• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు, పవన్ భేటీ.. బాలయ్య...

బాబు, పవన్ భేటీ.. బాలయ్య వ్యాఖ్యల తరువాత తొలిసారి... ఏం జరిగిందంటే...?

| నిజానికి పవన్ ను పరామర్శించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఉద్దేశమే అయినా ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఈ ఇద్దరి నేతల భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

By - Tupaki Political Desk
Update: 2025-09-28 20:05 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న పవన్ ను హైదరాబాద్ లో ఆయన నివాసంలో చంద్రబాబు కలిశారు. జ్వర తీవ్రతపై అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా అమరావతికి వచ్చిన పవన్ గత వారం తీవ్ర జ్వరంతో తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఇక రెండు రోజుల పాటు తీవ్ర జ్వరంతోనే అసెంబ్లీకి వెళ్లిన పవన్.. ఎంతకూ తగ్గకపోవడంతో విశాంత్రి నిమిత్తం హైదరాబాద్ వచ్చేశారు. ఇక అదివారం కావడంతో చంద్రబాబు సైతం హైదరాబాద్ వచ్చి నేరుగా పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

నిజానికి పవన్ ను పరామర్శించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఉద్దేశమే అయినా ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఈ ఇద్దరి నేతల భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లగా, బయటకు వచ్చి మరీ చంద్రబాబుకు పవన్ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు చాలా సేపు చర్చించుకున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు అకాంక్షించారు. కాగా, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భేటీ మధ్య కేవలం వ్యక్తిగత అంశాలే చర్చకు వచ్చాయా? లేక తాజా రాజకీయ పరిణామాలపై ఏమైనా చర్చ జరిగిందా? అనే చర్చ సాగుతోంది.

గత సోమవారం నుంచి పవన్ జ్వరంతో బాధపడుతుండగా, రెండు రోజులు అమరావతిలోనే పవన్ ఉన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ వచ్చేయగా, ఆ తరువాత అసెంబ్లీలో టీడీపీ ముఖ్యనేత, హిందూపురం ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రబాబు బావ మరిది నందమూరి బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారం రేపాయి. గత ప్రభుత్వంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సభలో ప్రస్తావిస్తూ ఆ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి జోక్యం వల్ల అప్పటి ముఖ్యమంత్రి దిగివచ్చారని చెప్పారు. అయితే దీనిపై బాలయ్య అభ్యంతరం చెబుతూ, అప్పట్లో ఎవడూ గట్టిగా మాట్లాడలేదని తేల్చిచెప్పారు.

గత ప్రభుత్వంలో సినీ రంగం పెద్దగా చిరంజీవి పాత్ర పరిమితం అన్నట్లు బాలయ్య వ్యాఖ్యానించడం ఆయన అభిమానులను ఆవేదనకు గురిచేసింది. అంతేకాకుండా మిత్రపక్షం జనసేనను షాక్ కు గురిచేసింది. ఇక బాలయ్య మాటలను అదునుగా చేసుకుని వైసీపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు చాకచక్యంగా వ్యవహరించి ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరూ ఆ అంశంపై మాట్లాడకుండా కట్టడి చేశారు. అదే సమయంలో జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ సైతం తమ పార్టీ నుంచి ఎవరూ మాట్లాడకుండా అదుపు చేయడంతో బాలయ్య వ్యాఖ్యల తుఫాన్ చప్పున చల్లారిపోయింది. అయితే ఈ విషయంలో పవన్ తో చంద్రబాబు ఏం చెప్పి ఉంటారన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. బాలయ్య వ్యాఖ్యల దుమారం తర్వాత ఇద్దరు నేతలు తొలిసారి భేటీ కావడం అందరి ద్రుష్టిని ఆకర్షించింది.

Tags:    
  • ChandrababuNaidu 
  • PawanKalyan 
  • AndhraPradeshPolitics 
  • DeputyCM 
  • TollywoodPolitics 
  • TDP 
  • Janasena 

Similar News

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS