గాల్లో విమానం.. నేలపై రెక్క విడిభాగం.. విమానయానం భయం!
మంగళవారం రాత్రి హార్ట్స్‌ఫీల్డ్- జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన డెల్టా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ నెంబర్ 3247;
అమెరికాలో ఒక ఆశ్చర్యకరమైన ప్రమాదం తప్పిన ఘటన కలకలం రేపుతోంది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-900 మోడల్ విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో దాని రెక్కలోని ఓ కీలకమైన భాగం ఊడిపోవడం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండానే విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఏం జరిగింది..?
మంగళవారం రాత్రి హార్ట్స్‌ఫీల్డ్- జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన డెల్టా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ నెంబర్ 3247, నార్త్ కరోలినాలోని రెలీ-డర్హం ఎయిర్‌పోర్ట్ వైపు ప్రయాణిస్తోంది. విమానంలో 109 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణం మొత్తం సాఫీగా సాగినప్పటికీ, ల్యాండింగ్ సమయంలో ఒక ఘోరమైన లోపం వెలుగులోకి వచ్చింది. విమానం ఎడమ రెక్క వెనుక భాగంలో ఉండే "ఫ్లాప్" అనే నియంత్రణ భాగం ల్యాండింగ్ సమయంలో ఊడిపోయి, కింద రోడ్డు మీద పడిపోయింది. దీన్ని మొదట గుర్తించనప్పటికీ, ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీ చేసిన తర్వాత ఈ విషయం అధికారులకు తెలిసింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దీనిని ధృవీకరించింది. ఘటనపై దర్యాప్తు కూడా ప్రారంభమైంది.
భద్రతపై మరోసారి నిదానం అవసరమే!
ఫ్లాప్స్ అనేవి విమాన రెక్కల వెనుక భాగంలో ఉంటూ, విమానం ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో లిఫ్ట్ , డ్రాగ్ నియంత్రణకు ఉపయోగపడతాయి. పైలట్ వీటిని నియంత్రిస్తాడు. ఇలా కీలకమైన భాగం ఊడిపోవడం, అదీ గాల్లో ప్రయాణ సమయంలో జరగడం, భద్రతా వ్యవస్థలపైననే అనుమానాలు రేపుతోంది.
విమానం ల్యాండ్ అయిన ప్రదేశం ఏంటంటే...
ఇదే సమయంలో ఓ ఆసక్తికర విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం అంటే రెలీ మోటార్‌వే సమీపంలో, బోయింగ్‌పై ఇప్పటికే కోర్టులో కేసులు వేస్తున్న సంస్థకు చెందిన న్యాయవాదికి చెందిన బీచ్‌హౌస్ సమీపం కావడం గమనార్హం. ఇది కొసమెరుపు అనే చెప్పాలి!
డెల్టా, ఎఫ్.ఏఏ స్పందనలు
డెల్టా ఎయిర్‌లైన్స్ తన అధికారిక ప్రకటనలో దీనిపై స్పందించింది. "విమానంలో జరిగిన ఘటనపై FAAకి సమాచారమిచ్చాం. దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం," అని పేర్కొంది. FAA కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది.
ఇటీవలి కాలంలో బోయింగ్ సంస్థ విమానాల్లో వరుసగా భద్రతా లోపాలు బయటపడుతున్నాయి. ఈ తాజా ఘటన ఆ లోపాలను మరోసారి హైలైట్ చేస్తోంది. ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరిపీల్చే విషయం అయినా, ఎయిర్‌లైన్స్, విమాన తయారీ సంస్థలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రయాణికుల ప్రాణాలు భద్రతకు మించి ఏమీ కాదు!