• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎన్నాళ్ళకెన్నాళ్ళకు...

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు టీడీపీ ఆఫీసుకు బాబు....!

| మళ్ళీ ఇన్నేళ్ల తరువాత చంద్రబాబు బుధవారం మంగళగిరి ఆఫీసుకుని వచ్చారు. దాంతో మంగళగిరి ఆఫీస్ వద్ద ఉత్సహాపూరితమైన వాతావరణం ఏర్పడింది.

By - Tupaki Desk
Update: 2023-12-13 16:19 GMT

ఏపీలో మంగళగిరిలో అద్భుతమైన భవనం టీడీపీ పార్టీకి ఉంది. అక్కడ నుంచే కేంద్ర కార్యలయం గా చేసుకుని పార్టీ మొత్తం ఏపీ యాక్టివిటీని నిర్వహిస్తుంది. చంద్రబాబు ఏపీలో విపక్షంలో ఉండగా వారంలో అయిదు రోజులు ఆ ఆఫీసులోనే ఉంటారు. అలాంటి బాబుని సెప్టెంబర్ 10న ఏసీబీ అరెస్ట్ చేసింది. కోర్టు రిమాండ్ విధించింది.

దాంతో బాబు మంగళగిరి ఆఫీసుకు దూరం అయిపోయారు. అలా ఏకంగా మూడు నెలల టైం పట్టేసింది. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత చంద్రబాబు బుధవారం మంగళగిరి ఆఫీసుకుని వచ్చారు. దాంతో మంగళగిరి ఆఫీస్ వద్ద ఉత్సహాపూరితమైన వాతావరణం ఏర్పడింది.

చంద్రబాబు రాకతో అక్కడ అంతా హుషార్ చేశారు. ఇక టీడీపీ కార్యకర్తలు బాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబు వచ్చిన శుభవేళ అని అదే మంచి ముహూర్తంగా భావించి చాలా మంది నేతలు టీడీపీలో చేరారు.

ఇదిలా ఉంటే చంద్రాబబు రానున్న ఎన్నికల కోసం మంగళగిరి ఆఫీసు నుంచే చాణక్య రాజకీయానికి తెర తీయనున్నారు అని అంటున్నారు. ఇక మీదట ప్రతీ రోజూ మంగళగిరి పార్టీ ఆఫీసు కళ కడుతుందని అంటున్నారు. అదే విధంగా పార్టీని జోరెత్తించే కార్యచరణను కూడా బాబు ఇవ్వబోతున్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు ఇక పార్టీని కూడా గేర్ మార్చి పరుగులు తీయిస్తారు అని అంటున్నారు.

రానున్న ఎన్నికలు టీడీపీకి చాలా ముఖ్యం అన్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికలలో కనుక టీడీపీ గెలవకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే బాబు ఇప్పటి నుంచే పదునైన వ్యూహాలకు పని చెబుతున్నారు. మంగళగిరిలో ఎంత మంది నాయకులు ఉన్నా బాబు ఉంటేనే నిండుతనం అని కూడా టీడీపీ నేతలు అంటున్నారు.

మొత్తం మీద చూస్తే తెలుగుదేశం పార్టీకి కొత్త కళ తేవడానికి బాబు మంగళగిరి ఆఫీసులో ఇక ప్రతీ రోజూ కనిపిస్తారు అని అంటున్నారు. మరి 2024 ఎన్నికలలో ఆయన ఏ విధంగా టీడీపీ రధాన్ని నడిపించి విజయపధం చేరుస్తారో చూడాల్సి ఉంది.

Tags:    
  • Andhrapradesh 
  • Politicalnews 
  • Chandrababunaidu 
  • Tdp 
  • Office 
  • Mangalagiri 
  • Arrest 
  • Government 
  • Elections 
  • Leaders 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS