విజయ్ ఎంట్రీకి 'సంగీత'తో బీజేపీ చెక్? అంతా సినిమా స్కెచ్చేనా బాసూ!
అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోకి 'యాక్షన్' చెబితే... వెనుక నుంచి 'కట్' చెప్పడానికి ప్రత్యర్థులు రెడీగా ఉంటారు కదా! సరిగ్గా ఇప్పుడదే జరుగుతోంది.
తమిళనాడు రాజకీయాలు అంటేనే ఒక రేంజ్ లో ఉండే ట్విస్టులు, టర్న్‌లు గుర్తొస్తాయి. థియేటర్లలో విజయ్ విజిళ్లు వేయించడం పాత ముచ్చట... ఇప్పుడు ఆయన పొలిటికల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి రచ్చ లేపుతున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోకి 'యాక్షన్' చెబితే... వెనుక నుంచి 'కట్' చెప్పడానికి ప్రత్యర్థులు రెడీగా ఉంటారు కదా! సరిగ్గా ఇప్పుడదే జరుగుతోంది.
తమిళ పొలిటికల్ కారిడార్లలో ఒక మైండ్ బ్లోయింగ్ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) స్పీడ్ అందుకోవడమే ఆలస్యం... దానికి బ్రేకులు వేయడానికి ఢిల్లీ పెద్దలు ఒక సాలిడ్ 'మాస్టర్ ప్లాన్' వేశారట. అదేంటో తెలుసా? విజయ్ మాజీ భార్య సంగీతను పద్మం గూటికి చేర్చడం!
ప్లాన్ 'సంగీత'... డైరెక్షన్ బై బీజేపీ?
సోషల్ మీడియా, తమిళ తంబీల మీడియా సర్కిల్స్ లో నడుస్తున్న టాక్ ప్రకారం... విజయ్ పొలిటికల్ మైలేజ్ కి కత్తెర వేయాలంటే ఈమాత్రం ప్లానింగ్ ఉండాలట. ఆయన పర్సనల్ లైఫ్‌ను పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పైకి తెచ్చి రాజకీయంగా వాడుకోవాలనేది కొందరి వ్యూహం లాగా కనిపిస్తోంది.
ఈ ఆపరేషన్‌ను బీజేపీలో ఉన్న ఒక సీనియర్ నటి భుజాన వేసుకుని సంగీతతో రాయబారాలు నడుపుతున్నారట. "అమ్మా సంగీతా... నువ్వు పార్టీలోకి రా.. నీకు సముచిత స్థానం ఇస్తాం.. అక్కడ ఆయనకు గట్టి పోటీ ఇద్దాం" అంటూ డైలాగులు కూడా చెప్తున్నారట.
అసలు సీన్ లో మేటర్ ఉందా? అంతా ఉత్తుత్తిదేనా?
ఈ వార్త వినడానికి 'కత్తి' లాంటి సినిమా స్క్రిప్ట్ లానే ఉంది కానీ, ఇందులో ఎంతవరకు నిజం ఉందనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. విజయ్ భార్య సంగీత ఎప్పుడైనా మైక్ పట్టుకుని పాలిటిక్స్ మాట్లాడటం ఎవరైనా చూశారా? లేదు. ఆమెకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో ఎవరికీ తెలియదు. బీజేపీ అఫీషియల్ గా ఈ విషయం చెప్పలేదు.. "అబ్బే.. మాకేం సంబంధం లేదు" అనలేదు.. అలాగని "మేము పిలుస్తున్నాం" అని బోర్డు తిప్పలేదు. విజయ్ క్యాంప్ అయితే ఈ గాసిప్స్ ను అస్సలు పట్టించుకోనట్టు తమ పని తాము చేసుకుపోతోంది.
సినిమా వేరు.. రాజకీయం వేరు బాస్!
రాజకీయాల్లోకి రాకముందు వరకు పర్సనల్ లైఫ్ ప్రైవేట్ గా ఉంటుంది. కానీ వన్స్ ఖాదీ చొక్కా వేసుకున్నాక... ఇంట్లో పిల్లి పాలు తాగినా అది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. విజయ్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఏదేమైనా ఈ 'సంగీత' పొలిటికల్ ఎంట్రీ వార్త నిజంగానే బీజేపీ వేసిన వ్యూహాత్మక అడుగా? లేక విజయ్ గ్రాఫ్‌ను తగ్గించడానికి ప్రత్యర్థులు వదిలిన 'ఫేక్ బాంబా'? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటివరకు ఈ పొలిటికల్ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేయడమే మన పని..
ఇది నిజంగానే బీజేపీ మాస్టర్ స్ట్రోకా? లేక కేవలం పొలిటికల్ గాసిప్పేనా? అన్నది వేచిచూడాలి.