టీడీపీ విశ్వరూప సందర్శనం... : చంద్రబాబు
ఈ సందర్భంగా ఆరు కీలక అంశాలను ఉద్దేశించి చంద్రబాబు ప్రధానంగా పేర్కొన్నారు.;
టీడీపీ మహానాడు నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''గత 2024 ఎన్నికల్లో టీడీపీ విశ్వరూప సందర్శనం చేసింది.'' అని పేర్కొన్నారు. పరీక్షలను ఎదుర్కొ న్న ప్రతిసారీ.. పార్టీ విజయ పంథాలోనే నడిచిందని.. దీనికి ఉదాహరణే.. గత ఏడాది 2024లో జరిగిన ఎన్నికలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పార్టీకి యువత, యువ కార్యకర్తలే కీలకమని పేర్కొన్నారు. ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడే యువ శక్తి తెలు గు దేశం పార్టీకి ఆస్తి అని పేర్కొన్నారు. ''తెలుగు ఖ్యాతిని జగద్వితం చేయడం టీడీపీ పవిత్ర కర్తవ్యం. తెలుగు వారు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా.. వారు అక్కడ తలమానికంగా నిలవాలని కోరుకుంటు న్నాం`` అని చంద్రబాబు తెలిపారు. తెలుగు జాతి అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా ఆరు కీలక అంశాలను ఉద్దేశించి చంద్రబాబు ప్రధానంగా పేర్కొన్నారు. కూటమి ప్రభు త్వం ఏర్పడిన తర్వాత.. నిర్వహించుకుంటున్న మహానాడు ప్రతి కార్యకర్తకు స్వాగతం పలుకుతోంద న్నారు. ఈ మహాసంరంభ కార్యక్రమాన్ని విజయం వంతం చేసి.. తెలుగు జాతికి ఒక దిశ-దశ కల్పించా లని ఆకాంక్షించారు.
‘యువగళాని`కి ప్రాధాన్యతనివ్వాలని, ‘అన్నదాతకు అండగా’ నిలవాలని కోరుతున్నా. ‘స్త్రీ శక్తి’కి పెద్దపీట వేయాలని, ‘పేదల సేవలో’ నిరంతరం శ్రమించాలని, ‘తెలుగు జాతి విశ్వఖ్యాతి’ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని ఆకాంక్షిస్తున్నా. ‘కార్యకర్తే అధినేత’గా మారాలనే నూతన మార్గదర్శకాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలి. అదే నా ఆశ.. ఆకాంక్ష’’ - అని చంద్రబాబు పేర్కొన్నారు.