వరల్డ్ రికార్డ్... ఈమె నాలుక ఎంత పొడవో తెలుసా?
ఆ నాలుకతో ఆమె చేస్తున్న పనులకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.;
నాలుకతో ముక్కును అందుకోవడానికే నానా పాట్లు పడుతుంటే.. ఆమె మాత్రం ముఖంలో అందుకోవడం అసాధ్యం అనేవాటికి అందుకుంటుంది. సాధారణ మనుషుల్లా కాకుండా ఆమెకు భారీ నాలుక ఉంది. ఆ నాలుక పొడవుతో ఆమె ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఆ నాలుకతో ఆమె చేస్తున్న పనులకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
అవును... అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన చానెల్ టాపర్ అనే మహిళ తన అసాధారణ నాలుకతో ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆమె నాలుక పొడవు ఏకంగా 9.75 సెంటీ మీటర్లు కావడం గమనార్హం. దీంతో... అత్యంత పొడవైన నాలుక కలిగిన మహిళగా ఆమె లాంగెస్ట్ టంగ్ ఇన్ ది వరల్డ్ గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్ద్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు.
తన ఎనిమిదేళ్ల వయసులో తన తల్లితో హోలోవీన్ ఫోటో సెషన్ లో చానల్ టాపర్ తన ప్రత్యేక లక్షణం గురించి మొదటిసారిగా తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో... తాను తన నాలుకను బయటపెట్టినప్పుడు చాలా మంది భయంతో కేకలు వేస్తుంటే తనకు చాలా ఇష్టమని ఆమె తెలిపారు. ఆమె వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
కాగా... అత్యంత పొడవైన నాలుక ఉన్న పురుషుడిగా అమెరికాకు చెందిన నిక్ స్టోబెర్ల్ రికార్డును కలిగి ఉన్నారు. ఆయన నాలుక పొడవు 10.1 సెంటీ మీటరు. అతడు ఇటీవల ఓ స్పెషల్ టీవీ షో కూడా ఇచ్చారు. ఊహించని స్థాయిలో తన కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శించారు.