అంటున్నారు.

కోరుకున్నట్లుగానే :

ఈ క్రమంలో జనసేన కోరుకున్నట్లుగానే సీట్ల షేర్ లో తగిన వాటా దక్కవచ్చు అని అంటున్నారు. గరిష్టంగా ఐదు మేయర్ సీట్లను జనసేన కోరుతున్నా కనిష్టంగా మూడు మేయర్ పదవులు ఇచ్చి తీరుతారు అని అంటున్నారు. వీలైతే ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదని అంటున్నారు. అలాగే జెడ్పీ పీఠాల విషయంలో కూడా మొత్తం 26 కి గానూ అయిదారు దాకా జనసేనకు పొత్తు ధర్మంలో భాగంగా దక్కే వీలుందని అంటున్నారు. జనసేనకు బలం ఉన్న గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలో రాయలసీమలో కూడా కోరిన చోట్ల సీట్లు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి.

పదహారు వేలకు పైగా :

ఏపీలో మునిసిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల పరిషత్తులు ఇలా పోస్టులు తీసుకుంటే పదహారు వేల పై చిలుకు ఉన్నాయి. ఇందులో టీడీపీ సింహ భాగం తీసుకున్నా కూడా జనసేనకు కూడా సముచితమైన స్థానం దక్కుతుందని అంటున్నారు. కనీసంగా రెండు వేల సీట్లలో అయినా జనసేన జెండా ఎగురుతుందని విశ్వాసం అయితే గాజు గ్లాస్ పార్టీలో వ్యక్తం అవుతుంది. ఆ విధంగా జరిగితే కనుక 2029 ఎన్నికల నాటికి గ్రౌండ్ లెవెల్ లో జనసేన బలంగా పుంజుకునే చాన్స్ ఉంటుందని అంటున్నారు.

సామరస్యంగానే :

ఇటు జనసైనికులు ఆనందించేలా అదే సమయంలో కూటమి సర్దుబాటుకు ఇబ్బంది రాకుండా ఆమోదయోగ్యమైన సర్దుబాటు జరుగుతుందని అంటున్నారు. కూటమిగా ఐక్యంగా ముందుకు వెళ్తే కనుక వైసీపీకి ఎక్కడా చాన్స్ ఇవ్వకుండా అన్ని సీట్లను తామే కైవశం చేసుకోవచ్చు అన్నది కూటమి పెద్దల ఆలోచనగా ఉంది. 2024 ఎన్నికల్లో దెబ్బ తిన్న వైసీపీకి స్థానిక ఎన్నికల్లో కూడా కోలుకోలేని షాక్ ఇస్తే 2029 ఎన్నికల్లో మరోసారి కూటమి విజయ ఢంకా మోగించేందుకు సులువుగా ఉంటుందని లెక్క వేస్తున్నారు. మొత్తం మీద చూస్తే జనసేన టీడీపీ కాంబోతో మరో సూపర్ పొలిటికల్ హిట్ ని సాధించేందుకు అయితే బాబు పవన్ భేటీ బాటలు వేసిందని అంటున్నారు.

Tags:    

Similar News