కల్తీ లేదు.. కార్బైడ్ లేదు.. తాటి ముంజల రుచి చూసిన సీఎం దంపతులు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో బిజీ షెడ్యూల్ మధ్య ఒక సామాన్యుడిలా మారిపోయారు.

Update: 2026-05-20 10:59 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో బిజీ షెడ్యూల్ మధ్య ఒక సామాన్యుడిలా మారిపోయారు. ప్రోటోకాల్‌ పక్కన పెట్టి, రోడ్డు పక్కన కాన్వాయ్ ఆపిన సీఎం సతీమణి భువనేశ్వరితో కలిసి తాటి ముంజలు రుచి చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలను, తన అనుభూతిని ఆయన 'ఎక్స్'లో పంచుకున్నారు. చంద్రబాబు, భువనేశ్వరి ఇద్దరూ తాడి కాయను తింటున్న ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.




 


కుప్పం ప్రజల మనసుల్లాగే స్వచ్ఛం

కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు రోడ్డు పక్కన తాటి ముంజలు అమ్ముతున్న ఒక చిరువ్యాపారి దగ్గర తన కాన్వాయ్‌ను ఆపారు. స్వయంగా తాటి ముంజలను తీసుకొని తిన్నారు. అనంతరం దీనిపై ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘కల్తీ లేదు... కార్బైడ్ లేదు.. పురుగు మందుల గోల లేదు.. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్చమైన, చల్లనైన తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులను మించింది ఏముంటుంది!’’ అంటూ ఆ ట్వీట్ లో చంద్రబాబు రాశారు.




 


నెటిజన్ల మనసు గెలుచుకున్న 'సింప్లిసిటీ'

ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా, రోడ్డు పక్కన ఆగి ప్రకృతి ప్రసాదించిన తాటి ముంజలను ఆస్వాదించడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే సహజసిద్ధమైన ఆహార ఉత్పత్తులకు సీఎం స్థాయి వ్యక్తి ఇంతటి ప్రచారం కల్పించడం అద్భుతమని పలువురు కొనియాడుతున్నారు. ఈ ఒక్క ట్వీట్ వల్ల తాటి ముంజలు అమ్మే పేద వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక బూస్ట్ లాంటిదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రసాయనాలు, కార్బైడ్‌లతో పండే పండ్ల కంటే ఎలాంటి కల్తీ లేని ఇలాంటి సాంప్రదాయ ఆహారాన్ని ఎంచుకోవాలంటూ సీఎం ఇచ్చిన సందేశం బాగుందని మరికొందరు అభినందిస్తున్నారు.




 


వైరల్ అవుతున్న ఫోటోలు

చంద్రబాబు ఎంతో ఇష్టంగా తాటి ముంజలు తింటున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. నిత్యం రాజకీయాలు, సమీక్షలతో బిజీగా ఉండే ముఖ్యమంత్రి.. ఇలా కుప్పం రోడ్లపై సాదాసీదాగా కనిపించడం స్థానిక ప్రజలను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. మొత్తానికి చంద్రబాబు 'తాటి ముంజల ట్వీట్' ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News