బీహార్‌లో చిత్రం: ఇటు ప్రమాణం-అటు మౌన దీక్ష!
బీహార్‌లో చిత్రమైన రాజకీయం చోటు చేసుకుంది. ఒకవైపు రాష్ట్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరింది.;
బీహార్‌లో చిత్రమైన రాజకీయం చోటు చేసుకుంది. ఒకవైపు రాష్ట్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరింది. దీనికి సంబంధించిన సంబరాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మరోవైపు.. రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్.. ఎన్నికల్లో తమ పార్టీ ఘోరపరాజయానికి నిరస నగా.. భితిహర్వాలోని గాంధీ ఆశ్రమంలో నిరాహార దీక్ష, మౌన దీక్షలనుఏకకాలంలో చేపట్టారు. దీంతో ఈ రెండు వ్యవహారాలు కూడా. . జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో విజయం దక్కిం చుకుంది. దీంతో తాజాగా మరోసారి అధికార పగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా జేడీయూ సారథి.. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనతోపాటు మరో 27 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. అంగరంగ వైభవంగా పాట్నాలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యా రు. ఇదిలావుంటే.. మరోవైపు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని పక్షాలకు ఘోర పరాజయం ఎదురైంది. ముఖ్యంగా రాష్ట్రంలో మార్పు తీసుకువస్తానంటూ.. రాజకీయాల్లోకి వచ్చిన వ్యూహకర్త కిషోర్.. తీవ్రంగా దెబ్బతిన్నారు. ఒక్క సీటులో కూడా విజయం దక్కించుకోలేక పోయారు. దీంతో ఈ ఓటమికి తానే బాధ్యత వహిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన నిరాహార, మౌన దీక్షలకు దిగారు.
భితిహర్వాలోని గాంధీ ఆశ్రమంలో చేపట్టిన ప్రశాంత్ దీక్షకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ దీక్ష ద్వారా.. ఆయన ఏం చెప్పాలనుకున్నారన్న విషయంపై స్పష్టత లేదు. కానీ, ఈ వ్యవహారంపై ఇతర రాజకీయ పార్టీల నాయకులు మాత్రం మౌనంగా ఉన్నారు. పైగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న సందడిలోనూ కనిపించారు. అయితే.. కేవలం ఏడాది కాలంలోనే ఎన్నికలకు దిగడం, భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో పీకే బాగా హర్ట్ అయి ఉన్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.