కేసీఆర్ ప‌ని అయిపోయిందా?

ఇదేమీ చిత్రంకాదు.. గిట్ట‌ని వారు అంటున్న మాటా కాదు.

Update: 2024-05-04 07:20 GMT

ఇదేమీ చిత్రంకాదు.. గిట్ట‌ని వారు అంటున్న మాటా కాదు. సాక్షాత్తూ తెలంగాణ స‌మాజంలోనే జ‌రుగుతు న్న చ‌ర్చ‌. కేసీఆర్ చేత‌-కేసీఆర్ వ‌ల‌న‌-కేసీఆర్ కోసం అన్న‌ట్టుగా ఏర్ప‌డిన బీఆర్ ఎస్‌(గ‌తంలో టీఆర్ ఎస్‌) ఇప్పుడు ఆ త‌ర‌హా ప్రాభ‌వం కోల్పోతోంది. గ‌త డిసెంబ‌రులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం ఎదురు కావ‌డం.. త‌ద్వారా.. ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డిన అసంతృప్తి.. వంటివి కేసీఆర్‌కు సెగ పెడుతున్నాయ‌న‌డంలో సందేహం లేదు. నిజానికి ఏ పార్టీకైనా.. ఓట‌మి, గెలుపు అనేవి స‌హ‌జం.

వ్య‌వ‌స్థ‌పై ఏర్ప‌డిన పార్టీల‌కు.. ఈ సూత్రం వ‌ర్తిస్తుంది. కానీ, వ్య‌వ‌స్థ‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని పుట్టిన పార్టీల‌కు.. ఈ సూత్రం నుంచి మిన‌హాయింపు ఉంటుంది. ఏ వ్య‌వ‌స్థ‌ను ఆధారంగా అనుకూలంగా మార్చుకుని పార్టీల‌ను ఏర్పాటు చేసుకున్నారో.. ఆ వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల కించ‌పరిచేలా.. ధిక్కార ధోర‌ణిని ప్ర‌ద ర్శించేలా వ్య‌వ‌హ‌రించిన పార్టీలు.. చ‌రిత్రలో క‌లిసి పోయాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి కేసీఆర్ పార్టీ కూడా చేర‌నుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

Read more!

వాస్త‌వానికి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎదురైన చేదు అనుభ‌వాల‌ను దృష్టి పెట్టుకుని ఈ మూడు, నాలుగు మాసా ల్లో పార్టీని డెవ‌లప్ చేసుకోవాల్సిన బీఆర్ ఎస్ వ‌ర్గాలు అలా చేయ‌లేదు. అంతేకాదు.. ఎన్నిక‌ల త‌దుప‌రి.. నాయ‌కులు వెళ్లిపోతున్నా.. నిర్లిప్తంగా వ్య‌వ‌హ‌రించిన తీరు.. పార్టీని పుట్టిముంచే స్థాయికి చేర్చింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఒక్కటంటే ఒక్క సీటులోనూ.. గెలిచే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌న్న అన్ని స‌ర్వేల వెనుక‌.. ఎవ‌రో ఉండి ఆడిస్తున్నార‌ని.. ఆడిపోసుకుంటే ప్ర‌యోజ‌నం లేదు. వాస్త‌వాల‌ను విస్మ‌రించి.. తామే స‌ర్వ‌స్వ‌మ‌నుకున్న రీతిలో విధానాల‌ను పట్టుకుని పాకులాడిన నేప‌థ్యమే ఇప్పుడు నేల చూపులు చూసేలా చేసింది.

నిజానికి వైఎస్ వంటి బ‌ల‌మైన నాయ‌కుడు ఉన్న‌ప్పుడు.. కూడా కేసీఆర్ బ‌లంగా పోరాడారు. ఓట‌మి ఎరుగ‌ని నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. `తెలంగాణ ఇస్త‌రా? చస్త‌రా?` అంటూ.. ప‌దే ప‌దే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన సంద‌ర్భంలోనూ ప్ర‌జ‌లు అక్కున చేర్చుకున్నారు. ప‌దేళ్ల అధికారం ముట్ట‌జెప్పారు. కానీ.. ఎప్పుడైతే.. వ్య‌వ‌స్థ‌ను వాడుకుని.. వ్య‌వ‌స్థ‌ను అనుకూలంగా మార్చుకుని ఎదిగారో.. దానిని కించ ప‌రిచిన నాడు.. ``జ‌నాల‌దేముంది.. అంతా మ‌నం చెప్పిన‌ట్టే జ‌రుగుతుంది.. మ‌న‌కు ఎదురేలేదు``.. అని నిర్ణ‌యం తీసుకున్న‌నాడే.. వ్య‌తిరేక‌త ప్రారంభ‌మైంది.

4

ఇది ఒక ప‌థ‌కంపై వ్య‌తిరేక‌త కాదు. ఒక పాల‌న‌పై వ్య‌తిరేక‌త కాదు. ఒక వ్య‌క్తిపై వ్య‌తిరేక‌త.. వ్య‌వ‌స్థ‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని.. త‌మ‌పై పెత్త‌నం చేశార‌న్న వ్య‌తిరేక‌త‌! ఇదే ఇప్పుడు కేసీఆర్‌ను చుట్టు ముట్టింది. అహంకార ధోర‌ణ‌లు.. అతి చేసిన నిర్ణ‌యాలు.. కుటుంబ పాల‌న‌లు వంటివి కేసీఆర్‌కు రాజ‌కీయ ఉచ్చును బిగించాయి. ఫలితంగా.. `మూడోసారి ముచ్చ‌ట‌` మురిగిపోగా ఇప్పుడు పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ వ్య‌తిరేక ఫ‌లిత‌మే వ‌స్తుంద‌న్న.. తెలంగాణ స‌మాజం ఇస్తుంద‌న్న.. వార్త‌లు కేసీఆర్ ఉనికినే ప్ర‌శ్నార్థ‌కం చేస్తున్నాయి.

ఇదే జ‌రిగితే.. ఒక్క సీటు కూడా రాకుంటే.. కేసీఆర్ ఒక ప్ర‌శ్న‌గా చ‌రిత్ర‌లో పాఠంగా మాత్ర‌మే మిగిలిపోతా రు. అంతేకాదు.. ప్రాంతీయ‌పార్టీల ప్ర‌స్థానాల‌ను గ‌మ‌నిస్తే.. త‌ల‌బిరుసు రాజ‌కీయాలు చేసిన వారు.. త‌ల‌కు మించిన వ్య‌వ‌హారాలు న‌డిపించిన వారు.. బ‌తికి బ‌ట్ట‌క‌ట్టిన‌ట్టు లేర‌న్న ఉదాహ‌ర‌ణల జాబితాలో ఆయ‌న కూడా చేరిపోతారు.

త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం ఏంటి? :

ఏ తెలంగాణ స‌మాజాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారో.. అదే స‌మాజాన్ని మ‌చ్చిక చేసుకునేలా.. వంద కాదు.. వెయ్యి మెట్లు దిగాల్సి ఉంది. ఏ అహంకారంతో కుటుంబ పాల‌న సాగించార‌న్న పేరు తెచ్చుకున్నారో.. దానిని స‌మూలంగా తుడిచి పెట్టేందుకు త‌క్ష‌ణం చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంది. `మీరున్న‌ది మీకోసం.. మీరంతా నాకోసం!` అన్న మాట కాదు.. `నేను.. మీరు ఒక్క‌టే` అనే విష‌యాన్ని జ‌నంలోకి తీసుకువెళ్లాలి. లేకుపోతే.. ``ఒక‌ప్పుడు బీఆర్ ఎస్ అని ఒక పార్టీ ఉండేదట‌. కేసీఆర్ దానిని న‌డిపించారట‌. `` అని పిల్ల‌లు చ‌దువుకునే ప‌రిస్థితి రావ‌డం ఎంతో దూరంలో లేదు!!

Tags:    

Similar News