రాహుల్ కి హ్యాండ్...మోడీతో షేక్ హ్యాండ్

ఢిల్లీలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రే నేత హోదాలో నిర్వహిస్తున్న సమావేశానికి శశిధరూర్ హాజరు కాలేదు, అదే సమయంలో కేరళలో నరేంద్ర మోడీ పర్యటనలో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చారు.;

Update: 2026-01-24 03:55 GMT

కేరళలో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోంది. దానికి తగిన ప్రయత్నాలు ఆ పార్టీ చేసుకుని పోతోంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే కేరళ పర్యటనలో తాము అధికారంలోకి వస్తున్నామాని ధీమాగానే ప్రకటించారు. కేరళలో బీజేపీ ఇంకా థర్డ్ ఫోర్స్ గానే ఉంది. అయితే ఇతర పార్టీలలోని కీలక నేతలను ఆకట్టుకోవడం ద్వారా ఆపరేషన్ కేరళని జయప్రదంగా చేయాలన్నది బీజేపీ వ్యూహాంగా కనిపిస్తోంది.

కాంగ్రెస్ నుంచేనా :

అయితే బీజేపీ చూపు కాంగ్రెస్ మీదనే పడుతోంది. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న వర్గ పోరు లుకలుకలతో తాము మెల్లగా ఆ ప్లేస్ లోకి రావచ్చు అన్నది బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. లెఫ్ట్ పార్టీలలో అయితే అవి ఫిలాసఫీ పరంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాయి. దాంతో కాంగ్రెస్ ని ఎంత తగ్గిస్తే తాము అంతగా ఎదగవచ్చు అన్నది బీజేపీ స్ట్రాటజీ గా ఉంది. ఈ నేపధ్యంలోనే బీజేపీకి ఆశా కిరణంగా కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి శశి ధరూర్ కనిపిస్తున్నారు అని అంటున్నారు.

ఆయన వైఖరితో :

ఢిల్లీలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రే నేత హోదాలో నిర్వహిస్తున్న సమావేశానికి శశిధరూర్ హాజరు కాలేదు, అదే సమయంలో కేరళలో నరేంద్ర మోడీ పర్యటనలో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చారు. తిరువనంతపురం శశిధరూర్ సొంత నియోజకవర్గం. అక్కడే మోడీ పర్యటన ఉంది. దాంతో ఆయన స్థానిక ఎంపీగా ప్రోటోకాల్ అంటూ ఉండిపోయారని చెబుతున్నా విషయం చూస్తే అది కాదు అంతకు మించి అని అంటున్నారు. బీజేపీతో అనుబంధం పెంచుకోవడానికి కాంగ్రెస్ తో తుంచుకోవడానికే ఈ సీనియర్ నేత ఆలోచిస్తున్నారా అన్నది కూడా హాట్ డిస్కషన్ గా ఉంది.

మోడీని పొగుడుతూ :

గత కొంతకాలంగా చూస్తే కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని శశిధరూర్ పొగుడుతూ వస్తున్నారు. అద్భుతంగా పనిచేస్తోంది అని కూడా అంటున్నారు. దాంతో ఆయన బీజేపీకి మెల్లగా చేరువ అవుతున్నారు అని అనుమానించే కాంగ్రెస్ కూడా ఆయనను దూరం పెడుతోంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఆ మధ్యన ఇతర దేశాలకు వెళ్ళి పాకిస్థాన్ భారత్ మీద చేస్తునన్ ఉగ్ర ప్రోత్సాహిత చర్యలను వారికి వివరించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీలలో ఒకదానికి నేతృత్వం వహించే అవకాశం కేంద్ర ప్రభుత్వం శశిధరూర్ కి కలిగించింది. దాంతో కూడా ఆయన మీద ఒక్కసారిగా అనుమానాలు పెరిగాయి. ఇక తాజా ఉదంతంతో ఆయన కచ్చితంగా కాంగ్రెస్ కి దూరమే అన్న భావన కూడా వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు.

కీలక ఎన్నికల వేళ :

ఇక శశిధరూర్ కాంగ్రెస్ కి దూరం గా జరగడం అందునా కీలకంగా కేరళ ఎన్నికలు మారిన వేళ ఆయన గైర్ హాజరు కావడం మీద చర్చ సాగుతోంది. ఒక విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి భారంగా దూరంగా మారింగా బీజేపీకి అత్యంత కీలకం అవుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News