బాబు మాట బంగారు బాట‌.. ఫ‌లించేనా.. ?

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

Update: 2026-08-17 00:30 GMT

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. డ‌బ్బు తీసు కోకుండా ఓటు వేయ‌లేమా? అని ప్ర‌శ్నించారు. తాజాగా శ‌నివారం ఆయ‌న మ‌హిళ‌ల‌తో భేటీ అయిన సంద‌ర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. డ‌బ్బులు తీసుకోకుండా ఎన్నిక‌ల్లో ఓటు వేసే ప‌రిస్థితి రావాల‌ని.. దీనికి మ‌హిళ‌లే న‌డుం బిగించాల‌ని కూడా సూచించారు. ఇది ఇప్పుడున్న ప‌రిస్థితి అత్యంత కీల‌క‌మైన సూచ‌న‌గానే చెప్ప‌వ‌చ్చు. కానీ, ఇది సాధ్య‌మేనా? అన్న‌ది ప్ర‌శ్న‌.

2024 ఎన్నిక‌ల్లో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్లు నాయ‌కుల‌పై తిర‌గ‌బ‌డిన సంద‌ర్భాలు బ‌హిరంగంగానే వెలుగు చూశా యి. తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి విశాఖ వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో డ‌బ్బులు పంపిణీ చేసిన వ్య‌వ‌హారం.. త‌మ‌కు త‌క్కువ‌గా ఇచ్చార‌ని.. మ‌రో ప్రాంతంలో ఎక్కువ‌గా ఇచ్చార‌ని.. పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ క్ర‌మంలో నాయ కుల ఇళ్ల‌పై కూడా స్థానికులు విరుచుకుప‌డ్డారు. పైగా.. డ‌బ్బులు ఇవ్వడం అనేది సంప్ర‌దాయంగా మారిపోయిన నియోజ‌క‌వ‌ర్గాలు కూడా క‌నిపిస్తున్నాయి.

ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా నాయ‌కుల‌వైపు కంటే కూడా.. ప్ర‌జ‌ల్లోనే ఈ విష‌యంపై సంస్క‌ర‌ణ‌లు తీసుకు రావాల‌న్న వ్యూహంతో చంద్ర‌బాబు కీల‌క సూచ‌న చేశారు. ముఖ్యంగా ఈ విష‌యంలో మ‌హిళ‌లు క‌నుక ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తే.. ఓటుకు నోటు తీసుకోకుండానే ఎన్నిక‌ల పోలింగ్ బూత్‌లు క‌ళ‌క‌ళ‌లాడ‌తాయ‌ని బాబు భావిస్తున్నారు. అందుకే మ‌హిళ‌ల‌ను సెంట్రిక్‌గా చేసుకుని ఈ విష‌యాన్ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే.. ఇదేమంత చిన్న విష యం కాదు. నాయ‌కుల మ‌ధ్య పోటీ, పార్టీల మ‌ధ్య ఉన్న బ‌ల‌మైన పోరాటం వంటివి ఓట‌ర్ల కంటే కూడా నాయ‌కుల ను ప్ర‌భావితం చేస్తున్నాయి.

దీంతో ఎవ‌రి ఓటును వారు ప‌రిర‌క్షించుకునేందుకు నాయ‌కులకు ఈ విష‌యంలో మ‌రో మార్గం క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఓట‌ర్ల మైండ్ సెట్ మార్చాల‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌. ఆయ‌న చెబుతున్న‌ట్టుగా ఓటుకు నోటు తీసుకోకుండా ఉంటే.. ప్ర‌జ‌ల‌కు కీల‌క‌మైన విష‌యాల్లో సానుకూల‌త వ్య‌క్తం అవుతుంద‌న్న అంచ‌నా ఉంది. 1) అభివృద్ధి ప‌నుల‌పై ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ప్ర‌శ్నించే అవ‌కాశం ఉంటుంది. 2) క్షేత్ర‌స్థాయిలో అవినీతిని అరిక‌ట్టేందు కు కూడా ప్ర‌జ‌ల‌కు ఛాన్స్ ద‌క్క‌నుంది. ఈ రెండు అంశాలు కూడా.. రాష్ట్రానికి మేలు చేసే ప‌రిణామాలే. కానీ, ఆ మేర‌కు ఓట‌ర్ల మైండ్ సెట్ మారితే మంచిదే..!

Tags:    

Similar News