రాజకీయ అజాత శత్రువుగా చంద్రబాబు

బాబుకు అన్ని పార్టీలలోనూ మిత్రులు ఉన్నారు. దేశాన్ని సుదీర్ఘ కాలం ఏలిన కాంగ్రెస్ తోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.;

Update: 2025-12-07 08:30 GMT

ఏపీకి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వారు ఎవరూ లేరు. ఒకప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులలో సుదీర్ఘ కాలం పాలించిన రికార్డు బ్రహ్మానందరెడ్డికి ఉండేది. కానీ దానిని ఎన్టీఆర్ బ్రేక్ చేశారు. ఇక ఎన్టీఆర్ రికార్డుని చాలా తొందరలోనే బాబు బ్రేక్ చేశారు. ఇపుడు తెలుగు నాట అత్యధిక కాలం పాలించిన సీఎం గా బాబు ఎదురు లేని రికార్డుని సాధించబోతున్నారు. దాని సంగతి అలా ఉంచితే బాబుకు ఎవరూ రాజకీయంగా శత్రువులు అయితే లేరు. ఇక ఏపీలో ఒక్క వైసీపీతోనే ఆయనకు పోరు ఉంది. ఇక బాబు కోణం నుంచి ఆయన దృక్కోణంలో నుంచి చూసినపుడు వైసీపీని ఆయన రాజకీయ ప్రత్యర్ధి గానే చూస్తారు తప్ప శత్రువుగా చూడారు, అయితే వైసీపీ మాత్రం బాబుని ప్రత్యర్ధికి మించి అన్నట్లుగానే వ్యవహరిస్తుంది అని విశ్లేషిస్తారు.

అందరికీ మిత్రుడిగా :

బాబులో గొప్పతనం ఏమిటి అంటే ఆయన ట్రూ పొలిటీషియన్ గా ఉంటారు. రాజకీయాల వరకే ఏ పోటీ అయినా పరిమితం చేస్తారు. ఆ మీదట మామూలుగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తారు. అందువల్లనే ఆయనకు ఎవరూ శత్రువులు అన్న వారు లేరు. దానికి తోడు విజనరీగా పేరు, సుదీర్ఘ రాజకీయ అనుభవం, దేశంలో ఈ రోజుకు చురుగ్గా ఉన్న నాయకుడు కావడం ఇవన్నీ బాబుని ఎక్కడో ఎత్తులో కూర్చోబెట్టాయి. ఎవరైనా బాబు మీద మాట వరసకు విమర్శలు చేయవచ్చేమో కానీ ఆయన వద్దకు వచ్చి కలిసి వెళ్తే మాత్రం విజనరీ అని తప్పకుండా కితాబు ఇవ్వకుండా వెళ్ళేది ఉండదని అంటారు.

అన్ని పార్టీలతోనూ :

బాబుకు అన్ని పార్టీలలోనూ మిత్రులు ఉన్నారు. దేశాన్ని సుదీర్ఘ కాలం ఏలిన కాంగ్రెస్ తోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు ఎవరూ కూడా బాబుని గట్టిగా విమర్శించినది జాతీయంగానూ కూడా కనిపించదు. ఇక పొరుగున ఉన్న తెలంగాణా నుంచి నిన్నటికి నిన్న బాబుని కలసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే బాబు విజనరీ అని పొగిడేశారు. ఆయన వద్ద చాలా నేర్చుకున్నాను అని కూడా చెప్పారు. ఆయన మాత్రమే కాదు ఇతర కాంగ్రెస్ నాయకులు అదే మాట అంటారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే బాబు పట్ల ఎంతో గౌరవ అభిమానాలు చూపిస్తారు. అఫ్ కోర్స్ ఆయన గతంలో టీడీపీలో పనిచేసి ఉండొచ్చు. కానీ ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వారు సైతం బాబుతో మంచి రిలేషన్స్ నే కొనసాగిస్తారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి.

డీకేతోనూ సైతం :

ఇక 2024 ఎన్నికలకు ముందు బాబు కర్ణాటక విమానాశ్రయంలో నుంచి బయటకు వస్తూ అక్కడ ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో కలసి మాట్లాడటం అప్పట్లో వైరల్ అయింది. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఆయన అంటే కాంగ్రెస్ మాత్రమే కాదు, ఇతర ప్రాంతీయ పార్టీలు వామపక్షాలు కూడా అంతే ఆభిమానంతో ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే బాబులో ఉన్న నిజమైన రాజకీయ నాయకుడికి దక్కుతున్న ఆదరణ ఇదంతా అనడానికే. రాజకీయం ఎక్కడ చేయాలో ఎంత వరకూ చేయాలో కూడా బాబుకు తెలుసు. ఆ మీదట ఎలా ఉండాలో కూడా తెలుసు. అంతే కాదు ఆయన పెద్ద చిన్న తారతమ్యం లేకుండా సీనియర్లు జూనియర్లు అన్న భేదం లేకుండా అందరితో బాగా ఉంటారని అంటారు. ఇక తాను సీనియర్ మోస్ట్ లీడర్ ని అన్న అహంకారం ఆయనలో ఎక్కడా కనిపించదు. ఇలాంటి క్వాలిటీస్ నిండుగా ఉండబట్టే బాబు లాంగ్ ఇన్నింగ్స్ ని పొలిటికల్ గా కొనసాగిస్తున్నారు అని చెప్పాలి. బాబుని స్పూర్తిగా ఈ తరం నాయకులు అంతా తీసుకోవాల్సి ఉందని మాత్రం అంతా అంటారు.

Tags:    

Similar News