నితీష్.... చంద్రబాబు... బీజేపీ ప్లాన్ అదేనా ?

అయితే ఈ ఇద్దరు ప్రాణ మిత్రుల విషయంలో బీజేపీ ఆలోచనలు ఎలా ఉన్నాయన్నదే చర్చగా ఉంది.;

Update: 2025-07-24 07:45 GMT

బీజేపీకి ప్రాణ మిత్రులు వారు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోంది అంటే కేంద్రంలో ముచ్చటగా మూడవసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, బీహార్ నుంచి జేడీయూ అధినేత నితీస్ కుమార్ అతి ముఖ్య కారణలు. వారి ఎంపీల మద్దతే ఎన్ డీయేకు ప్రాణ వాయువుగా నిలుస్తోంది. అందుకే వారు బీజేపీకి ప్రాణ మిత్రులు కిందనే లెక్క.

అయితే ఈ ఇద్దరు ప్రాణ మిత్రుల విషయంలో బీజేపీ ఆలోచనలు ఎలా ఉన్నాయన్నదే చర్చగా ఉంది. ప్రస్తుతం ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవికి బీహార్ సీఎం నితీష్ కుమార్ కి ఇవ్వాలని కాషాయం పార్టీ ఆలోచలను చేస్తోంది అని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం మేరకే చూసుకున్నా బీజేపీ ఈ ప్రతిపాదన చేస్తోంది అంటే వెనక వ్యూహాలను రాజకీయ వర్గాలకు తెలియనివి కావు. జేడీయూని తగ్గించి వీలైతే తమలో కలుపుకుని బీహార్ ని సోలోగా ఏలాలన్నదే బీజేపీ పెద్దల ఆశ అని అంటున్నారు.

నిజానికి నితీష్ కుమార్ విషయం చూస్తే నిన్నటి వరకూ ఏ బాదరా బంధీ లేని రాజకీయ నాయకుడు. వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయనకు ఒక్కడే కొడుకు నిశాంత్ కుమార్. అయితే నితీష్ ఊరుకున్నా జేడీయూ క్యాడర్ ఊరుకోవడం లేదు. అందుకే నిశాంత్ కుమార్ ని రంగాంలోకి దింపింది. ఆయనను నితీష్ కుమార్ తరువాత నాయకత్వం బాధ్యతలు తీసుకునేలా పావులు కదుపుతోంది.

అంటే జేడీయూ నితీష్ కుమార్ తో ఆగిపోవడం లేదు. సరిగ్గా ఇక్కడే బీజేపీ ఇబ్బంది పడుతోంది. అందుకే నితీష్ ని ఉప రాష్ట్రపతిగా చేసి తాము బీహార్ పీఠం మీద కూర్చోవాలని చూస్తోంది. కానీ జేడీయూ నుంచి అంతగా సానుకూలత వ్యక్తం కావడంలేదు అని అంటున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు విషయానికి వస్తే ఆయనకు కూడా ఢిల్లీ స్థాయిలో ఏదైనా రాజ్యాం బద్ధమైన పదవికి ఇవ్వడమో ఏదో చేసి ఏపీలో కూడా విస్తరించాలన్న వ్యూహాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతవరకూ ఎందుకు ఉప రాష్ట్రపతి పదవి విషయంలోనే నితీష్ తో పాటు చంద్రబాబు పేరు కూడా ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది.

నిజానికి తన రోజు వారీ జీవితంలో 18 గంటలకు పైగా రాజకీయాలకే కేటాయించే చంద్రబాబు రాజ్యాంగ బద్ధ పదవిలో కుదురుకోరు అని అంటారు. పైగా ఆయన ఏపీలో మరిన్ని ఏళ్ళ పాటు సీఎం గా ఉండాలని క్యాడర్ కోరుకుంటోంది. బాబుకు లోకేష్ అందుకు వచ్చిన వారసుడిగా ఉన్నారు. దాంతో పాటు వ్యూహరచనలో బాబు దిట్ట. ఆయన వద్దకు ఇలాంటి ప్రతిపాదనలు ఏవి వచ్చినా సున్నితంగానే పక్కన పెడతారు అని అంటున్నారు.

అయితే ఏపీ బీహార్ ఇలా రెండు కీలక రాష్ట్రాలు ఇద్దరి కీలక మిత్రుల విషయంలో మాత్రం బీజేపీ తనదైన వ్యూహాలతోనే ముందుకు సాగుతుంది అని అంటున్నారు. దానికి ఉప రాష్ట్రపతి పదవి అందులో పరిశీలిస్తున్న పేర్లను చూస్తే అర్ధం అవుతోంది అని అంటున్నారు. బాబు వయసు ఏడున్నర పదులు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఎనభై ఏళ్ళకు చేరువ అవుతారు. దాంతో బాబు రాజకీయాల నుంచి తప్పుకుంటే తాము ముందుకు రావలన్నది ఆలోచన కూడా కావచ్చు.

కానీ నితీష్ చంద్రబాబుల విషయంలో బీజేపీ వ్యూహాలు ఎంతమేరకు నెరవేరుతాయన్నది ఎవరూ చెప్పలేరు. దాంతో బీజేపీ పొత్తులు ఎత్తులు మిత్రులు ఇలా వీటి విషయంలో కూడా చర్చ లోతుగానే సాగుతోంది రాజకీయాల్లో అల్టిమేట్ అధికారమే. బీజేపీ దానికి మినహాయింపు కాదు. మరి ఏపీలో బీహార్ లో కమల వికాసం జరగాలంటే ఏమి చేయాలన్నది అందరి కంటే ఆర్ ఎస్ ఎస్ బీజేపీలకే ఎక్కువగా తెలుసు అని అంటారంతా. బీజేపీతో చెలిమిలో ఉన్న బాబు నితీష్ లు సైతం రాజకీయంగా ఉద్ధండులే కాబట్టి ఈ ఎన్డీయే మిత్రుల రాజకీయాలు వ్యూహాలు భవిష్యత్తులో కూడా ఆసక్తికరంగానే ఉంటాయని చెప్పకతప్పదు.

Tags:    

Similar News