వయస్సు తగ్గించుకోవడానికి కోట్లు ఖర్చు చేస్తున్న 47 ఏళ్ల బిలియనీర్: కొత్త వైద్య ప్రయోగాలు ఆశ్చర్యపరుస్తున్నాయి!

చాలామంది యవ్వనంగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారు.ఏజ్ పెరిగినా కూడా అందం అలాగే ఉండాలని అనుకుంటూ ఉంటారు.;

Update: 2025-08-08 08:30 GMT

చాలామంది యవ్వనంగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారు.ఏజ్ పెరిగినా కూడా అందం అలాగే ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఉండడం అందరికీ సాధ్యం కాదు. అయితే కొంతమంది ఎంత ఏజ్ వచ్చినా కూడా యంగ్ గానే కనిపిస్తారు. కానీ ఇక్కడ ఒక బిలియనీర్ మాత్రం యవ్వనంగా కనిపించడానికి చేస్తున్న ప్రయోగాలు.. వాటి ద్వారా వెలువడుతున్న ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. 47 ఏళ్ల బిలియనీర్ అయిన బ్రయాన్ జాన్సన్ మాత్రం వృద్ధాప్యాన్ని తగ్గించుకోవడం కోసం గత కొద్ది సంవత్సరాల నుండి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వృద్ధాప్యాన్ని తగ్గించే తన ప్రయోగంలో ఒక షాకింగ్ అనుభవాన్ని ఎదుర్కొన్నట్టు తాజాగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. మరి ఇంతకీ బ్రయాన్ జాన్సన్ ప్రయోగంలో ఏం తేలింది? అతను ఎదుర్కొన్న పరిస్థితి ఏంటి? వైద్యరంగంలో ఇది ఎలాంటి మార్పు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వృద్ధాప్యాన్ని తగ్గించడం కోసం 47 ఏళ్ల బ్రయాన్ జాన్సన్ అనే వ్యక్తి చాలా సంవత్సరాల నుండి ప్రయోగాలు చేస్తున్నాడు. ఆయన ఈ ఏజ్ తగ్గించుకునే ప్రయోగాల కోసం.. ఏడాదికి ఏకంగా దాదాపు రెండు మిలియన్లని ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. మల్టీమిలీనియర్ అయినటువంటి బ్రయాన్ జాన్సన్ కి ఈ ఖర్చు తక్కువ మొత్తమే అయినప్పటికీ ఈయన యాంటీ ఏజింగ్ పై చేసే ప్రయోగాలపై చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే అలాంటి బ్రయాన్ జాన్సన్ తాజాగా మరో ప్రయోగం చేశారు. అదే మిథిలిన్ బ్లూ..

ఇక అసలు విషయం ఏమిటంటే.. తాజాగా బ్రయాన్ జాన్సన్ తన ట్విట్టర్ ఖాతాలో "నా మూత్రం ఇప్పుడు నీలం రంగులోకి మారింది. ఈరోజే నేను మిథిలిన్ బ్లూ ను ప్రారంభించాను" అంటూ రాసుకొచ్చారు. అయితే వైద్యంలో చాలా రోజుల నుండి ఉపయోగించే సింథటిక్ డై ఇది. ఈ రసాయనాన్ని FDA కూడా ఆమోదించింది. దీన్ని మెథెమోగ్లోబినిమియాకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ రసాయనం వృద్ధాప్య ఛాయాల్ని తగ్గించడంలో ప్రయోజనం అందిస్తుందని బ్రయాన్ జాన్సన్ నమ్ముతున్నాడు. అయితే మిథిలీన్ బ్లూ అనేది బ్రయాన్ జాన్సన్ వృద్ధాప్యాన్ని తగ్గించడానికి చేసే ప్రయోగంలో ఒక భాగం మాత్రమే.కానీ ఆయన ప్రతిరోజు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. ముఖ్యంగా వృద్ధాప్యాన్ని తగ్గించుకోవడం కోసం ఆయన కఠినమైన శాఖాహారాన్ని,కేలరీలు తక్కువగా ఉండే ఫుడ్ ని తీసుకుంటున్నారు. అలాగే రెడ్ లైట్ థెరిపీ, ఆక్సిజన్ చికిత్సలు కూడా చేయించుకుంటున్నారు. అంతేకాకుండా టీనేజ్ లో ఉన్న తన కొడుకు ప్లాస్మాని కూడా ఇంజెక్ట్ చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రతిరోజు కఠిన వ్యాయామాలు చేయడం వంటివి ఆయన రోజువారి నియమావళిలో ఉంటాయి.

ఇక తాజాగా మిథిలిన్ బ్లూ అనే సరికొత్త ప్రయోగం చేసి తన మూత్రం నీలి రంగులోకి మారింది అంటూ తెలియజేశాడు. ఇక బ్రయాన్ జాన్సన్ గత కొద్దిరోజుల నుండి తన యాంటీ ఏజింగ్ స్టార్టప్ ను అమ్మడానికి లేదా మూసివేయాలనే ఆలోచనలో ఉన్నారు.ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయన బయటపెట్టారు.అయితే దానికి కారణం ఆయన ఏం చెప్పారంటే..నాకు ప్రస్తుతం డబ్బు అవసరం లేదు. ఇది ఒక సమస్యాత్మక సంస్థ.. అందుకే దీన్ని అమ్మాలని లేదా మూసివేయాలని చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News