కంటోన్మెంట్ 'సెంటిమెంట్'.. మహిళా నేతల సంగ్రామం!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యకత కనిపిస్తోంది.;
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యకత కనిపిస్తోంది. దాదాపు అన్నినియోజకవ ర్గాల్లోనూ చిత్రమైన ప్రచారాలు, సెంటిమెంట్లు హల్చల్ చేస్తున్నాయి. ఒకటి రెండు నియోజకవర్గాల్లో అయి తే.. పూర్తిగా మహిళలే ఎన్నికల సమరంలో పోటీ పడుతున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి కంటోన్మెంట్. ఈ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీల తరఫున మహిళలే రంగంలోకి దిగడం విశేషం.
కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీ. శాయన్న మరణించడంతో ఆయన కుమార్తెలు ఈ స్థానానికి పోటీ పడడం .. ఈ విషయంపై సీఎం కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని పరిష్కారం చూపించారు. ఈ క్రమంలో శాయ న్న కుమార్తె లాస్య నందిత ఇక్కడ నుంచి బీఆర్ ఎస్ నుంచి బరిలోకి దిగారు. ఇక, కాంగ్రెస్ నుంచి దివంగత గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెల పోటీ చేస్తున్నారు. ఇక, బీజేపీ నుంచి ఇంకా టికెట్ ఖరారు కాలేదు.
ఇదిలావుంటే.. ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన వారిద్దరూ మహిళలే కావడం.. ఇద్దరి కుటుంబాల్లో నూ సెంటిమెంటు ఉండడంతో ఎవరు గెలుపు గుర్రం ఎక్కుతారనేది ఆసక్తిగా మారింది. సిట్టింగ్ ఎమ్మె ల్యే శాయన్న మృతి చెందడంతో ఆయన కుమార్తె బరిలో నిలిచిన నేపథ్యంలో తన తండ్రి మృతి సెంటి మెంటు తన కు లబ్ది చేకూరుస్తుందని భావిస్తున్నారు.
ఇక, గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెల కూడా.. తన తండ్రి మరణంతో వచ్చిన సెంటిమెంటు తనకు ప్రయోజ నం కలిగిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఇక, వీరిద్దరిలో శాయన్న కుమార్తె అధికార పార్టీ కావడం తో సహజంగానే మంచిజోష్‌తో ముందుకు దూసుకుపోతున్నారు. ఇక, గద్దర్ కుమార్తె వెన్నెల రాజకీయా లకు కొత్త కావడంతో కొంత వెనుబడ్డారనే టాక్ వినిపిస్తోంది.