ఫోటో ఆఫ్ ది డే... రిషి సునాక్ నీల్ డౌన్!

అత్యంత కీలకమైన జీ-20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే.

Update: 2023-09-10 12:05 GMT

అత్యంత కీలకమైన జీ-20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో విమానం దిగిన అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తనను ఇండియా అల్లుడని అంటారని తెలిపారు. ఆయన తన సతీమణి తో ఇండియాకు వచ్చారు.

ఇదే సమయంలో తాను హిందువుని అని, హిందువని చెప్పుకోవడానికి గర్వపడుతుంటానని చెప్పిన ఆయన... ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షర్‌ ధాం ఆలయాన్ని సందర్శించారు. తన సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఈ ప్రత్యేక ఆలయాన్ని సందర్శించిన ఆయన... అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు గంటన్నర పాటు.. ఆలయంలో గడిపారు.

ఇదే సమయంలో తాజాగా ఆయనకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్ కు వచ్చిన యునైటెడ్ కింగ్ డం (యూకే) ప్రధాని రిషి సునాక్... బంగ్లాదేశ్ ప్రధాని హసీనాతో ప్రవర్తించిన తీరుకు సంబంధించిన ఒక ఫోటోపై నెట్టింట చర్చ జరుగుతుంది.

అవును... జీ20 సదస్సులో భాగంగా ఇండియాకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని హసీనాతో రిషి సునాక్ అత్యంత మర్యాదగా ప్రవర్తించారని అంటున్నారు. ప్రధాని హోదాలో ఉన్ననని మరిచారో.. ప్రధాని అయినా తాను ఒక సాధారణ హ్యూమన్ బీయింగ్ మనస్థత్వమే కలిగి ఉన్నట్లు భావించారో తెలియదు కానీ... తనకంటే వయసులో పెద్దవారైన హసీనాతో ఆప్యాయంగా మాట్లాడేందుకు రిషి నీల్ డౌన్ అయ్యారు.

దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోను... "ఫోటో ఆఫ్ ది డే" అని నెటిజన్ల్ షేర్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన క్రమశిక్షణ, పెద్దవారిపట్ల చూపించే గౌరవం అభినందనీయం అంటూ ఆ ఫోటో కింద కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News