సిక్కోలు సెంటిమెంట్ ని ఎంచుకున్న బాబు

ఏప్రిల్ నే 15 నుంచి జూన్ 15వ తేదీ వరకూ రెండు నెలల పాటు మత్స్యకారులకు చేపల వేటను నిషేధిస్తారు.;

Update: 2025-04-24 11:44 GMT

సిక్కోలుని రాజకీయ పార్టీలు అన్నీ సెంటిమెంట్ గా భావిస్తాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి చేపట్టే ఈ కార్యక్రమం అయినా కూడా సక్సెస్ అవుతుందని నమ్మకంతో ఉంటాయి. ఇపుడు చంద్రబాబు కూడా మరో కీలక హామీని నెరవేర్చడానికి శ్రీకాకుళం జిల్లాను ఎంచుకున్నారు. ఈ నెల 26న ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటన చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా మత్య్సకార భరోసా పధకాన్ని అక్కడ అమలు చేయనున్నారు. ఈ పధకం కింద తాము నిధులు ఎక్కువ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి హామీ ఇచ్చింది. దాంతో కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మత్స్యకారులకు ఈ పధకం కింద ఫలాలు అందనున్నాయి.

ఏప్రిల్ నే 15 నుంచి జూన్ 15వ తేదీ వరకూ రెండు నెలల పాటు మత్స్యకారులకు చేపల వేటను నిషేధిస్తారు. ఆ సమయంలో వారు ఖాళీగా ఉంటారు. దాంతో కుటుంబాలు నడవడం కష్టంగా ఉంటుంది. దాంతో ప్రభుత్వాలు వారికి కొంత ఆర్ధిక సాయం అందించడం ద్వారా ఆదుకుంటూ వస్తున్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో కంటే ఎక్కువగా తాము మత్స్యకారులకు భరోసా ఇస్తామని చెప్పిన కూటమి ఇపుడు ఆ హామీని నిలబెట్టుకుంటోంది.

ఏకంగా ఇరవై వేల రూపాయలను భృతిగా ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలోని బుడగట్లపాలెంలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మత్య్సకారులతో బాబు ముఖాముఖీ మాట్లాడనున్నారు.

మరో వైపు చూస్తే కనుక ఏపీలోనే అతి పెద్ద తీర ప్రాంతంగా శ్రీకాకుళం జిల్లా ఉంది. ఈ జిల్లాలో చూస్తే పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉన్నారు. దాంతో ఈ జిల్లా నుంచే మత్య్సకారులకు సందేశం ఇవ్వాలని బాబు చూస్తున్నారు. మత్య్సకారులను ఆదుకునేది తమ ప్రభుత్వమే అని ఆయన చెప్పనున్నారు.

నిజంగా మత్సకార కుటుంబానికి 20 వేల రూపాయలు భృతి ఇవ్వడం అంటే మంచి ఆదాయం గానే చూస్తున్నారు. గతంలో అయితే కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవారు ఆ తర్వాత నుంచి నగదుని ఇస్తున్నా ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చిన దాఖలాలు లేవు. దాంతో కూటమి ప్రభుత్వం మత్స్యకారుల మన్ననలు పొందేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు.

ఇక శ్రీకాకుళం జిల్లాలోనే ఈ కార్యర్కమం చేపట్టడానికి మరో కారణం ఉంది. మత్స్యశాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. దాతో పాటుగా శ్రీకాకుళం జిల్లా రాజకీయంగా టీడీపీకి కంచుకోటగా ఉంది. దాంతో బాబు ఇక్కడికి వస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా సూపర్ సిక్స్ హామీలను ఒక్కోటిగా కూటమి ప్రభుత్వం అమలు చేసుకుని వస్తోంది. వాటిని ప్రాంతీయ సామాజిక రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ఆయా ఎంపిక చేసిన జిల్లాలలో పధకాలను ప్రారంభిస్తున్నారు. చాలా వ్యూహాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News