కర్నూల్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె...హ్యాపీయేనా ?

వైసీపీలో కీలక నాయకురాలు, మాజీ ఎంపీ బుట్టా రేణుకను కర్నూల్ ఎంపీ అభ్యర్ధిగా వైసీపీ డిక్లేర్ చేసింది అని అంటున్నారు.;

Update: 2025-11-01 15:17 GMT

ఇంకా ఎన్నికలకు మూడున్నరేళ్ళు పైగా వ్యవధి ఉంది. అపుడే ఈ అభ్యర్ధుల ఎంపిక ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం చాలా ముందుగానే కొన్ని కీలక స్థానాలలో అభ్యర్ధులను రెడీ చేసుకుంటోంది. అలా కర్నూల్ ఎంపీ సీటుకు అభ్యర్ధి ఎంపిక చేసింది. అదే సమయంలో ఒక కీలక అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీలో వర్గ పోరుకు బ్రేకులు వేసింది. అయితే వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకూ పార్టీలో ఎంతవరకూ ప్రశాంతతను తెస్తాయన్నది కూడా చర్చగా ఉంది.

బుట్టా అక్కడికి షిఫ్ట్ :

వైసీపీలో కీలక నాయకురాలు, మాజీ ఎంపీ బుట్టా రేణుకను కర్నూల్ ఎంపీ అభ్యర్ధిగా వైసీపీ డిక్లేర్ చేసింది అని అంటున్నారు. ఆమెని పార్లమెంటరీ పార్టీ ఇంచార్జిగా నియమించడం ద్వారా ఆమోదముద్ర వేసింది అని చెబుతున్నారు. బుట్టా రేణుక 2014లో కర్నూల్ నుంచి ఎంపీగా తొలిసారి గెలిచారు. 2018 టైం లో ఆమె వైసీపీని వీడారు. తిరిగి 2019 ఎన్నికల ముందు పార్టీలో చేరినా ఆమెకు టికెట్ ఇవ్వలేదు. 2024లో ఆమెను ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఆమె ఓటమి పాలు అయ్యారు. అయితే ఆమె నిన్నటిదాకా ఎమ్మిగనూరు ఇంచార్జిగా పనిచేస్తూ వచ్చారు.

పీక్స్ లో వర్గ పోరు :

ఇక ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో గెలిచిన మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి వర్గం ఒక వైపు మరో వైపు బుట్టా రేణుక వర్గం ఉంటూ పార్టీని రెండుగా విభజించారు అన్న చర్చ అయితే సాగింది. దాంతో పార్టీ రోడ్డున పడింది అన్న నివేదికలూ వెళ్ళాయి. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా రెండుగా చీలి నాయకులు నిర్వహించడంతో వైసీపీ బలంగా ఉన్నా కూడా వీక్ గా మారే సీన్ ఎదురైంది. దీంతో బుట్టా రేణుకను పార్లమెంట్ కి పంపించి చెన్న కేశవరెడ్డి వర్గానికి భారీ ఊరటని కలిగించే నిర్ణయాన్ని పార్టీ తీసుకుంది అని అంటున్నారు చెన్నకేశవ రెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికే ఎమ్మిగనూరు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో వ్యవహారం సెట్ అయింది అని వైసీపీ హైకమాండ్ భావిస్తోందిట.

ఆమె హ్యాపీయేనా :

ఇక బుట్టా రేణుక విషయానికి వస్తే ఆమె ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలన్ అనుకుంటున్నారు అన్నది ప్రచారంలో ఉంది. పైగా ఆమె రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగాలని భావిస్తున్నారు అని అంటున్నారు అయితే ఆమెకు కర్నూల్ ఎంపీ సీటు ఇవ్వడం వల్ల హ్యాపీగా ఉన్నారా అన్నదే ఇపుడు సందేహంగా ఉంది మరో వైపు చూస్తే ఈ సీటు నుంచి 2024లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయిన బీవై రామయ్యకు ఎక్కడ అవకాశమిస్తారు అన్నది కూడా చర్చగా ఉంది అని అంటున్నారు. మొత్తానికి వైసీపీకి ఎంతో పట్టు ఉన్న కర్నూల్ జిల్లాలో రాజకీయం ఈ విధంగా వర్గ పోరుకు గురి కావడం పట్ల పార్టీలో అయితే ఒకింత కలవరం రేగుతోంది. ఉన్నంతలో సర్దుబాట్లు చేస్తూ పేచీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నా ఏ వైపు నుంచి ఏ విధమైన ఇబ్బందులు ఎదురవుతాయో అన్నది అయితే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News