టీడీపీ ఇన్న‌ర్ టాక్‌... ఇదేం ప‌ద్ధ‌తి త‌మ్ముళ్లూ..?

ఇదేం ప‌ద్ధ‌తి..? అంటూ..సాక్షాత్తూ.. పార్టీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్టీ త‌ర‌ఫున సీనియ‌ర్లు, జూనియ‌ర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు కీల‌క శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

Update: 2026-06-04 18:19 GMT

అవును... ఇప్పుడు ఇదే మాట టీడీపీలో వినిపిస్తోంది. ఇదేం ప‌ద్ధ‌తి..? అంటూ..సాక్షాత్తూ.. పార్టీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్టీ త‌ర‌ఫున సీనియ‌ర్లు, జూనియ‌ర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు కీల‌క శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో నిర్వ‌హించ‌నున్న స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ ( స‌ర్ ) ప్ర‌క్రియ‌పై నాయ‌కుల‌కు చంద్ర‌బాబు స్వ‌యంగా శిక్ష‌ణ ఇచ్చారు. అస‌లు ఏం చేయాలి.. ఎలా జ‌రుగుతుంద‌న్న‌దానిపై వివ‌ర‌ణ ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మానికి అంద‌రూ త‌ప్ప‌కుండా హాజరు కావాల‌ని.. గ‌త వార‌మే పార్టీ అధినేత స్వ‌యంగా పిలుపుని చ్చారు. ఇటీవ‌ల జ‌రిగిన మ‌హానాడు వేదిక‌గా కూడా.. నాయ‌కుల‌కు ఆయ‌న ఈ విష‌యాన్ని తేల్చి చెప్పా రు. స‌ర్ ప్ర‌క్రియ‌ను లైట్‌తీసుకోవ‌ద్ద‌ని.. సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని కూడా చెప్పారు. దీనిపై పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని కూడా అన్నారు స్వ‌యంగా తానే అనుభ‌వాల‌ను.. భ‌విష్య‌త్తులో వ్య‌వ‌హ‌రించా ల్సిన తీరును వివ‌రిస్తాన‌న్నారు.

ఒక్క ఓటు కూడా పార్టీకి అత్యంత కీల‌క‌మ‌ని వ్యాఖ్యానించిన చంద్ర‌బాబు .. మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు స‌ర్‌పై ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. కానీ.. స‌గం మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. 135 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా.. నారా లోకేష్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. మిగిలిన 134 మందిలో స‌గం మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఇక‌, ఎంపీల విష‌యానికి వ‌స్తే.. ప‌ట్టుమ‌ని ఆరు గురు మాత్ర‌మే వ‌చ్చారు. ఈ ప‌రిణామంతో చంద్ర‌బాబు ఆగ్ర‌హానికి గుర‌య్యారు.

క్షేత్ర‌స్థాయిలో స‌ర్ ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షించాల్సిన నాయ‌కులే.. ఇలా డుమ్మా కొట్ట‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. రాని వారు వివ‌ర‌ణ ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. బాధ్య‌త లేక‌పోతే ఎలా అని నిల‌దీశారు. ఇక‌, ఈ స‌మావేశానికి, శిక్ష‌ణ‌కు వ‌చ్చిన వారిపై ఉన్న ఫిర్యాదులు.. గ్రాఫ్‌ను కూడా చంద్ర‌బాబు ప్ర‌స్తా వించారు. ఒక్క‌సారి ఎమ్మెల్యేగా మిగిలిపోతారా.. మ‌ళ్లీ మ‌ళ్లీ గెలుస్తారా ? అని ప్ర‌శ్నించిన చంద్ర‌బాబు.. ప‌నితీరును మార్చుకోవాల‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇదే స‌మ‌యంలో ఎమ్మెల్యేల విష‌యంలో ఈ ద‌ఫా బాబు.. రాజీ ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం. ఏదేమైనా.. త‌మ్ముళ్ల వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు ఇంకా అసంతృప్తిలోనే ఉన్నారు.

Tags:    

Similar News