శత్రువులు నశించిపోవాలి... బ్రదర్ అనిల్ శాపాలు !

తాజాగా బ్రదర్ అనిల్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. అమలాపురం మండలం ఇందుపల్లిలో తాజాగా నిర్వహించిన పాస్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-03-10 08:20 GMT

బ్రదర్ అనిల్ వైఎస్సార్ అల్లుడు. అంతర్జాతీయ సువార్తికుడు. షర్మిల భర్త. ఈ విధంగా ఆయన ఎక్కువగా జనాలకు తెలుసు. ఆయన ఇపుడు ఏపీలో మత ప్రచారం చేస్తూ అందులో కూడా ఇండైరెక్ట్ గా రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు. అవి ఎవరిని ఉద్దేశించి అన్నది రాజకీయ అవగాహన ఉన్న వారికి తెలిసిందే.

తాజాగా బ్రదర్ అనిల్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. అమలాపురం మండలం ఇందుపల్లిలో తాజాగా నిర్వహించిన పాస్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దైవ బోధనల మధ్యన చేసిన ఈ కామెంట్స్ వర్తమన రాజకీయాల మీద కూడా సాగాయి.

ఆంధ్ర రాష్ట్రం అంతకంతకూ అప్పుల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు పుట్టబోయే బిడ్డలపైనా అప్పుల భారం పడే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్థాలు తీసుకొస్తున్నారని బ్రదర్ అనిల్ దుయ్యబట్టారు.

అంతే కాదు శత్రువులందరూ నశించిపోవాలని అతి పెద్ద శాపం ఆయన పెట్టేసారు. అంతేనా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అనిల్ పేర్కొనడం విశేషం.

Read more!

వైఎస్ బిడ్డే కదా అని జగన్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రంలో క్రైస్తవులు సువార్త సభలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని బ్రదర్ అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఆయన మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటి అంటే వైఎస్సార్ చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రంలో క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని తనదైన శైలిలో విశ్లేషించారు. అంటే జగన్ పాలనల్లోనే క్రైస్తవులు నానా బాధలు పడుతున్నారు అని బ్రదర్ అని చెప్పదలచారు అన్న మాట.

మొత్తానికి బ్రదర్ అనిల్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి వస్తున్న విమర్శలు అన్నీ కూడా జగన్ కి వ్యతిరేకంగానే ఉన్నాయని అంటున్నారు. శత్రువులు నశించాలని ఆయన పెట్టిన శాపాలు కూడా రాజకీయంగా చర్చకు తావిస్తున్నాయి. అయితే సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరి జగన్ ని ఓడించాలని చూస్తున్నారు. దాంతో ఆమె భర్తగా ఉనన్ బ్రదర్ అనిల్ వేరేగా మాట్లాడుతారు అని ఎవరూ అనుకోవడం లేదు అంటున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో పెద్ద సంఖ్యలో ఉన్న క్రైస్తవుల ఓట్లు వైసీపీకి దక్కుతాయని అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది. ఒక వైపు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల కూడా వైసీపీకి ఈ వర్గాల ఓట్లు టర్న్ అవుతాయని విశ్లేషణలు ఉన్నాయి. ఇపుడు బ్రదర్ అనిల్ వచ్చి చంద్రబాబు పాలనలోనే క్రైస్తవులకు మేలు జరుగుతోందని చెప్పడం వల్ల రాజకీయంగా వైసీపీని జరిగే నష్టం ఎంత టీడీపీకి కలిగే లాభం ఎంత అన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News