మరోసారి చంద్రబాబుకే పగ్గాలు!
టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు మరోసారి ఆపార్టీ కి అధ్యక్షుడిగా ఎన్నికకా వడం లాంఛనంగా మారింది.;
టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు మరోసారి ఆపార్టీ కి అధ్యక్షుడిగా ఎన్నికకా వడం లాంఛనంగా మారింది. తాజాగా జరుగుతున్న మహానాడులో పార్టీ అధ్యక్ష పీఠానికి ఎన్నిక జరగనుం ది. 23 వేల మంది ప్రతినిధులు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఇతర పార్టీల్లో మాదిరిగా నోటి మాట గా కాకుండా.. టీడీపీలో నామినేషన్.. అనంతరం ఎన్నిక వంటివి ఉంటాయి.
ఈ క్రమంలోనే మంగళవారమే నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. బుధవారం ఉదయం 10 గంటల వరకు పార్టీ జాతీయ అధ్యక్ష పీఠానికి నామినేషన్లు దాఖలు చేయొచ్చని ప్రకటించారు. పార్టీలో ఎవరైనా కనీసం 5 ఏళ్లపాటు పనిచేసిన వారు ఈ పదవికి అర్హులని ఎన్నికల కమిటీ సమన్వయ కర్త, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రకటించారు. నామినేషన్ వేసేవారిని 10 మంది సభ్యులు బలపరచాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అయితే.. బుధవారం ఉదయం 10 గంటల సమయానికి ఒకే ఒక్కనామినేషన్ దాఖలైంది. అది కూడా చం ద్రబాబు తరఫున ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ దాఖలు చేశారు. దీనిని సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతి రాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా.. ఇతర నాయకులు బలపరిచి సంతకాలు చేశారు. దీంతో నామినేషన్ల ఘట్టం ముగిసే సమయానికి ఒక ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం అయింది. దీంతో చంద్రబాబే మరోసారి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
మూడు దశాబ్దాలుగా..
నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీని 3 దశాబ్దాలుగా ముందుకు నడిపిస్తున్నారు. 1995-96 మధ్య కాలంలో పార్టీలో తలెత్తిన సంక్షోభం నాటి నుంచి కూడా.. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనే పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. అనేక ఉత్థాన పతనాలు చవిచూశారు. నాలుగు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. నాయకులు పోయినా.. కొత్త వారిని తయారు చేసుకున్నారు. యువతకు పెద్దపీట వేశారు. అదేసమయంలో అనేక సవాళ్లను ఎదిరించి పార్టీని బలోపేతం చేశారు.